ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 'సోషల్‌ గేమింగ్‌' మూమెంటమ్‌ పెరుగుతోంది. కరోనా వైరస్‌తో దాదాపుగా అన్ని దేశాల్లో లాక్‌డౌన్లు అమలు చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో ఇతరులతో కమ్యూనికేషన్‌, కనెక్ట్ అవ్వడం కోసం సోషల్‌ గేమింగ్‌ ఒక మాధ్యమంగా మారిపోయింది. లక్షల మంది యూజర్లు నాలుగు గోడల మధ్యే ఉంటూ బయటి ప్రపంచంతో మమేకం అయ్యారు.


కరోనా వైరస్‌ దాదాపుగా అన్ని రంగాలు, కంపెనీలపై ప్రభావం చూపించింది. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ తన పరిధిని మరింత విస్తరించుకుంది. కేవలం మనోరజనం కోసమే కాకుండా సోషల్‌ ఎంగేజ్‌మెంట్‌, మెంటల్‌ వెల్‌నెస్‌కు అడ్డాగా మారింది. అదే సోషల్‌ గేమింగ్‌ సృష్టికి కారణమైంది. ప్రస్తుతం భారత్‌ సోషల్‌ గేమింగ్‌కు అతిపెద్ద మార్కెట్‌గా అవతరించే అవకాశం ఉంది. అందుకే సోషల్‌ గేమింగ్‌ కంపెనీలు ఆఫర్‌ చేసేందుకు చాలా మిగిలే ఉంది. ఉదాహరణకు భారత పబ్లిషర్ల మొబైల్‌ గేమ్స్‌ డౌన్‌లోడ్లు సగటు 522000గా ఉంది. అన్ని మొబైల్‌ గేమ్స్‌ సగటుతో పోలిస్తే మొత్తంగా ఎక్కువ డౌన్‌లోడ్లు ఎక్కువగా ఉన్నాయి.


ఇండియాలో సోషల్‌ గేమింగ్‌లో 'విన్‌ జో' దూసుకుపోతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద వెర్ణాక్యులర్‌ సోషల్‌ గేమింగ్‌ వేదిక. అన్ని భాషాల్లోనూ ఇది సేవలు అందిస్తోంది. భాషలే కాకుండా ఆయా ప్రాంతాల సంప్రదాయాలను అనుసరించి దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నవారికి చక్కని అనుభవం అందిస్తోంది. ఇంటర్నెట్‌ సరిగ్గా లేకున్నా, లో ఎండ్‌ డివైజ్‌ల్లోనూ బాగా పనిచేస్తోంది. అందుకే లాక్‌డౌన్‌లో విన్‌ జో యూజర్లు మూడు రెట్లు పెరిగారు. ట్రాఫిక్‌ 30 శాతం పెరిగింది. రోజువారీగా చూసుకుంటే కాంకరెంట్‌ యూజర్ల సంఖ్య 30-40 శాతం పెరుగుతోంది.


ఉద్యోగాలు, వేతనాలపై మహమ్మారి ప్రభావం చూపుతున్న తరుణంలో విన్‌ జోలో లైవ్‌ స్ట్రీమింగ్‌, వీడియో, ఆడియో ఫీచర్లకు ఎంగేజ్‌మెంట్‌ పెరుగుతోంది. గేమింగ్‌ అనేది మన రోజువారి జీవితంలో ఒక భాగంగా మారిపోతోంది. లాక్‌డౌన్‌లో స్ట్రెస్‌ను ఎదుర్కొనేందుకు ఇదో అవసరంగా మారింది.


Also Read: Budget 2022: దయ చూపాలమ్మా 'నిర్మలమ్మ'! బడ్జెట్‌కు ముందు వేతన జీవుల వేడుకోలు!!


Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు


Also Read: Doorstep Banking Services: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!


Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!


Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!