ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ (RNESL) చైనా బ్లూస్టార్‌ గ్రూప్‌ అధీనంలోని ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేసింది. వాణిజ్య పరంగా ఈ కొనుగోలు విలువ 771 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.


'ఆర్‌ఈసీ నార్వే కేంద్రంగా పనిచేస్తోంది. ఆపరేషనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ మాత్రం సింగపూర్‌లో ఉంది. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్‌ దేశాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. 25 ఏళ్ల ఈ సంస్థకు నార్వేలో రెండు, సింగపూర్‌లో ఒక తయారీ కేంద్రాలు ఉన్నాయి' అని రిలయన్స్‌ తెలిపింది.


2014లో ఆర్‌ఈసీ గ్రూప్‌ చైనా సంస్థల నుంచి ధర విషయంలో తీవ్ర పోటీని ఎదుర్కొంది. నిర్వాహక ఖర్చులు తగ్గించుకొనేందుకే ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్‌కు తరలించింది. జెఫరీస్‌ ఇండియా ప్రకారం చైనా కంపెనీలతో పోలిస్తే సోలార్‌ ప్యానెళ్లు తయారు చేసే టెక్నాలజీ అంతర్జాతీయంగా 75 శాతం తక్కువ విద్యుత్‌ను వాడుకుంటుందని వెల్లడించింది.


'ఆర్‌ఈసీ వద్ద 600కు పైగా యుటిలిటీ, డిజైన్‌ పేటెంట్లు ఉన్నాయి. పరిశోధన, అభివృద్ధిపై ఆ సంస్థకు నిశితమైన దృష్టి ఉంది. తమ భాగస్వామ్యంతో వ్యాపారం, విస్తరణ, టెక్నాలజీ వృద్ధి చెందుతాయి. ఆర్‌ఈసీ విస్తరణ ప్రణాళికలకు రిలయన్స్‌ మద్దతు ఉంటుంది. భారత్‌లోనూ సోలార్‌ ఎనర్జీలో సాంకేతికను విస్తరించాలని మేం భావిస్తున్నాం. అంతర్జాతీయ అవసరాల కోసం భారత్‌లోనే తక్కువ ధరకు సోలార్‌ ప్యానెళ్లు తయారు చేస్తాం' అని రిలయన్స్‌ వెల్లడించింది.


Also Read: 35 ఏళ్ల కాల పరిమితితో ఇంటి రుణం... కస్టమర్‌కు లాభమా? నష్టమా?


Also Read: అమెజాన్‌లో బడ్జెట్ 5జీ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఫీచర్లు కూడా అదుర్స్!


Also Read: హైదరాబాద్ ఫార్మా కంపెనీలో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం ! ఐటీ శాఖ కీలక ప్రకటన !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి