Gruhalakshmi Telugu Serial Today Episode: బసవయ్య, ప్రసూనాంబ బయట గార్డెన్‌లో పని చేయలేకపోతున్నామని తమను క్షమించమని విక్రమ్‌ను అడగుతారు. అయితే క్షమిస్తానని కానీ ఇంట్లోంచి వెళ్లిపోండని విక్రమ్‌ ఆర్డర్‌ వేస్తాడు. దీంతో షాక్‌ అయిన బసవయ్య మాకు తోటపనే బెటర్‌ అంటాడు.  దివ్య, విక్రమ్‌ హాస్పిటల్‌కు వెళ్తుంటే.. దివ్య లోపల ఉన్న ప్రియను పిలిచి..


దివ్య: పాపం కష్టపడుతున్నారు. నీరసం వస్తుందేమో గంటగంటకి జ్యూస్‌ ఇస్తుండు. ఆకలి అన్నప్పుడల్లా తినడానికి ఏదో ఒకటి ఇవ్వు. ఎండ భరించలేకపోతే కాస్త గొడుగు పట్టు.


అని దివ్య చెప్పగానే బసవయ్య, ప్రసూనాంబ సంతోషంగా మీ పెద్ద మనసుకు వందనాలు అని చెప్తారు. అప్పుడు దివ్య ఇవ్వన్నీ మీకు కాదు మీతో పని చేయించే తాతయ్య గారికి అంటూ చెప్పగానే షాక్‌ అవుతారు.  నందగోపాల్‌ ఆఫీసుకు వెళ్లడానికి  రెడీ అయి తులసి కోసం ఎదురు చూస్తుంటాడు. తులసి రెడీ అయ్యి హనిని తీసుకుని హాల్లో కూర్చున్న అత్తమామల దగ్గరు వచ్చి


తులసి: అత్తయ్య, మామయ్యా హనిని స్కూల్‌లో దింపి అటునుంచి అటే ఆఫీసుకు వెళ్తాను. ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్‌ తీసుకోండి.


అనసూయ: మరి వాడి సంగతి అమ్మా..


తులసి: ఎవరత్తయ్యా?


అనసూయ: నందు ఆఫీసుకు రావాలా? వద్దా అని.. అంటే ఇందాకా గొడవ అదీ అని..


తులసి: అత్తయ్య ఆయన వల్ల నా మనసు గాయపడింది. తీరని నష్టం జరిగింది. అయినా కూడా నేను మౌనంగా ఉంటే వ్యక్తిత్వం లేనిదానిని అవుతాను. నా బాధ తెలిసేలా చేయకపోతే ఇంకోసారి గాయం చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.


   అంటూ తులసి చెప్తూనే ఆయనపై తనకు ఎలాంటి పగ ప్రతీకారాలు లేవని.. నందగోపాల్‌ ఆఫీసుకు వచ్చినా… రాకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పి తులసి వెళ్లిపోతుంది. చాటు నుంచి తులసి మాటలు విన్న నందగోపాల్‌ ఆఫీసుకు వెళ్లడానికే నిర్ణయం తీసుకుంటాడు.  లాస్య, తులసి ఆఫీసులో తనకోసం పనిచేస్తున్న ఉద్యోగికి ఫోన్‌ చేసి  నందగోపాల్‌ బార్‌లో తాగి గొడవపడ్డ విషయం చెప్తుంది. తానే స్వయంగా నందను ఇంటికి తీసుకెళ్లానని..  నువ్వు ఇంకో నాటకానికి తెరతీయాలని చెప్తుంది. మీరు ఎలా చెప్తే ఆలా చేస్తానని… ఎం చేయాలో చెప్పండని అడుగుతాడు ఆ ఉద్యోగి. ఏం చేయాలనేది లాస్య ఆ ఉద్యోగికి చెప్తుంది.


ప్రియ బెడ్‌రూంలో కూర్చుని ఫోన్‌ చూస్తుంటుంది. ఇంతలో సంజయ్‌ లోపలికి వచ్చి ప్రియ చేతిలో టాబ్లెట్స్‌ పెడుతూ..


సంజయ్‌: నీ కడుపులో ఉన్న బిడ్డ నీ చేతిలోకి రాకూడదు.


ప్రియ: ఏం మాట్లాడుతున్నారో.. ఏం చేయమంటున్నారో అర్థం అవుతుందా?


సంజయ్‌: నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నీకు మొగుడు కావాలంటే నేను చెప్పింది చెయ్‌.


అంటూ సంజయ్‌ కోపంగా చెప్పడంతో మీరెన్ని చెప్పినా నేను టాబ్లెట్లు వేసుకోనని ఖరాకండిగా చెప్పి టాబ్లెట్లు సంజయ్‌ చేతిలో పెట్టి గదిలోంచి బయటకు వెళ్తుంది. ఏడుస్తూ వస్తున్న ప్రియను చూసిన దివ్య ఏమైందని అడుగుతుంది. ఏం లేదని వెళ్లిపోతుంది. అక్కడికి వచ్చిన వాళ్ల అత్తయ్య నువ్వు నా వాళ్లను కార్నర్‌ చేస్తే.. నేను నీ వాళ్లను కార్నర్‌ చేస్తాను అంటూ బెదిరిస్తుంది. అయితే ఇప్పటి నుంచి నిన్ను కార్నర్‌ చేయడమే నాపనిగా పెట్టుకుంటాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది దివ్య. నందగోపాల్‌ ఫైల్‌ తీసుకుని తులసి చాంబర్‌లోకి వస్తాడు. ఫైల్‌ లో ఉన్న సబ్జెక్ట్‌ గురించి నంద ఎక్స్‌ప్లైన్‌ చేయబోతుంటే..


