search
×
ABP premium story Premium

Cash Less Transactions: ఇక నోట్లు, నాణేలు కనిపించవా..? క్యాష్‌లెస్‌ సొసైటీ సాధ్యమయ్యేనా? వచ్చే లాభనష్టాలేంటీ?

Telugu News: నగదు రహిత లావాాదేవీలను వందశాతం అమలు చేయాలని ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తోన్న నేపథ్యంలో.. వాటి సాధ్యాసాధ్యాలు, ఇబ్బందులు, ప్రయోజనాల విశ్లేషణ

FOLLOW US: 
Share:

Why are coins not used anymore: ఎక్కడికైనా లాంగ్ ట్రిప్‌కి వెళ్లాలంటే సూట్‌‌కేసు నిండా బట్టలతోపాటు..  కావాల్సినంత డబ్బు బ్యాంకు పుస్తకాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఇప్పుడు దాదాపుగా ఎవ్వరికీ లేదు.  ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచ దేశాలు చుట్టి రాగల ధైర్యం ప్రస్తుత సమాజంలో అందరికీ ఉంది.  నగదు రహిత లావాదేవీలు రాజ్యమేలుతున్న కాలంలో బతుకుతున్నాం. డబ్బును క్యారీ చేసి చాలా రోజులైపోయింది అని చెప్పడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. ఎవరైనా డబ్బులడిగితే ఇప్పుడెవరండీ డబ్బులు జేబులో పెట్టుకు తిరిగేది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వందశాతం నగదు రహిత సమాజం సాధ్యమా అనే ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి.  

నగదు రహిత లావాదేవీలంటే..

ఆర్థిక లావాదేవీల్లో నోట్లు, చిల్లర నాణాలు వంటి నగదును ఏమాత్రం ఉపయోగించక పోవడాన్ని నగదురహిత లావాదేవీలంటారు.  పే పాల్, యాపిల్ పే, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్ లైన్ మొబైల్ పేమెంట్ సర్వీసులు,  క్రెడిట్, డెబిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్, క్రిప్టో కరెన్సీ వంటివి ప్రత్యామ్నాయంగా నగదు బదిలీకి  వాడుతున్నారు. జనాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. 

నగదు రహిత సమాజం..  

డిజిటల్ పేమెంట్లు తప్ప నేరుగా డబ్బులు చేత్తో మార్పు చేసుకోవడం పూర్తిగా నిషేధించగలిగితేనే నగదు రహిత సమాజం సాధ్యమవుతుంది.  నగదు రహిత సమాజం  వంద శాతం వెంటనే సాధ్యం కాకపోయినా ఆ దిశగా ప్రయత్నాలు అయితే ప్రపంచ దేశాలన్నింటిలోనూ సాగుతున్నాయనే చెప్పాలి.  బ్యాంకులు, వ్యాపార సంస్థలు, మేధావులు, ప్రజలు డిజిటల్ పేమెంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. లాభదాయకంగా ఉండటంతో ప్రభుత్వాలు సైతం వీటినే ప్రోత్సహిస్తున్నాయి.

స్వీడన్ ముందంజలో..

నగదు రహిత లావాదేవీలని అంచనా వేయడానికి చాలా ప్రమాణాలున్నాయి. వాటి ఆధారంగా స్వీడన్ ఈ విషయంలో ముందంజలో ఉందని నిపుణులంటున్నారు. దాదాపు 15 శాతానికి మినహా  ఇక్కడ అంతా నగదు రహిత లావాదేవీలే జరుగుతున్నాయి. దేశం లో చెల్లుబాటులో ఉన్న నగదు మొత్తం విలువ జీడిపిలో ఒక్క శాతం మాత్రమేనట.  ఇక్కడి హోటళ్లలో, రెస్టారెంట్లలో, ఇతర అన్ని వ్యాపార సముదాయాల్లో క్యాష్ అంగీకరించబోమని బోర్డు పెట్టి నిరాకరించే వెసులుబాటు ఉంది.  దేశంలో సగానికి పైగా బ్యాంకుల్లో ఆసలు క్యాషే ఉండదు. 

ఏంటి లాభం..?

క్యాష్ లావాదేవీలతో పోలిస్తే.. నగదు రహిత లావాదేవీలే సౌలభ్యంగా ఉంటాయని, వాటితో ఆర్ధిక నేరాలు తగ్గించేందుకు సైతం అవకాశం ఉందని  ఆర్థిక నిపుణులు, వాటిని ఇష్టపడే వారు చెబుతారు. ఆర్ధిక వ్యవస్థల డిజిటలైజేషన్‌తో తమ దైనందిని వ్యాపార లావాదేవీలన్నీ మొబైల్ ద్వారా చేసే అలవాటు వినియోగదారుల్లోనూ పెరుగుతోంది. దీంతో సమయం ఆదా అవతోంది.   కొన్ని బ్యాంకులు కావాలనే క్యాష్ ట్రాన్సక్షన్స్ అసౌకర్యమైనావిగా తమ కస్టమర్లకి చూపిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీల వల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుండటంతో బ్యాంకులు  వీటిపైనే  మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని బ్యాంకుల బ్రాంచెస్ మూసేయడం, ఏటీఏమ్ లను ఎత్తేయడం వంటివి కొన్ని దేశాల్లో చేస్తున్నాయి.  వీటి ట్రెండ్ ఇప్పట్లో ఆగదని, త్వరలోనే పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు ప్రపంచమంతటా అమలవుతాయని నిపుణులంటున్నారు.  

