స్టాక్‌ మార్కెట్లు నేడు 'బేర్‌'మన్నాయి! నష్టాల్లోనే మొదలై నష్టాల్లోనే ముగిశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లు బలహీన సంకేతాలు ఇవ్వడం, నెగెటివ్‌ సెంటిమెంట్‌ ఉండటంతో గురువారం సూచీలు ఎరుపు రంగులోనే ఉన్నాయి. సెన్సెక్స్‌ 433 పాయింట్ల వరకు నష్టపోగా నిఫ్టీ 17,900 దిగువన ముగిసింది.


క్రితం రోజు 60,352 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ గురువారం ఉదయం భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 60,291 వద్ద మొదలైంది. 59,656 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ తర్వాత కాస్త కోలుకుంది. చివరికి 433 పాయింట్ల నష్టంతో 59,919 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 130 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 17,967 వద్ద మొదలైన సూచీ 17,798 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 17,886 వద్ద ముగిసింది.


ద్రవ్యోల్బణం సూచనలు రావడంతో బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, ఫార్మా సూచీలు 1-2 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం వరకు నష్టపోయాయి. లోహ సూచీ మాత్రం లాభాల్లోనే కదలాడింది. నిఫ్టీలో టైటాన్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టీసీఎస్‌, ఎం అండ్‌ ఎం లాభపడగా ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌మహీంద్రా నష్టపోయాయి.


మార్కెట్‌ కబుర్లు
* సఫైర్‌ ఫుడ్స్‌ ఐపీవోను ఆఖరి రోజు 5.43 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు.
* హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ రెండో త్రైమాసికంలో రూ.848.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది 38.3 శాతం వృద్ధి.
* భారత్‌ డైనమిక్స్‌  నికర లాభం రెండో త్రైమాసికంలో 64.9 శాతం పెరిగి రూ.43.2 కోట్లుగా నమోదైంది.
* సఫైర్‌ ఫుడ్స్‌ ఐపీవోకు 4.82 రెట్లు స్పందన లభించింది.
* మ్యాట్రిమోనీ డాట్‌ కామ్‌ నికర లాభం 66 శాతం పెరిగి రూ.16.6 కోట్లుగా ఉంది.
* నాట్కో ఫార్మా నికర లాభం క్యూ2లో 67.8 శాతం పెరిగి రూ.65 కోట్లుగా ఉంది.






Also Read: Credit Card Spends: అయ్య బాబోయ్‌..! క్రెడిట్‌ కార్డులతో లక్ష కోట్లు గీకేశారు..! రికార్డులు బద్దలు


Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!


Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి