By: ABP Desam | Updated at : 05 Jul 2023 01:17 PM (IST)
టాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోయినా ITR ఫైల్ చేయాలి
Income Tax Return: ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేయాలి. అయితే, పన్ను చెల్లించాల్సిన వ్యక్తి మాత్రమే ITR ఫైల్ చేయాలన్నది ఒక అపోహ. పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా ITR ఫైల్ చేయాలి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
పన్ను బాధ్యత (Tax Liability) లేకపోయినా ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి?
ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్ క్లెయిమ్ చేయడానికి:
వ్యక్తులు సంపాదించే కొన్ని రకాల ఆదాయాలపై TDS, ముందస్తు పన్ను రూపంలో తప్పనిసరిగా టాక్స్ చెల్లించాలి. అలాంటి వాళ్లకు టాక్స్ లయబిలిటీ ఉన్నా/లేకపోయినా టాక్స్ రిఫండ్ క్లెయిమ్ చేసుకునేందుకు క్వాలిఫై అవుతారు. చెల్లించిన అదనపు పన్నును రిఫండ్ తీసుకోవాలంటే తప్పనిసరిగా ITR సమర్పించాలి. అప్పుడే ఆ డబ్బు మీ చేతికి వస్తుంది.
వీసా పొందడానికి:
చదువు, ఉద్యోగం, వైద్యం, విశ్రాంతి వంటి వివిధ కారణాలతో ఫారిన్ వెళ్లాలంటే, ముందుగా వీసా పొందాలి. చాలా దేశాల రూల్స్ ప్రకారం, వీసా కోసం అప్లై చేయడానికి 2, 3 సంవత్సరాల ముందు నుంచి ITR పైల్ చేయడం అవసరం. ITR ఫైల్ చేయడం వల్ల వీసా యాక్సెప్టెన్స్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది. కాబట్టి, వీసా కావాలంటే పన్ను బాధ్యత లేనప్పటికీ ITR ఫైల్ చేయాలి.
లోన్ తీసుకోవడానికి:
ఆదాయ పన్ను రిటర్న్‌లు ఒక వ్యక్తి ఆదాయానికి సాక్ష్యం చెబుతాయి. ఒక వ్యక్తి లోన్ ఎలిజిబిలిటీని నిర్ణయించడంలో ITRల హెల్ప్‌ను కూడా బ్యాంకులు తీసుకుంటాయి. మీరు లోన్ కోసం అప్లై చేస్తే, గత రెండు సంవత్సరాల ITRని బ్యాంకులు అడుగుతాయి. మీ లోన్ అప్లికేషన్‌కు ఆమోదముద్ర పడే అవకాశం పెరగడానికి ITR ఫైల్ చేయండి.
నష్టాలను ఫార్వర్డ్ చేయడానికి:
మీరు, షేర్లు వంటి క్యాపిటల్ అసెట్స్‌లో పెట్టుబడి పెడితే, పన్ను బాధ్యత లేకపోయినా, ITR సమర్పించడం ద్వారా దాదాపు 8 సంవత్సరాల పాటు మీ నష్టాలను ఫార్వర్డ్ చేసుకునే వెలుసుబాటు దొరుకుతుంది. భవిష్యత్తులో మీ టాక్స్ బిల్లు పెరిగితే, మీరు క్యారీ-ఫార్వర్డ్ చేసిన క్యాపిటల్ లాసెస్‌ను అప్పుడు వాడుకోవచ్చు. తద్వారా కట్టాల్సిన టాక్స్‌ను తగ్గించుకోవచ్చు.
ఆదాయ రుజువు:
మీ వార్షిక ఆదాయంతో పాటు పెట్టుబడుల వంటి ఇతరత్రా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫార్మల్ డాక్యుమెంటేషన్‌గా (అధికారిక పత్రం) ITR పని చేస్తుంది. లోన్లు, క్రెడిట్ కార్డ్‌ల జారీ సహా వివిధ కారణాల కోసం చాలా బ్యాంకులు/ఫైనాన్షియల్ కంపెనీలు ITR తీసుకురమ్మని అడుగుతాయి.
ఫారిన్ రెగ్యులేషన్స్ పాటించడంలో సాయం:
మీరు అంతర్జాతీయంగా వ్యాపారం చేస్తుంటే తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి. పన్ను ఎగవేతను (tax avoidance) నిరోధించడానికి చాలా దేశాల మధ్య అగ్రిమెంట్స్ ఉన్నాయి. ప్రత్యేకించి, మీకు విదేశాలలో ఆస్తులు ఉన్నట్లయితే ITR ఫైల్ చేయాలి. లేకపోతే, స్క్రూటినీ, ఫైన్ సహా లీగల్‌గా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ITR సమర్పించడం అంటే కేవలం పన్ను చెల్లించడం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. టాక్స్ రిటర్న్ దాఖలు చేయడం కాస్త భారంగా అనిపించినా, మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేకపోయినా, ITR ఫైల్ చేస్తే దానివల్ల మీకు కనిపించని ప్రయోజనాలు చాలా అందుతాయి. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఈ నెలాఖరులోగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి.
మరో ఆసక్తికర కథనం: కొనేది మీరయినా, కొనిపించేది వాళ్లు! ఈ-కామర్స్ కంపెనీల ట్రాప్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Travel Credit Cards: సెలవుల సంతోషాన్ని రెట్టింపు చేసే ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్ - రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్స్
Zomato News: చరిత్ర సృష్టించిన జొమాటో, కేవలం మూడున్నరేళ్లలోనే బంపర్ రికార్డ్
Gold-Silver Prices Today 22 Dec: గోల్డ్ షోరూమ్‌కు వెళ్లే ముందు రేట్లు తెలుసుకోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Housing Loan: హోమ్ లోన్ మీరు తీసుకోండి, గ్యారెంటీ గవర్నమెంట్ ఇస్తుంది - ఆస్తి పేపర్ల తనఖా అక్కర్లేదు!
Fixed Deposit Rates: ఈ నెలలో ఎఫ్డీ రేట్లను సవరించిన 5 బ్యాంకులు - ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్ కూడా ఉండొచ్చు!
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్