కరోనా పుణ్యమా అని.. 

ప్రపంచ వ్యాప్తంగా 2020 లో వచ్చి ప్రాణాంతకంగా పరిణమించిన  కరోనా మహమ్మారి సైతం నగదు రహిత లావాదేవీలు పెరగడానికి దోహదపడింది.  అప్పట్లో అందరూ ఒకరినొకరు ముట్టుకోవడానికి సైతం సంశయించిన నేపథ్యంలో స్పర్శ రహిత, నగదు రహిత లావాదేవీలకోసం చాలా మంది డిజిటల్ పేమెంట్లపైనే ఆధారపడ్డారు.  అప్పటి వరకూ వీటిపై అవగాహన లేని వారు సైతం నిర్భంధ పరిస్థితుల్లో వీటికి అలవాటు పడిన పరిస్థితులున్నాయి. 

ఇబ్బందులు.. 

నగదు రహిత లావాదేవీలతో చాలా ఉపయోగాలున్నప్పటికీ..  వీటిని వంద శాతం అమలు చేస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశమూ ఉంది. 

  • బ్యాంకు ఖాతా లేని చాలా మందికి దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణంగా పేదవాళ్లు, నిరక్షరాస్యులు ఇలాంటి ఇబ్బందుల బారిన పడే అవకాశం ఉంది. చాలా మందికి బ్యాంకు ఖతాలు లేకుండా ఉండే అవకాశం ఉంది. కొందరికి అసలు ఖాతాలు తెరుచుకునేందుకూ వీలుండక పోవచ్చు. డిజిటల్ లాావాదేవీలు నిర్భంధం చేసి.. నగదును పూర్తి స్థాయిలో నిషేధిస్తే వారి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. 
  • నగదు రహిత లావాదేవీలే వంద శాతం అమలైతే వ్యక్తిగత గోప్యతకువిఘాతం కలిగే పరిస్థితులు తలెత్తే అవకాశముంది.   కొన్ని కొనుగోళ్లు బయటకి చెప్పుకోలేనివి అయ్యి ఉండొచ్చు. వాటిని క్యాష్‌తో కొనడానికే చాలా మంది ఇష్టపడతారు. 
  • సాంకేతిక లోపాల కారణంగా కొన్ని సార్లు చేయాల్సిన పనులు  ఆగిపోతాయి. ఇప్పటికే చాలా యూపీఐ పేమెంట్ల విషయంలో మనం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. ప్రత్యామ్నాయంగా క్యాష్ ఉంది కాబట్టి సరిపోతుంది. అలాంటి పరిస్థితి లేకపోతే.. చాలా లావాదేవీలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.  పేమెంట్లకు హ్యాకింగ్ ముప్పు కూడా పొంచి ఉంది. 
  • తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో బ్యాంకులు విలీనం అయ్యే అవకాశం ఉన్నపుడు బ్యాంకుల నుంచి తమ డబ్బు నగదు రూపంలో తీసుకుని భద్ర పరుచుకునే వెసులుబాటు నగదును పూర్తిగా ఎత్తేస్తే వినియోగదారుడు కోల్పోతాడు. అలాగే బ్యాంకుల అప్పులకి డిపాజిటర్లు సైతం బాధ్యులయ్యే పరిస్థితి నుంచి తప్పించుకునే వీలు కూడా ఉండదు. అమెరికాలో 2.50 లక్షల డాలర్ల వరకూ మాత్రమే డిపాజిటర్ల డబ్బు ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు సురక్షితంగా ఉంచుతాయి. మిగతా సొమ్ము వాడుకునే వెసులుబాటు ఉంది. 
  • బ్యాంకులు వడ్డీ రేట్లను అడ్డదిడ్డంగా మార్చేసినా.. డిపాజిటర్లకు తమ సొమ్మును వెనక్కి తీసుకునే వెసులు బాటు కూడా ఉండదు.  పైగా బ్యాంకులు తమ ఇష్టానుసారం డిపాజిటర్లపై చార్జీలు బాదే అవకాశం ఉంది. 
Published at : 02 May 2024 03:50 PM (IST) Tags: Digital India UPI Payments Cash Digital payments ABP premium cash less transactions digital currancy cripto currancy sweeden

ఇవి కూడా చూడండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Government Scheme: వృద్ధాప్యంలో రూ.5 వేలు పెన్షన్ - రోజుకు కేవలం 7 రూపాయలతో సాధ్యం

Government Scheme: వృద్ధాప్యంలో రూ.5 వేలు పెన్షన్ - రోజుకు కేవలం 7 రూపాయలతో సాధ్యం

Special Scheme: మహిళల కోసం పోస్టాఫీస్‌లో ప్రత్యేక పథకం - కేవలం రెండేళ్లలో ఎక్కువ రాబడి

Special Scheme: మహిళల కోసం పోస్టాఫీస్‌లో ప్రత్యేక పథకం - కేవలం రెండేళ్లలో ఎక్కువ రాబడి

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?

టాప్ స్టోరీస్

AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌

Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌

Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు

Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు

Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ

Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