తులసి: సంస్కారంతో పాటు నాకు చదవడం కూడా వచ్చు.


నంద: నేను చెప్పేది కూడా వినొచ్చు కదా..? చెప్పే అవకాశం ఇవ్వొచ్చు కదా? నేను ఆ ఫైల్‌ గురించి మాట్లాడుతున్నాను.


తులసి: అవకాశం అనేది మీ ఇంట్లో చెట్టుకు కాచే జామకాయ కాదు. కావాలి అనుకున్నప్పుడు తెంపుకొని తినడానికి. దొరికిన అవకాశాన్ని నిర్లక్ష్యంతో నాశనం చేసుకునే వాడికి తోటి మనిషే కాదు దేవుడు కూడా మరో అవకాశం ఇవ్వడు. నేను కూడా ఫైల్‌ గురించే మాట్లాడుతున్నాను.


నంద: మనిషి మీద కోపం ఉన్నప్పుడు ఆ మనిషి ఎప్పటికీ అర్థం కాడు. ఐ మీన్‌ ఫైల్‌లో విషయం ఎప్పటికీ అర్థం కాదని


తులసి: అదేమి అర్థం కాన్నంత.. అర్థం చేసుకోలేనంత గొప్ప విషయం ఏం కాదు. లోపల ఒకటి దాచుకుని పైకి ఇంకొకటి మాట్లాడే మనుషుల గురించి నాకు బాగా తెలుసు. ఐ మీన్‌ ఫైల్‌లో ఒకటి రాయాలనుకుని ఇంకొకటి రాస్తే గుర్తు పట్టలేనంత అమాయకురాలినేం కాదు. నేను కూడా రాటుదేలిపోయాను.


నంద: తులసి..


తులసి: కాల్‌ మీ తులసి మేడం..నేనిక్కడ సీఈవోని సొంత మనిషిని పిలిచినట్లు పిలస్తే కుదరదు.


నంద: నేను ఆఫీసు జీఎంగా మాట్లాడటం లేదు. నీ మాజీ భర్తగా.. ఒక ఫ్రెండ్‌గా నీ ముందు కూర్చున్నాను.


తులసి: ముందే ఆ మాట చెప్పి ఉంటే అసలు లోపలికి రానిచ్చేదానినే కాదు.


అంటూ ఇది బార్‌ కాదు గొడవ పడటానికి అంటూ నందగోపాల్‌ను తన చాంబర్‌ నుంచి వెళ్లగొడుతుంది తులసి. బాధగా బయటికి వస్తున్న నందగోపాల్ ను చూసి స్టాప్‌ నవ్వుకుంటారు. లాస్య కోవర్టు ఉద్యోగి లేనిపోని కట్టుకథలు స్టాప్‌కు చెప్పడం నందగోపాల్‌ వింటాడు. ఆ ఉద్యోగిని గళ్ల పట్టి తన చాంబర్‌లోకి లాక్కెళ్లి కొట్టబోతుంటే సీఈవోకు కంప్లైంట్‌ చేస్తానని బెదిరిస్తాడు ఆ ఉద్యోగి. దీంతో ఏం చేయాలో అర్థం కాక బయటికి వచ్చిన నందగోపాల్‌ దగ్గరకు లాస్య వస్తుంది.


లాస్య: కాలం కలిసి రానప్పుడు సొంత అనుకున్న మనుషులే కాదు. ఇలా సొంత కార్లు కూడా మొండికేస్తాయి. ఎదురు తిరుగుతాయి. నీ కష్టం గురించి అస్సలు పట్టించుకోవు. కారుని కాబట్టి తన్నగలిగావు కానీ నిన్ను బాధపెట్టిన మనిషిని ఏం చేయగలిగావు.


నంద: నీకు ఇక్కడ పనేంటి? ఎందుకు ఆగావు?


లాస్య: కష్టంలో ఉన్న నా మాజీ భర్తకు సహాయం చేద్దామని ఆగాను.


నంద: నేను అడిగానా?


లాస్య: నీతో ప్రాబ్లెమ్‌ ఏంటంటే నందు నీకు దగ్గర అవ్వాలనుకున్నవాళ్లను దూరం పెడతావు. నిన్ను దూరం పెట్టిన వాళ్లకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటావు. ఇదిగో ఇలా దెబ్బ తింటుంటావు.


అంటూ లాస్య కట్టుకథలు చెప్పి తులసి మీద నందగోపాల్‌కు ధ్వేషం కలిగేలా మాట్లాడుతుంది. నందగోపాల్‌ సీరియస్‌గా లాస్యకు వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply