Stock Market News Today in Telugu: మూడు రోజుల వరుస సెలవుల తర్వాత, కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజున భారతీయ స్టాక్ మార్కెట్ పటిష్టంగా ప్రారంభమైంది. ఈ రోజు (సోమవారం, 01 ఏప్రిల్‌ 2024) బలాన్ని ప్రదర్శించిన సెన్సెక్స్‌, ట్రేడ్‌ ప్రారంభమైన వెంటనే 74,000 మార్క్‌ పైకి చేరింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ప్రారంభ సెషన్‌లో దాదాపు 600 పాయింట్లు లాభపడి 74,254.62 వద్ద కొత్త గరిష్ట స్థాయిని ‍(Sensex at fresh all-time high) తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 200 పాయింట్ల జంప్‌తో 22,529.95 దగ్గర (Nifty at fresh all-time high) ఆల్‌టైమ్‌ హైని టచ్‌ చేసింది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (గురువారం) 73,651 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 317.27 పాయింట్లు లేదా 0.43 శాతం పెరుగుదలతో 73,968.62 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 22,327 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 128.10 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 22,455.00 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లు స్మార్ట్‌గా రియాక్ట్‌ అయ్యాయి. BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 1.2 శాతం, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 1.6 శాతం పెరిగాయి.


ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 2 షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతుండగా, 28 స్టాక్స్ గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2 శాతం, టాటా స్టీల్ 1.70 శాతం లాభపడ్డాయి. కోటక్ బ్యాంక్ 1.55 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.25 శాతం పెరిగాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 1.15 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.11 శాతం జంప్‌ చేశాయి.


ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 539.66 పాయింట్లు లేదా 0.73% పెరిగి 74,191.01 దగ్గర; NSE నిఫ్టీ 185.00 పాయింట్లు లేదా 0.83% పెరిగి 22,511.90 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో.. ఈ ఉదయం ఆస్ట్రేలియా & హాంకాంగ్ బెంచ్‌మార్క్‌లు దాదాపు 1 శాతం లాభాల్లో ఉన్నాయి, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.7 శాతం లాభంతో, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.4 శాతం బలంతో కనిపించాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ 0.6 శాతం క్షీణించింది. సెప్టెంబర్‌ తర్వాత తొలిసారిగా ఈ ఏడాది మార్చిలో చైనా తన తయారీ కార్యకలాపాలు పెరగడంతో ఆసియా స్టాక్స్‌ సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి.


అమెరికన్‌ మార్కెట్లలో, శుక్రవారం, డౌ జోన్స్‌, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 100 పాయింట్లకు పైగా పెరిగాయి. యూఎస్‌లో 'వ్యక్తిగత వినియోగ వ్యయాల' (PCE) సూచీ నెలలో (MoM) 0.3 శాతం పెరిగింది. ఈ రోజు రాత్రి US మార్కెట్ ఈ గణాంకాలపై ప్రతిస్పందిస్తుంది, 


అమెరికాలో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా పెరిగి 4.20 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ భారీగా పెరిగాయి, బ్యారెల్‌కు $87 పైన ట్రేడవుతున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: లోక్‌సభ ఎన్నికల ముందు కానుక, తగ్గిన గ్యాస్‌ సిలిండర్ రేట్లు