Mahindra XUV 3XO REVx: మహీంద్రా సంస్థ నూతన XUV 3XO రెవెక్స్ REVx మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సి-సెగ్మెంట్ ఎస్‌యూవీ విభాగంలోకి వచ్చిన ఈ వవ వెహికిల్‌లో అనేక డిజైన్ మార్పులు చేయడంతో పాటు ఫీచర్లను మెరుగుపరిచారు. దీని ప్రారంభ ధర రూ.8.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో మొదలవుతుంది.
- వేరియంట్‌లు, ఇంజిన్ వివరాలు: కొత్తగా వచ్చిన REVX ట్రిమ్‌లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి:రెవెక్స్ ఎం-REVX M, రెవెక్స్ ఎం(ఓ)-REVX M(O), రెవెక్స్ ఏ-REVX A, REVX A AT అందుబాటులో ఉన్నాయి -REVX సిరీస్‌లో 1.2 లీటర్, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది.- టాప్-ఎండ్ REVX Aలో డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీతో మరింత పవర్‌ఫుల్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది-మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి.
- డిజైన్ & స్టైల్- కొత్తగా బాడీ కలర్ గ్రిల్, బ్లాక్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్స్, REVX బ్యాడ్జింగ్, స్పోర్టీ లుక్స్‌కి ప్రత్యేక ఆకర్షణ.- ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ బ్లాక్ లెదరెట్ సీట్లు, ప్యానోరమిక్ సన్‌రూఫ్ (REVX Aలో), 10.25-ఇంచ్ డిజిటల్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, అడ్రెనాక్స్ కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఆర్16 బ్లాక్-కలర్ వీల్ కవర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణ. గ్రే, టాంగో రెడ్, నెబ్యులా బ్లూ, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్ రంగులలో ఇది లభిస్తుంది.
- భద్రత, కనెక్టివిటీ:క్యాబిన్ అనుభవం కోసం 4-స్పీకర్ ఆడియో సెటప్ ఉంది. భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్ (హెచ్‌హెచ్‌సి) కలిగిన ఈఎస్‌సి, అన్ని నాలుగు డిస్క్ బ్రేక్‌లు సహా 35 ప్రామాణిక ఫీచర్‌లు చేర్చారు. రెవెక్స్ ఏ మోడల్ అడ్రినోక్స్ కనెక్ట్‌తో వస్తుంది. ఇందులో అలెక్సా, ఆన్‌లైన్ నావిగేషన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటివి ఉన్నాయి.
- వేరియంట్ ధరలు
- - REVX M (ధర: రూ. 8.94 లక్షలు)లో LED DRLs, బ్లాక్ వీల్ కవర్స్, 26.03 సెం.మీ. ఇన్ఫోటైన్‌మెంట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్ ఆడియో, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్ రౌండ్ డిస్క్ బ్రేక్స్, డ్రైవర్ సీట్ అడ్జస్ట్, రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.- REVX M(O)లో సింగిల్ పేన్ సన్‌రూఫ్ అదనంగా లభిస్తుంది.- REVX A (ధర: రూ. 11.79 లక్షలు)లో ప్యానోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ, 10.25-ఇంచ్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ కెమెరా, రియర్ వైపర్, అడ్రెనాక్స్ కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి
- మిస్సింగ్ ఫీచర్స్- REVX ట్రిమ్‌లో 360 డిగ్రీ కెమెరా, ADAS, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి కొన్ని హైఎండ్ ఫీచర్లు లేవు. ఇవి AX5L వేరియంట్‌లో మాత్రమే లభిస్తాయి
పోటీ పెరిగిన SUV సెగ్మెంట్‌లో XUV 3XO తన క్రేజ్‌ను కొనసాగించేందుకు తీసుకొచ్చిన ఈ REVX సిరీస్ యువత కోసం బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని మహీంద్రా Mahindra భావిస్తోంది. ఇప్పటికే మహీంద్రా 3XO కు బాగా డిమాండ్ ఉంది. కొత్త వేరియంట్‌తో దానిని మరింత పెంచాలన్నది కంపెనీ ఆలోచన