Krishna District MLA And MP Candidates: కృష్ణా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్న అభ్యర్థుల లెక్క తేలింది. మార్పులు, చేర్పులు, సామాజిక సమీకరణాలు, ఆర్థిక, అంగ బలం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఆయా పార్టీలు ఖరారు చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా జిల్లాలోని ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఫలితాల ఆసక్తిని రేపుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు.. రానున్న సార్వత్రిక ఎన్నికలు నాటికి మరో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అటువంటి అభ్యర్థులు ఈ జిల్లాలో కొంచెం ఎక్కువగానే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు మీకోసం. 

పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే..

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ, కూటమి అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం (Tiruvuru Assembly constituency )నుంచి వైసీపీ అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాస్‌(Nallagatla Swamy Das ) పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్‌(Kolikapudi Srinivasa Rao) పోటీ చేస్తున్నారు. పామర్రు( Pamarru Assembly constituency ) నుంచి వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్‌ కుమార్‌(Anil Kumar Kaile) బరిలోకి దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి వర్ల కుమార్‌ రాజా(Varla Kumar Raja) పోటీ చేస్తున్నారు. నందిగామ(Nandigam Assembly Constituency) నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు(Monditoka Jagan Mohanarao) పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన తంగిరాల సౌమ్య(Tangirala Sowmya) బరిలోకి దిగుతున్నారు. నూజివీడు(Nuzividu Assembly Constituency) అభ్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు(Meka Venkata Pratap Apparao) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) పోటీ చేస్తున్నారు. జగ్గయ్యపేట(Jaggayyapeta Assembly Constituency) నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(Samineni Udaya Bhanu) వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య(Sreeram Rajagopal Tataiah) బరిలోకి దిగుతున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి
తిరువూరు  నల్లగట్ల స్వామిదాస్‌ కొలికపూడి శ్రీనివాస్‌( టీడీపీ)
పామర్రు కైలే అనిల్‌ కుమార్‌ వర్ల కుమార్‌ రాజా( టీడీపీ)
నందిగామ మొండితోక జగన్మోహన్‌రావు తంగిరాల సౌమ్య( టీడీపీ)
నూజివీడు మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు కొలుసు పార్థసారథి( టీడీపీ)
జగ్గయ్యపేట సామినేని ఉదయభాను శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య( టీడీపీ)

 

మైలవరం(Mylavaram Assembly constituency ) నుంచి వైసీపీ అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు(Sarnala Tirupati Rao) పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృస్ణ ప్రసాద్‌(Vasantha Venkata Krishna Prasad) వైసీపీ నుంచి టీడీపీలో చేరి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ జిల్లాలో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న మరో నియోజకవర్గం గన్నవరం(Gannavaram Assembly constituency). ఇక్కడి నుంచి గత న్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ మోహన్‌(Vallabhaneni Vamsi Mohan ) వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీలో ఉండి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkat Rao) కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. ఇదే జిల్లాలో మరో కీలక నియోకజవర్గం గుడివాడ(Gudivada Assembly constituency). ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన కొడాలి నాని(Kodali Nani) మరోసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నిన తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిగా వెనిగండ్ల రాము(Venigandla Ramu)ను బరిలోకి దించుతోంది. ఎన్‌ఆర్‌ఐ అయిన ఈయన కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం(Avanigadda Assembly constituency) నుంచి వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్‌ బాబు(Simhadri Ramesh Babu) పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన బలమైన వ్యక్తిని బరిలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. టీడీపీ లీడర్‌ మండలి బుద్ద ప్రసాద్‌(Mandali Buddha Prasad) ను పార్టీలో చేర్చుకొని సీటు ఇవ్వనున్నారు.  

ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి
మైలవరం సర్నాల తిరుపతిరావు వసంత కృస్ణ ప్రసాద్‌( టీడీపీ)
గన్నవరం వల్లభనేని వంశీ మోహన్‌ యార్లగడ్డ వెంకట్రావు( టీడీపీ)
గుడివాడ కొడాలి నాని వెనిగండ్ల రాము( టీడీపీ)
అవనిగడ్డ సింహాద్రి రమేష్‌ బాబు మండలి బుద్ద ప్రసాద్‌(జనసేన)

పెనమలూరు(Penamaluru Assembly constituency) నుంచి మాజీ మంత్రి జోగి రమేష్‌(Jogi Ramesh) వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన బోడె ప్రసాద్‌(Bode Prasad ) పోటీ చేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గం(Kaikalur Assembly constituency) నుంచి వైసీపీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు(Dulam Nageswara Rao ) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌(Kamineni Srinivas) బరిలోకి దిగుతున్నారు. పెడన(Pedana Assembly constituency ) నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉప్పల రాము(Uppala Ramu) పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్‌(Kagitha Krishna Prasad) బరిలోకి దిగుతున్నారు. విజయవాడ వెస్ట్‌(Vijayawada West Assembly constituency) నుచి వైసీపీ అభ్యర్థిగా షేక్‌ ఆసిఫ్‌(Sheikh Asif) పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి(Y. S. Chowdary) బరిలోకి దిగుతున్నారు. మచిలీపట్నం (Machilipatnam Assembly constituency) నుంచి మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) (Perni Krishnamurthy)వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) పోటీ చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌(Vijayawada Central Assembly constituency) నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌(Vellampalli Srinivas) వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బోండా ఉమా మహేశ్వరరావు(Bonda Umamaheswara Rao) పోటీ చేస్తున్నారు. విజయవాడ ఈస్ట్‌ (Vijayawada East Assembly constituency)నుంచి వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌(Devineni Avinash) బరిలోకి దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ (Gadde Ramamohan ) బరిలోకి దిగుతున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి
పెనమలూరు జోగి రమేష్‌ బోడె ప్రసాద్‌( టీడీపీ)
కైకలూరు దూలం నాగేశ్వరరావు కామినేని శ్రీనివాస్‌(బీజేపీ)
పెడన ఉప్పల రాము కాగిత కృష్ణ ప్రసాద్‌( టీడీపీ)
విజయవాడ వెస్ట్‌ షేక్‌ ఆసిఫ్‌ సుజనా చౌదరి(బీజేపీ)
మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి కొల్లు రవీంద్ర( టీడీపీ)
విజయవాడ సెంట్రల్‌ వెల్లంపల్లి శ్రీనివాస్‌ బొండా ఉమా మహేశ్వరరావు( టీడీపీ)
విజయవాడ ఈస్ట్‌ దేవినేని అవినాష్‌ గద్దె రామ్మోహన్‌( టీడీపీ)

ఎంపీ అభ్యర్థులు 

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి
విజయవాడ కేశినేని నాని కేశినేని చిన్ని(టీడీపీ)
మచిలీపట్నం  సింహాద్రి చంద్రశేఖర్ రావు  బాలశౌరి(జనసేన)