Animal Movie : తన సినిమాకు సెన్సార్ ఎలా రియాక్ట్ అయ్యింది? సినిమా నుంచి ఏమేం కట్స్ చేసింది అని చెప్పుకోవడానికి దర్శకులు పెద్దగా ముందుకు రారు. కానీ సందీప్ రెడ్డి వంగా అలా కాదు. తన మూవీలోని ఏయే సీన్స్‌పై సెన్సార్ కట్‌ చేసింది, ఏయే డైలాగ్స్‌ను తీసేసింది అనే విషయాలను క్లియర్‌గా ప్రేక్షకుల ముందు పెడతారు. తన మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’ సమయంలో ఈ విషయంపై సెన్సార్‌తో పెద్ద యుద్ధమే చేశాడు సందీప్. పలు సీన్స్‌ను, డైలాగులను కట్ చేయడం సందీప్‌కు ఇష్టం లేకపోవడంతో అసలు సెన్సార్ ఏయే సీన్స్‌ను, డైలాగ్స్‌ను కట్ చేసింది అని ఓపెన్‌గా సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ‘యానిమల్’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ‘యానిమల్’లో సెన్సార్ 5 సీన్స్‌ను కట్ చేసిందంటూ ఓ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


విజయ్, జోయా రొమాన్స్‌పై కట్..
రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ సినిమాను ఇప్పటికే సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సర్టిఫికెట్ వైరల్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే సినిమాలో మెయిన్‌గా 5 సీన్లపై సెన్సార్ కట్ పడిందని తెలుస్తోంది. ‘యానిమల్’లో రణబీర్, రష్మిక.. విజయ్, జోయా అనే పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా విజయ్, జోయా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌ను తగ్గించమని సందీప్‌తో చెప్పిందట సెన్సార్ బోర్డ్. వారు అందించిన సర్టిఫికెట్‌లో కూడా ఇదే విషయం తెలిపారు. రొమాంటిక్ సీన్స్‌లోని క్లోజప్ షాట్స్‌ను డిలీట్ చేసి, విజయ్, జోయా మధ్య సీన్స్‌లో మార్పులు చేసినట్లు సెన్సార్ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు.


రొమాంటిక్ సీన్స్ ఉంటాయి..
‘యానిమల్’ ఆల్బమ్ నుంచి అన్ని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ముందుగా విడులదయిన ‘హువా మే’ అనే పాట సినిమాలో రణబీర్, రష్మిక కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చింది. ఈ సాంగ్ లాంచ్ సమయంలో సందీప్ కూడా హీరో, హీరోయిన్‌కు మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయని రివీల్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం సినిమాలో ‘వస్త్రా’ అనే హిందీ పదాన్ని తొలగించి కాస్ట్యూమ్ అనే ఇంగ్లీష్ పదాన్ని చేర్చారు. ఇక సినిమాలో బూతులు ఎక్కడ వచ్చినా దానికి తగినట్టుగా పదాన్ని మార్చడం లేదా మ్యూట్ చేయడం ముఖ్యమని సెన్సార్ తెలిపింది.






నా కొడుకుకే సినిమా చూపించను..
‘యానిమల్’కు ఏ సర్టిఫికెట్ రావడంపై దర్శకుడు సందీప్ వంగా ఇదివరకే స్పందించాడు. సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం కరెక్టే అని, ఎందుకంటే తను కేవలం అడల్ట్స్ కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపాడు. అంతే కాకుండా తన సొంత కొడుకుకు కూడా ఈ మూవీ చూపించను అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ‘యానిమల్’ మూవీ డ్యూరేషన్ 3 గంటల 23 నిమిషాలు కాగా ప్రేక్షకుల్లో దీనిపై పలు సందేహాలు ఉన్నాయి. అయితే ముందుగా ఈ మూవీ ఫైనల్ కట్ 3 గంటల 45 నిమిషాలు వచ్చిందని తానే దానిని చివరిగా 3 గంటల 21 నిమిషాలు చేశానని బయటపెట్టాడు. నిర్మాతకు ఈ సినిమా వల్ల కచ్చితంగా లాభాలు వస్తాయని తాను బలంగా నమ్ముతున్నానని ‘యానిమల్’పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు సందీప్. డిసెంబర్ 1న ‘యానిమల్’ థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది.


Also Read: ఓటీటీలపై మండిపడ్డ రిషబ్ శెట్టి - అలా చేయడం బాగోలేదంటూ ఫైర్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply