Sigachi Industries : సిగాచి ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనం- పటాన్‌చెరు ప్లాంట్‌లో ఘోర ప్రమాదంతో డ్రాప్
Sigachi Industries : తెలంగాణలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటన ప్రభావం ఆ సంస్థ షేర్లపై పడింది.
Sigachi Chemical Industry: తెలంగాణలోని పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో సోమవారం భారీ ప్రమాదం జరిగింది. సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌లో పేలుడు జరిగి పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఆ కంపెనీ షేర్లపై చూపించింది. ఆ కంపెనీ షెర్లు నేలచూపులు చూశాయి. సిగాచి కంపెనీ షేర్లు 14.8% తగ్గి రూ.47కి చేరుకున్నాయి.
సోమవారం సిగాచి ఇండస్ట్రీస్ షేర్లు బిఎస్‌ఇలో ఇంట్రాడే కనిష్ట స్థాయిలో రూ.47కు చేరుకున్నాయి. ప్రమాదం ఉదయం జరిగింది. బయటకు వచ్చేసరికి 10 గంటలకు అయింది. అప్పటి నుంచి ఈ కంపెనీ షెర్లు తగ్గుతూ వచ్చాయి. చివరకు 14.8%కి పడిపోయాయి. కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం, మిగతా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటం అన్నింటితో పెట్టుబడుదారుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ చూశాయి. దీంతో చాలా మంది షేరు హోల్డర్ భయాందోళనలకు గురయ్యారు.
Just In
ఉదయం ఉద్యోగాలు పని చేస్తున్న టైంలో రసాయన రియాక్టర్ పేలింది. ఆ పేలుడు ప్రభావం భవనంపై పడింది. దీని కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఉద్యోగులు చిక్కుకున్నారు. వారంతా బయటకు వచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 10 మందికిపైగా మృతి చెందగా 20 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లిన రెస్క్యూ సిబ్బంది అక్కడి దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. ప్రమాదం ధాటికి కార్మికుల డెడ్‌బాడీలు చాలా దూరం ఎగిరిపడినట్టు గుర్తించారు. వారిని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. రియాక్టర్ పేలడం ఒక ఎత్తైతే... తర్వాత చెలరేగిన మంటలు కూడా ప్రమాద తీవ్రతను మరింత పెంచాయి.
ప్రమాదం జరిగిన తర్వాత పటాన్‌చెరులోని పాశమైలారం ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుంతో తెలియక అల్లాడిపోయారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది వచ్చి పరిశ్రమలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పాశమైలారంలోని యూనిట్‌లో జరిగిన ప్రమాదం గురించి సిగాచి ఇండస్ట్రీస్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయినా మదుపరులు మాత్రం భయపడిపోయారు. అందుకే ప్రమాదం తీవ్రత తీవ్రత మార్కెట్ సెంటిమెంట్‌పై చూపించింది. మధ్యాహ్నం వరకు 14% వరకు పడిపోయిన ఆ కంపెనీ షేర్ ధరలు తర్వాత కాస్త కోలుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి 48.95 వద్ద ముగిసింది. అంటే దాదాపు 11.19 శాతం తగ్గుదల కనిపించింది. ఇలా ఈ కంపెనీ షేర్లు తగ్గడం ఇదే ఫస్ట్ టైం కాదు గతేడాది కూడా 20.92% తగ్గాయి.