By: ABP Desam | Updated at : 11 Sep 2023 02:41 PM (IST)
యూపీఐ పేమెంట్స్ ( Image Source : Pexels )
FASTag:
యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ - UPI చేసిన అద్భుతాలు ఎన్నో.. ఎన్నెన్నో! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకూ సాధ్యం కానిది భారత్ చేసి చూపించింది. ప్రతి నెలా లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటా రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు చిల్లర లేకపోయినా డిజిటల్‌గానే చెల్లిస్తున్నారు. తాజాగా మరో కొత్త టెక్నాలజీ మార్కెట్లో ప్రవేశించింది. మొబైల్‌తో సంబంధం లేకుండా పెట్రోలు, డీజిల్ పోయించుకొని కారు ద్వారానే డబ్బులు చెల్లించొచ్చు.
అమెజాన్, మాస్టర్ కార్డ్ కంపెనీలు సంయుక్తంగా టోన్‌ట్యాగ్ (ToneTag) సేవలను ఆరంభించాయి. ఇందులో కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను యూపీఐతో అనుసంధానం చేశారు. దాంతో స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు వీలవుతోంది. భారత్ పెట్రోలియం భాగస్వామ్యంతో ఎంజీ హెక్టార్ రీసెంటుగా టోన్ ట్యాగ్ సేవలను ప్రదర్శించింది. స్మార్ట్ ఫోన్, ఇతర డివైజులు లేకుండా నేరుగా కారు నుంచే డిజిటల్ విధానంలో డబ్బులు చెల్లించింది.
ఈ విధానం ఎలా పనిచేస్తుందంటే?
పెట్రోల్ బంకుకు వెళ్లగానే మీ కారు ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఫ్యూయెల్ డిస్పెన్సర్ నంబర్‌ను చూపిస్తుంది. ఇదే సమయంలో మీరొచ్చిన సంగతిని సౌండ్ బాక్స్ అనౌన్స్ చేస్తుంది. పెట్రోల్ స్టేషన్ సిబ్బందిని సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. మీకు ఎంత ఇంధనం అవసరమో ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలో ఎంటర్ చేయాలి. ఇదే విషయాన్ని సౌండ్ బాక్స్ సిబ్బందికి తెలియజేస్తుంది. దాంతో మొబైల్, మనుషులతో సంబంధం లేకుండానే చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ టెక్నాలజీతో పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఫాస్టాగ్‌నూ రీఛార్జ్ చేసుకోవచ్చు. కారు ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలో ఫాస్టాగ్‌లోని బ్యాలెన్స్ కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి మీరు నంబర్ ఎంటర్ చేస్తే రీఛార్జ్ అయిపోతుంది. గతంలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌లైన్ వాయిస్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. దీనినే కారు నుంచి చెల్లింపుల వ్యవస్థ కోసం వాడుకున్నారు!
ఈ మధ్యే గ్లోబల్ ఫిన్‌టెక్ (Global Fintech) ఫెస్ట్ జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), యూపీఐ సహకారంతో టోన్‌ట్యాగ్ సంభాషణా పరమైన చెల్లింపులు చేపట్టింది. సాధారణ ఫోన్ కాల్స్ ద్వారానూ బిల్లులు చెల్లించొచ్చని చూపించడం సంచలనంగా మారింది. అంటే భవిష్యత్తులో ఎలాంటి శ్రమ లేకుండానే మరిన్ని డిజిటల్ లావాదేవీలు చేపట్టేందుకు ద్వారాలు తెరిచింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Also Read: బంగారం లాంటి స్కీమ్! నేటి నుంచే ఆరంభం!
Small Saving Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్ న్యూస్ వింటామా?
Property Management: మీ వీలునామాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల డేటా కూడా ఉండాలి - చిన్న నిర్లక్ష్యం ఖరీదు భారీ మూల్యం కావచ్చు!
Gold-Silver Prices Today 29 Dec: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల రేట్లు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Year Ender 2024: ఈ ఏడాది ఇన్‌కమ్ టాక్స్ రూల్స్‌లో వచ్చిన 10 ప్రధాన మార్పులు
Cashback Credit Cards: ఆన్‌లైన్ షాపింగ్‌పై బంపర్ డిస్కౌంట్ - ఈ క్రెడిట్ కార్డ్స్‌తో అద్భుతమైన క్యాష్‌బ్యాక్స్
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి