Stock Market Today News in Telugu: ఈ రోజు (బుధవారం, 29 నవంబర్‌ 2023) ఇండియన్‌ స్టాక్ మార్కెట్ల ఆరంభం అదిరింది. ఈ రోజు ఆసియా మార్కెట్ల నుంచి పెద్దగా సానుకూల పవనాలు లేకపోయినా... నిన్న చివరి గంటలో తర్వాత మన మార్కెట్‌లో కనిపించిన బూమ్‌ ఈ రోజు కూడా కంటిన్యూ అయింది. సెన్సెక్స్‌ 200 పాయింట్లు పైగా లాభంతో ఓపెన్‌ అయింది, ఆ తర్వాత కూడా పైకి దూసుకెళ్లింది. అత్యంత కీలకమైన 20,000 మార్క్‌కు అతి సమీపంలో ప్రారంభమైన నిఫ్టీ ఇండెక్స్‌, తొలి అరగంటలోపే 20k మార్క్‌ను టచ్‌ చేసింది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (మంగళవారం, 28 నవంబర్‌ 2023) 65,174 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 207 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 66,381 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గత సెషన్‌లో 19,890 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 86.85 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 19,976 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


టాప్‌ గెయినర్స్‌ & లూజర్స్‌
ఈ మార్కెట్‌ ప్రారంభ లాభాలను హెవీ వెయిట్స్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుండి నడిపించాయి. టాప్‌ గెయినర్స్‌లోని మిగిలిన షేర్లు భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా వాటితో జత కలిశాయి. అదే సమయంలో.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌‍‌ (ONGC) షేర్లు టాప్‌ లూజర్స్‌గా మారాయి, నిఫ్టీ50 ఇండెక్స్‌ను 20,000 పాయింట్ల దిగువకు లాగడానికి ప్రయత్నించాయి.


ఉదయం 10.30 గంటల సమయానికి, బీఎస్‌ఈ సెన్సెక్స్ 392.48 పాయింట్లు లేదా 0.59% పెరిగి 66,566.68 వద్ద; నిఫ్టీ 117.30 పాయింట్లు లేదా 0.59% గెయిన్స్‌తో 19,823.80 వద్ద ట్రేడవుతున్నాయి.  


ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెన్ సెషన్‌లో, S&P BSE సెన్సెక్స్ ఇండెక్స్ 206.59 పాయింట్లు లేదా 0.3% పెరిగి 66,380.80 వద్ద ఉండగా; నిఫ్టీ 95 పాయింట్లు లేదా 0.4% పెరిగి 19,976.55 వద్ద ఉంది.


కొనసాగుతున్న అదానీ షేర్ల జోరు
అదానీ గ్రూప్ స్టాక్స్‌ జోరు ఈ రోజు కూడా కొనసాగుతోంది, మార్నింగ్‌ సెషన్‌లో మరో రూ.56,743 కోట్ల సంపదను పెంచుకున్నాయి. ఇంట్రాడేలో, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (Adani Group stocks market capitalization) రూ.11.85 లక్షల కోట్లకు చేరుకుంది.


56% ప్రీమియంతో IREDA అరంగేట్రం
ఈ మార్కెట్‌లో కనిపించిన బూమ్‌ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (IREDA) షేర్లకు కూడా కలిసొచ్చింది. ఇరెడా షేర్లు IPO ప్రైస్‌ కంటే దాదాపు 20% ప్రీమియంతో లిస్ట్‌ అవుతాయని మార్కెట్‌ అంచనా వేస్తే, అవి ఏకంగా 56.25% హై రేట్‌తో ప్రారంభమయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ప్రతి ఆరు షేర్లకు ఒక షేరు, టీసీఎస్‌ యాక్సెప్టెన్స్‌ రేషియో ఇదే, తేదీలు కూడా వచ్చేశాయ్‌


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply