Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్‌ మందు బాటిల్ తీసుకొని హాల్‌లోకి రావడంతో మధు గొడవ పడతాడు. ఇంతలో భవాని వచ్చి ఏంటీ గొడవ అని ఆదర్శ్‌ని అడుతుంది. మీరాతో పాటు ఇంట్లో అందరూ అక్కడికి వస్తారు. 


ఆదర్శ్‌: వీళ్లందరూ కలిసి నన్ను అవమానిస్తున్నారు. నేను నీ కొడుకును కాదు కదా అందుకే వీళ్లందరికీ నేను లోకువ అయిపోయాను. నన్ను పరాయి వాళ్లని చూసినట్లు చూస్తున్నారు.  
భవాని: ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా ఇప్పుడు నిన్ను ఎవర్రా తక్కువ చేసింది.
ఆదర్శ్‌: అందరూ.. అసలు నాకు నా మాటలకు ఈ ఇంట్లో విలువ లేదమ్మా. నాకు అన్యాయం చేసిన వాళ్లకి ఉన్న విలువ కూడా నాకు లేదు. చివరకి దారిన పోయిన వాళ్లని ఇంట్లో పెట్టుకొని వాళ్లకి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వడం లేదు.
మీరా: మనసులో.. ఇది నా గురించే అన్నాడు. వీలైనంత తొందరగా ఆదర్శ్‌ మనసు మార్చేయాలి. నావైపు తిప్పుకోవాలి. లేదంటే నన్ను ఇంట్లో ఉండనివ్వడు.
రేవతి: అసలు ఇప్పుడేమైంది ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్.
మధు: ఏం లేదు పెద్దమ్మ ఇక్కడ తాగుతా అంటే పెద్ద పెద్దమ్మ చూసి బాధ పడుతుంది. నీ రూంకి వెళ్లి తాగు అన్నాను. అంతే అందుకే ఇలా మాట్లాడుతున్నాడు.
ఆదర్శ్‌: చూశారా ఎందుకు పనికి రాని వీడు కూడా నేను ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో చెప్తున్నాడు.
రేవతి: ఆపు ఆదర్శ్‌ వాడిని ఎందుకు పనికి రాడు అంటున్నావ్. మీరందరూ అన్న తమ్ముడు అని వాడి గురించి ఆలోచిస్తున్నారు కానీ వాడికి అదే ప్రేమ మీ మీద లేదుగా. మురారి ఏ తప్పు చేయలేదు అని లోకం మొత్తం తెలిసినా వీడికి మాత్రం అర్థం కాలేదు. క్షమించండి అక్క నేను మాట్లాడింది తప్పు అయితే..
భవాని: నువ్వు మాట్లాడింది తప్పు అయితే నేను నిన్ను అసలు మాట్లాడించేదాన్నే కాదు. 
మురారి: అయినా ఇప్పుడు వాడి బాధ ఏంటి.. నేను ఇప్పుడు తప్పు చేశాను అని వాడు నమ్ముతున్నాడు కాబట్టి నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలా.. ఒప్పుకోకపోతే లెక్క చేయనట్లా.. విలువ ఇవ్వకపోయినట్లా.. పరాయి వాడిగా చూసినట్లా.. 
కృష్ణ: పోనీ సొంత మనిషి అనుకోవాలి అంటే ఏం చేయాలో చెప్పమనండి అత్తయ్య.
భవాని: అడుగుతుందిగా చెప్పు. అందరూ పరాయి వాళ్లలా చూస్తున్నారు అంటే నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన నన్ను కూడా కలిపినట్లే కదా.. చెప్పురా చెప్పు.. ఇంకా ఏం చేస్తే నమ్ముతావు.
ఆదర్శ్‌: ఏమైనా చేస్తావా అమ్మ..
భవాని: చెప్పు..
ఆదర్శ్‌: అయితే ఈ ఇళ్లు, ఈ ఆస్తి నా పేరు మీద రాసేయ్. అప్పుడు ఈ ఇళ్లు నా సొంతం అవుతుంది. అప్పుడు నేనే డిసైడ్ చేస్తా ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో.
భవాని: భవాని లాగిపెట్టి ఒక్కటిచ్చి.. చంపేస్తా పిచ్చి పిచ్చిగా వాగావు అంటే..
మీరా: మనసులో.. ఇదే సరైన టైం ఆదర్శ్‌ని నా వైపు తిప్పుకోవడానికి.
భవాని: ఎవరిని వేరుగా చూశాను రా ఈ ఇంట్లో అందరూ నా ప్రాణం. ఏ ఒక్కర్ని వదులుకున్నా నా ప్రాణం వదులుకున్నట్లే. చెప్పు నా ప్రాణం తీసేస్తావా..
మీరా: మేడం వదిలేయండి మేడం. అని మీరా ఆదర్శ్‌ను తీసుకెళ్తుంది. భవాని కూర్చొని బాధ పడుతుంది. అందరూ బాధ పడతారు. 


మీరా ఆదర్శ్‌కి మందు పోస్తుంది. ముకుంద నీ గురించే ఆలోచించింది అని మీరా ఆదర్శ్‌కి చెప్తుంది. ఆదర్శ్‌ నమ్మకపోయినా మీరా ముకుంద ఆదర్శ్‌ గురించి పాజిటివ్‌గా ఆలోచించింది అని చెప్తుంది. ముకుంద ఆదర్శ్‌తో కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంది అని కానీ ఎవరో తన మనసు మార్చేశారని చెప్తుంది. ఆదర్శ్‌ ముకుంద గురించి పాజిటివ్‌గా మాట్లాడుతాడు. తనకు ముకుంద ఇలాగే మందు పోసి ఇచ్చేది అని ఇప్పుడు నువ్వు ఇలా మందు పోస్తున్నావ్ అని అంటుంది మీరా.. ఇంతలో మురారి అక్కడికి వస్తే ఆదర్శ్‌ కోపంతో రగిలిపోతాడు. మురారిని వెళ్లిపోమని చెప్పమని చిరాకు పడతాడు. దీంతో మీరా మురారి పక్కకు తీసుకెళ్తుంది. 


మీరా మురారి చేయి పట్టుకొని ఓదార్చుతుంది. మురారిని ప్రేమగా చూసి దగ్గరకు వెళ్తుంది మీరా. మురారి ధైర్యం చెప్తుంది. మురారి వెళ్లిపోయిన తర్వాత మురారి ఇంత దగ్గరగా ఉంటే తాకకుండా కౌగిలించుకోకుండా దూరంగా ఉండటం కష్టంగా ఉంది అనుకుంటుంది. 


మరోవైపు భవాని ఆదర్శ్ మాటలు తలచుకొని బాధ పడుతుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది. భవానికి కృష్ణ ఆదర్శ్‌ గురించి మంచిగా చెప్తుంది. వాడి కోసం మిమల్ని పంపించేయమన్నాడు అని ఎక్కువ మాట్లాడితే వాడే వెళ్లిపోతాడు అని భవాని అంటుంది. ఆదర్శ్‌ని తిరిగి తీసుకొని వచ్చినందుకు మీ మీద కోపంగా ఉందని భవాని అంటుంది. దీంతో కృష్ణ క్షమాపణలు అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ ఏప్రిల్ 1st: దెయ్యమై వచ్చి సుమనకు చుక్కలు చూపించిన పెద్దబొట్టమ్మ - నిజం తెలుసుకున్న నయని!