Stock Market News: శుక్రవారం స్టాక్ మార్కెట్‌ మదుపరులకు చుక్కలు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, వివిధ రంగాలలో నిరంతర అమ్మకాలతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చాలా పెద్ద డౌన్‌ఫాల్‌ కనిపించింది. అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా దాదాపు అన్ని షేర్లూ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 688.26 పాయింట్లు లేదా 0.83 శాతం పడిపోయి 82,502.02 (సూచిక ముగింపు) వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 205.40 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 25,149.85 వద్ద ముగిసింది. 

1,510 స్టాక్‌లు వృద్ధిని సూచించగా, 2,341 పడిపోయాయి., 150 స్టాక్‌లు మారకుండా స్టేబుల్‌గా ఉన్నాయి. నిఫ్టీ కాంపోనెంట్లలో, అత్యధికంగా నష్టపోయిన వాటిలో టిసిఎస్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్,  విప్రో ఉన్నాయి. హెచ్‌యుఎల్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

BSE మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.6 శాతం క్షీణించాయి. రంగాల వారీగా, FMCG, ఫార్మా - వరుసగా 0.5 శాతం, 0.7 శాతం లాభపడ్డాయి. మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, చమురు & గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ,  టెలికాం రంగాలు ఒక్కొక్కటి 1 శాతం పడిపోయాయి. హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) షేర్లు 5 శాతం పెరిగాయి. అదే టైంలో ఐటి రంగం భారీగా క్షీణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన స్టాక్‌ల పతనం కారణంగా ఈరోజు మార్కెట్ డీలా పడింది. 

ఏది స్టాక్స్‌ క్షీణించాయి? ఏవి పెరిగాయి?

శుక్రవారం టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) త్రైమాసిక ఫలితాలు ఊహించిన దానికంటే తక్కువగా ఫెర్ఫామ్‌ చేశాయి. దీని కారణంగా ఆ సంస్థ స్టాక్స్‌ దాదాపు 2.75 శాతం పడిపోయాయి. మధ్యాహ్నం సెషన్‌లో నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ కూడా 1 శాతం పడిపోయింది.

మధ్యాహ్నం మార్కెట్ కాస్త కుదటపడి కొన్ని కంపెనీల షేర్లు పెరిగాయి. ఇలా లాభపడిన ఐదు టాప్ కంపెనీలు హిందూస్తాన్ యూనిలీవర్(4.77 శాతం), యాక్సిస్ బ్యాంక్ (0.48 శాతం), సన్ ఫార్మాస్యూటికల్స్ (0.51 శాతం) ఉన్నాయి. 

నష్టాలు చవిచూసిన కంపెనీలు గురించి మాట్లాడుకుంటే TCS టాప్‌లో ఉంటే మరికొన్ని కంపెనీల షేర్లు కూడా నేల చూపులు చూశాయి. అలాంటి వాటిలో మహీంద్రా & మహీంద్రా (2.43 శాతం), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.72 శాతం), రిలయన్స్ (1.68 శాతం) ఉన్నాయి.

మార్కెట్ ఎందుకు పడిపోయింది?ఐటీ నుంచి ఆటో స్టాక్‌ల వరకు విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని మార్కెట్ ఎదుర్కొంది. FMCG రంగం మాత్రమే తట్టుకొని నిలబడగలిగింది. పెరుగుదల చూసింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం"ప్రపంచ అనిశ్చితుల కారణంగా, లార్జ్ క్యాప్ ఐటీ సంస్థల స్టాక్‌లు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. TCS త్రైమాసిక ఫలితాల తర్వాత ఐటీ స్టాక్‌ల బలహీనత, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో 1.85 శాతం పతనం పెట్టుబడిదారులను నిరాశపరిచాయి." అని విశ్లేషిస్తున్నారు. 

నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కూడా 0.86 శాతం క్షీణించగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 10 కూడా 1.00 శాతం పడిపోయింది. అయితే, ఇండియా VIX స్టాక్స్ 1.90 శాతం పెరిగాయి.