Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 06 మే 2024) గ్యాప్‌-అప్‌ స్కోర్‌తో ఓపెన్‌ అయ్యాయి. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌ పెరుగుదల కారణంగా, మార్కెట్లు మంచి ఆరంభాన్ని ఇచ్చాయి. అయితే, క్రమంగా వాటి జోరు తగ్గుతూ వచ్చింది.


ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (శుక్రవారం) 73,878 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 318.53 పాయింట్లు లేదా 0.43 శాతం పెరుగుదలతో 74,196.68 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 22,475 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 85.75 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 22,561.60 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో... BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.10 శాతం & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.10 శాతం చొప్పున పెరిగాయి.


మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 20 షేర్లు లాభపడగా, 10 షేర్లు క్షీణించాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో... కోటక్ మహీంద్రా బ్యాంక్ అత్యధికంగా 4.45 శాతం లాభపడింది. బ్రిటానియా 2.84 శాతం పెరిగింది. టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్స్యూమర్, సన్ ఫార్మా, ఎం&ఎం, ఐషర్ మోటార్స్ షేర్లు రైజింగ్‌లో ఉన్నాయి. మరోవైపు... టైటన్ షేర్లు 4.12 శాతం పతనమయ్యాయి. కోల్ ఇండియా, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు కూడా నష్టపోయాయి.


నిఫ్టీ50 ప్యాక్‌లో.. 30 షేర్లు బలపడగా, 20 షేర్లు డీలాపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. టైటన్ షేర్లు 4 శాతం క్షీణించాయి. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ షేర్లు కూడా నష్టపోయాయి.


రంగాల వారీగా చూస్తే.. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్, ఆటో, రియల్టీ, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఆర్థిక సేవలు, మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌ సెక్టార్లు వడలిపోయాయి.


భారతదేశ స్టాక్‌ మార్కెట్ల అస్థిరత సూచీ ఇండియా విక్స్‌ (India VIX) భారీగా పెరిగింది, దాదాపు 17 శాతం జంప్‌తో ట్రేడవుతోంది.


ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 212.98 పాయింట్లు లేదా 0.23% పెరిగి 74,091.13 దగ్గర; NSE నిఫ్టీ ఫ్లాట్‌గా 22,475.05 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, ఈ ఉదయం.. హాంగ్‌కాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్ 0.11 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 ఇండెక్స్‌ 0.59 శాతం లాభపడింది. జపాన్‌కు చెందిన నికాయ్‌, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి ఈ రోజు సెలవు తీసుకున్నాయి.


US నాన్‌ఫార్మ్ పేరోల్స్ డేటా తర్వాత, శుక్రవారం, అమెరికన్‌ మార్కెట్లు సానుకూలంగా క్లోజ్‌ అయ్యాయి. నాస్‌డాక్ 1.99 శాతం లాభంతో ముగిస్తే, S&P 500 ఇండెక్స్‌ 1.26 శాతం పెరిగింది. డౌ జోన్స్‌ కూడా 1.26 శాతం విలువను పెంచుకుంది.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.5% కంటే స్వల్పంగా దిగువకు చేరింది, 4.498% వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా తగ్గాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83 వద్దకు చేరింది. యూఎస్‌లో జాబ్‌ డేటా అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేపట్టడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఔన్సుకు $2,322 డాలర్లకు పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: గృహ రుణాలపై షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ, ఇంటి అప్పుల్లో ఇంత స్పీడా?