Stock market news in Telugu: ఫండమెంటల్స్‌ బలంగా ఉండి, భవిష్యత్‌ చిత్రం బాగున్న కంపెనీలకు రేటింగ్‌ & టార్గెట్‌ ధరలను బ్రోకింగ్‌ కంపెనీలు అప్‌గ్రేడ్‌ చేస్తాయి. అదే విధంగా... ఫండమెంటల్స్‌ వీక్‌గా ఉండి, భవిష్యత్‌ ప్రతికూలంగా మారొచ్చని భావిస్తే, అలాంటి కంపెనీల స్టాక్స్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తాయి. గత నెల రోజుల్లో, చాలా స్టాక్స్‌కు టార్గెట్ ధరలను బ్రోకింగ్‌ సంస్థలు తగ్గించాయి. ఈ కథనానికి ట్రెండ్‌లైన్ డేటా ఆధారం.


టార్గెట్ ధరల్లో కోతలు పడిన 7 స్టాక్స్‌ (stocks that earned downgrades):


రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries stock target price 2023)   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 2,388
రిలయన్స్ ఇండస్ట్రీస్ టార్గెట్ ప్రైస్‌ను ఐదు బ్రోకింగ్‌ కంపెనీలు తగ్గించాయి. ప్రస్తుతం, సగటు టార్గెట్ ధర రూ. 2,770. ఇది, ప్రస్తుత మార్కెట్ ధరల కంటే దాదాపు 16% అప్‌సైడ్‌. 


నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ (Navin Fluorine International stock target price 2023)   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 3,694
నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్‌ టార్గెట్ ధరకు కూడా ఐదు బ్రోకింగ్‌ సంస్థలు కోత పెట్టాయి. ప్రస్తుతం, సగటు టార్గెట్ ధర రూ. 3,951. ఇది, ప్రస్తుత మార్కెట్ ధర కంటే దాదాపు 7% పెరుగుదలకు గుర్తు.


ఏషియన్ పెయింట్స్ (Asian Paints stock target price 2023)    |    ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 3,158
ఐదు బ్రోకింగ్‌ ఫర్మ్స్‌ ఏషియన్ పెయింట్స్‌ టార్గెట్ ధరను కట్‌ చేసినట్లు ట్రెండ్‌లైన్ డేటా చూపుతోంది. ప్రస్తుతం సగటు టార్గెట్ ధర రూ. 3,252. ఇది, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 3% వృద్ధిని చూపుతోంది.


యూపీఎల్ ‍(UPL stock target price 2023)    |    ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 564
నలుగురు బ్రోకర్లు UPL టార్గెట్ ప్రైస్‌ను తగ్గించారు. ప్రస్తుతం, సగటు టార్గెట్ ధర రూ. 680. ఇది, ప్రస్తుత మార్కెట్ ధరల కంటే 21% ఎక్కువ.


ఎస్‌ఆర్‌ఎఫ్‌ (SRF stock target price 2023)   |    ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 2,346
SRF టార్గెట్‌ ధరను కూడా నాలుగు బ్రోకింగ్‌ కంపెనీలు కత్తిరించాయి. ప్రస్తుతం, సగటు టార్గెట్ ధర రూ. 2,469. ఇది, ప్రస్తుత మార్కెట్ ధరల నుంచి 5% ర్యాలీకి ఇండికేటర్‌.


పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ (Petronet LNG stock target price 2023)   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ 196.5
పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లక్ష్యాన్ని నాలుగు బ్రోకరేజ్‌లు కుదించాయని ట్రెండ్‌లైన్ డేటా చూపిస్తోంది. ప్రస్తుతం, సగటు టార్గెట్ ధర రూ. 231. ప్రస్తుత మార్కెట్ ధరల కంటే 17% అప్‌సైడ్‌కు ఇది గుర్తు.


ఎస్‌బీఐ కార్డ్ ‍‌(SBI Card stock target price 2023)   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ 735
SBI కార్డ్‌కు ముగ్గురు బ్రోకర్లు కత్తెర వేశారు. ప్రస్తుతం, స్టాక్‌ సగటు టార్గెట్ ధర రూ. 876. ప్రస్తుత మార్కెట్ ధరల కంటే 19% పెరుగుదలను ఇది సూచిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌లో బూమ్‌ - 20,000 పాయింట్ల మార్క్‌ను మళ్లీ చేరిన నిఫ్టీ


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply