search
×

Financial Planning: ఈ స్టెప్స్‌ ఫాలో అయితే కోటీశ్వరులు కాకపోయినా అప్పులు లేకుండా రాజులా బతికేస్తారు! 

Financial Planning: ఈ పది స్టెప్స్ మీ ఆర్థిక స్థితిగతులను మార్చేస్తాయి. కచ్చితంగా ఎంత అప్పుల్లో ఉన్నాసరే బయటపడే మార్గాన్ని సూచిస్తాయి.

FOLLOW US: 
Share:

Financial Planning:రవి, ఒక 28 ఏళ్ల యువకుడు, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతనికి నెలకు మంచి జీతం వస్తున్నప్పటికీ, తన ఆర్థిక భవిష్యత్తును ఎలా ప్రణాళిక చేసుకోవాలో ఎప్పుడూ ఒక స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలా, లోన్లు తీసుకోవచ్చా, ఇన్సూరెన్స్ అవసరమా వంటి అనేక ప్రశ్నలు అతని మనసులో మెదులుతూ ఉండేవి. ఒకరోజు, తన స్నేహితుడిని కలిసి తన డౌట్స్ క్లియర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

సందేహం 1 స్టాక్ మార్కెట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? 

రవి తన మొదటి ప్రశ్నను స్నేహితుడు రాజు ముందుంచాడు. "నా డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలా? ఎక్కడ ఎక్కువ రాబడి వస్తుంది?" అని అడిగాడు.

దానికి రాజు ఇలా వివరించాడు: "రవి, ఇది చాలా మందికి వచ్చే సాధారణ సందేహం. ఒకవేళ నీకు స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఉందనుకో – అంటే టెక్నికల్ ఎనాలసిస్, ఫండమెంటల్ ఎనాలసిస్ ఎలా చేయాలో బాగా తెలిస్తే – అప్పుడు నువ్వు నేరుగా మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కానీ, ఒకవేళ నీకు పూర్తి నాలెడ్జ్ లేకపోతే, సగం నాలెడ్జ్‌తో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం కాస్త రిస్క్" అని చెప్పాడు. "అలాంటి పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా అంటే చాలా మంచిది. మ్యూచువల్ ఫండ్స్‌లో, నీ డబ్బును మేనేజ్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. నీకు పెద్దగా నాలెడ్జ్ లేదు కాబట్టి, ఆ ఫండ్ మేనేజర్ నీ బదులు స్టాక్ మార్కెట్‌ను బాగా రీసెర్చ్ చేసి, మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాడు. ఉదాహరణకు, నేను కూడా ప్రెజెంట్ ఎక్కువ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్‌లోనే పెట్టుబడి పెడుతున్నాను, ఎందుకంటే నాకు మార్కెట్‌ను అంతగా పట్టించుకునే సమయం దొరకడం లేదు. రాబడి విషయానికొస్తే, అది మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బాగుంటే సగటున 12% వరకు రాబడి రావొచ్చు, కానీ మార్కెట్ బాగాలేకపోతే నష్టాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన సలహా ఏంటంటే, నీ డబ్బు అంతా ఒకే చోట పెట్టకుండా డైవర్సిఫై చేసుకో. ఉదాహరణకు, నీవు ప్రతి నెలా 10,000 రూపాయలు పెట్టుబడి పెడుతుంటే, అందులో 6,000 ఈక్విటీలో, మిగిలిన 4,000 కాస్త సేఫ్ అయిన పెట్టుబడి ఆప్షన్స్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు." అని మొదటి సందేహాన్ని నివృత్తి చేశాడు. 

ముఖ్యమైన పాయింట్స్:

  • స్టాక్ మార్కెట్ పెట్టుబడి: పూర్తి నాలెడ్జ్ (టెక్నికల్, ఫండమెంటల్ ఎనాలసిస్) ఉన్నవారికే అనుకూలం.
  • మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి: నాలెడ్జ్ లేనివారు, సమయం లేనివారు ఫండ్ మేనేజర్ ద్వారా పెట్టుబడి పెట్టడానికి ఇది సురక్షితమైన మార్గం.
  • రాబడి: మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది; లాభాలు రావచ్చు, నష్టాలు కూడా సాధ్యమే. 
  • డైవర్సిఫికేషన్: పెట్టుబడులను ఒకే చోట కాకుండా వివిధ మార్గాలలో విభజించడం ముఖ్యం.

సందేహం 2: ప్రతి నెలా ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి? 

రవి కొద్దిగా ఆలోచించి, "నాకు వచ్చే జీతమే తక్కువ, అలాంటప్పుడు ప్రతి నెలా ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి?" అని అడిగాడు.

రాజు నవ్వుతూ, ఇలా చెప్పాడు: రవి, జీతం తక్కువైనా, ఎక్కువైనా సరే, కనీసం నీ నెలవారీ ఆదాయంలో 20శాతం డబ్బును పెట్టుబడి పెట్టడానికి కేటాయించుకోవాలి. ఉదాహరణకు, నీకు 10,000 జీతం వస్తుంటే, కనీసం 2,000 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేసుకో, మిగిలిన 8,000తో బతకడానికి ప్రయత్నించు. జీతం తక్కువ ఉందని సాకులు చెప్పొద్దు, సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. నీకు తెలిసిన చాలా మంది ఉద్యోగం చేస్తూనే పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నారు. కొందరు స్విగ్గీ, రాపిడో, జెప్టో వంటి డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో, మరికొందరు డొమినోస్ డెలివరీలో పనిచేస్తూ, రెండో ఆదాయ వనరును క్రియేట్ చేసుకుంటున్నారు. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసుకోగలిగితే, ఒక సోర్స్ నుంచి వచ్చే డబ్బును పెట్టుబడిగా పెట్టి నీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు." అని వివరించాడు. 

ముఖ్యమైన పాయింట్స్: 

  • కనీస పెట్టుబడి: నెలవారీ ఆదాయంలో కనీసం 20% పెట్టుబడి పెట్టాలి.
  • ఆదాయ వనరులు: తక్కువ జీతం ఉన్నవారు పార్ట్‌టైమ్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్ ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
  • సాకులు వద్దు: తక్కువ జీతం అనేది పెట్టుబడి పెట్టకుండా ఉండటానికి సాకుగా చెప్పకూడదు.

సందేహం 3: మన ఆదాయానికి ఎంత లోన్ తీసుకోవాలి? 

"త్వరలో నాకు పెళ్లి, చాలా గ్రాండ్‌గా చేసుకోవాలని ఉంది. అందుకే లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎంత లోన్ తీసుకోవాలి?" అని రవి అడిగాడు.

రాజు సీరియస్‌గా ఇలా చెప్పాడు: "రవి, లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ లోన్ దేనికోసం తీసుకుంటున్నాం అన్నది ముఖ్యం. లోన్లలో రెండు రకాలు ఉంటాయి: గుడ్ లోన్, బ్యాడ్ లోన్. పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని పర్సనల్ లోన్ లేదా బయట వడ్డీకి డబ్బు తీసుకోవడం అనేది  బ్యాడ్ లోన్. ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో నీకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా సరే శక్తికి మించి అప్పు చేయకండి, వయసును మించి భారాన్ని మోయాల్సి వస్తుంది. పక్కవాళ్లు చేసుకున్నారు కదా అని వారితో పోల్చుకుని అప్పులు చేయవద్దు. భవిష్యత్తులో మనకు ఆర్థికంగా లాభం చేకూర్చే లోన్లు మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు, ప్లాట్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, లేదా ఆరోగ్య సమస్యల కోసం తీసుకునే లోన్లు  గుడ్ లోన్లు. నీవు ఎన్ని లోన్లు తీసుకున్నా సరే, వాటి EMIలు అన్నీ కలిపి నీ నెలవారీ ఆదాయంలో 30% మించకూడదు. ఉదాహరణకు, నీ నెలవారీ ఆదాయం లక్ష రూపాయలైతే, నీ మొత్తం EMIలు 30,000 మించకూడదు. 

ముఖ్యమైన పాయింట్స్: 
 

  • లోన్ రకాలు: 
    గుడ్ లోన్: భవిష్యత్తులో లాభం కలిగించేవి (ప్లాట్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, హెల్త్ లోన్).
    బ్యాడ్ లోన్: వ్యక్తిగత ఖర్చులు, విలాసాల కోసం తీసుకునేవి (పర్సనల్ లోన్ ఫర్ మ్యారేజ్, పార్టీ).
  • లోన్ పరిమితి: అన్ని లోన్ EMIలు కలిపి నెలవారీ ఆదాయంలో 30% మించకూడదు.
  • సలహా: అవసరం ఉంటేనే, అది కూడా గుడ్ లోన్ మాత్రమే తీసుకోవాలి.

సందేహం 4: ఏ రకమైన బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి? 

ఒకవేళ లోన్ తీసుకోవాల్సి వస్తే, ఏ బ్యాంక్ నుంచి తీసుకోవడం మంచిది?" అని రవి అడిగాడు.

రాజు వెంటనే ఇలా బదులిచ్చాడు: "ఏ లోన్ అయినా సరే – పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ లేదా బిజినెస్ లోన్ – మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (గవర్నమెంట్ బ్యాంకులు). SBI, ఇండియన్ బ్యాంక్ వంటివి. ఎందుకంటే వాటిల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, హోమ్ లోన్ వడ్డీ రేటు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో 7.35% నుంచి 8.95% వరకు ఉంటుంది. ఒకవేళ వారు నీకు లోన్ ఇవ్వకపోతే, అప్పుడు నీ రెండో ప్రాధాన్యత ప్రైవేట్ బ్యాంకులైన HDFC, యాక్సిస్ వంటివాటికి వెళ్లాలి. వాటిలో వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది (ఉదాహరణకు, హోమ్ లోన్ 7.7% నుంచి 9.55% వరకు). చివరి ప్రాధాన్యతగా మాత్రమే NBFCలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల దగ్గరకు వెళ్లు. వాటిల్లో వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది (కనీసం 8.75% నుంచి 12-24% వరకు కూడా ఉండొచ్చు)."

ముఖ్యమైన పాయింట్స్: 

  • మొదటి ప్రాధాన్యత:పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (తక్కువ వడ్డీ రేట్లు).
  • రెండవ ప్రాధాన్యత:ప్రైవేట్ బ్యాంకులు (కొద్దిగా ఎక్కువ వడ్డీ).
  • చివరి ప్రాధాన్యత: NBFCలు లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (అధిక వడ్డీ).

సందేహం 5: కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా, ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? 

రవికి తన కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని, అది సరిపోతుందని భావించాడు.

రాజు ఈ విధంగా వివరించాడు: "రవి, నువ్వు ప్రస్తుతం మంచి కంపెనీలో పనిచేస్తున్నావు కాబట్టి వారు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అది మంచిదే. కానీ ఆ  కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్స్ నువ్వు ఆ కంపెనీలో పనిచేస్తున్నంత కాలం మాత్రమే చెల్లుతుంది. భవిష్యత్తులో నువ్వు జాబ్ మారొచ్చు, లేదా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఆ కంపెనీ నీకు ఇన్సూరెన్స్ అందించదు కదా? పైగా, వయసు పెరిగే కొద్దీ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇప్పుడే, తక్కువ వయసులో తీసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. అలాగే, కంపెనీలు ఇచ్చే కవరేజ్ కూడా తక్కువ ఉండొచ్చు (ఉదాహరణకు, 4 లక్షలు). ఒకవేళ నీకు 10 లక్షలు ఖర్చయింది అనుకో, మిగిలిన డబ్బు ఎవరు భరించాలి? నువ్వే కదా? అందుకే, నువ్వు కంపెనీలో పనిచేస్తున్నా కూడా, విడిగా ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. అప్పుడు కంపెనీ కవరేజ్ తర్వాత మిగిలిన ఖర్చును నీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది."

ముఖ్యమైన పాయింట్స్: 

  • కంపెనీ ఇన్సూరెన్స్ పరిమితి: కంపెనీలో పనిచేస్తున్నంత కాలమే చెల్లుతుంది, కవరేజ్ తక్కువ ఉండొచ్చు.
  • ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆవశ్యకత: భవిష్యత్తులో ఉద్యోగం మారినా, వృత్తి మారినా ఇది రక్షణగా ఉంటుంది.
  • వయసు ప్రభావం: తక్కువ వయసులో ప్రీమియం తక్కువగా ఉంటుంది; వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది.
  • సలహా: కంపెనీ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా, విడిగా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

సందేహం 6: లోన్ తీసుకునేటప్పుడు ఫిక్స్‌డ్ రేట్ చూస్ చేసుకోవాలా, ఫ్లోటింగ్ రేట్ చూస్ చేసుకోవాలా?

"నేను హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ మంచిదా, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ మంచిదా?" అని రవి అడిగాడు.

రాజు ఇలా చెప్పాడు: "ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే, నువ్వు లోన్ తీసుకున్న టెన్యూర్ మొత్తం వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. RBI రెపో రేట్‌లో ఎన్ని మార్పులు వచ్చినా నీ వడ్డీ మారదు. ఫ్లోటింగ్ రేట్ అయితే, RBI రెపో రేట్‌ను తగ్గిస్తే నీ వడ్డీ కూడా తగ్గుతుంది, దానితో పాటు నీ EMI కూడా తగ్గుతుంది. అదే పెరిగితే పెరుగుతుంది. ఇటీవలి కాలంలో RBI రెపో రేట్లను తగ్గిస్తూ వస్తుంది, భవిష్యత్తులో కూడా తగ్గించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు, మా అన్నయ్య హోమ్ లోన్ ఫ్లోటింగ్ రేట్ తీసుకున్నాడు, రెపో రేట్ తగ్గడం వల్ల అతని వడ్డీ తగ్గింది, EMI కూడా తగ్గింది. నేను తీసుకున్న ప్రతి లోను కూడా ఫ్లోటింగ్ రేటే."

ముఖ్యమైన పాయింట్స్:

  • ఫిక్స్‌డ్ రేట్: లోన్ టెన్యూర్ అంతా వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.
  • ఫ్లోటింగ్ రేట్: RBI రెపో రేట్ మార్పులకు అనుగుణంగా వడ్డీ రేటు మారుతుంది (తగ్గితే EMI తగ్గుతుంది, పెరిగితే EMI పెరుగుతుంది).
  • ప్రస్తుత ట్రెండ్: RBI రెపో రేట్లను తగ్గిస్తూ ఉండటం వలన ఫ్లోటింగ్ రేట్ అనుకూలంగా ఉండొచ్చు.

సందేహం 7: NFO (న్యూ ఫండ్ ఆఫర్) అంటే ఏమిటి? దానిలో పెట్టుబడి పెట్టొచ్చా?

"NFO గురించి చాలా వింటున్నాను. అంటే ఏమిటి? దానిలో పెట్టుబడి పెట్టొచ్చా?" అని రవి ఆసక్తిగా అడిగాడు.

రాజు ఇలా వివరించాడు: "NFO అంటే న్యూ ఫండ్ ఆఫర్. స్టాక్ మార్కెట్‌లో ఐపిఓ (Initial Public Offering) ఎలాగో, అదేవిధంగా ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ మొదటిసారి మార్కెట్‌లోకి వస్తున్న ప్రాసెస్‌ని NFO అంటారు. NFOలు రెండు రకాలు: ఒకటి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) NFOలు, ఇవి పూర్తిగా పెట్టుబడి కోసం. రెండవది ఇన్సూరెన్స్ కంపెనీల NFOలు, ఇవి ULIP (Unit-Linked Insurance Plan) రకానికి చెందినవి. వీటిలో పెట్టుబడి, ఇన్సూరెన్స్ రెండు ప్రయోజనాలు ఉంటాయి. నీ పోర్ట్‌ఫోలియో ఇప్పటికే డైవర్సిఫై అయ్యి ఉండి, మరింత డైవర్సిఫికేషన్ కోరుకుంటే ULIP నీకు సరిపోతుంది. NFO ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ప్రారంభంలో NAV (నికర ఆస్తి విలువ) కేవలం 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇవి ఎల్లప్పుడూ ఓపెన్‌గా ఉండవు, ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఇటీవల టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 'టాటా ఏఐఏ లైఫ్ మొమెంటం 50 ఇండెక్స్ ఫండ్' అనే ఒక ULIP NFOను లాంచ్ చేసింది. దీనిలో పెట్టుబడికి చివరి తేదీ ఆగస్టు 24. ఇది BSE 500 మొమెంటం 50 ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది, ఇందులో మంచి పనితీరు కనబరిచే టాప్ 50 స్టాక్స్‌ ఉంటాయి. గత 10 సంవత్సరాలుగా ఈ ఇండెక్స్ 22.9% రాబడిని ఇచ్చింది, గత 5 సంవత్సరాలుగా 36.2% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, మార్కెట్ మీద ఆధారపడి డబ్బు పెరుగుతుంది, అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ప్రమాదం జరిగితే, నామినీకి వార్షిక ప్రీమియంకు 120 రెట్లు లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అయితే, పెట్టుబడిని, ఇన్సూరెన్స్‌ను కలపకూడదు అనుకునేవారు దీని జోలికి వెళ్లొద్దు."  

ముఖ్యమైన పాయింట్స్: 

  • NFO నిర్వచనం: మ్యూచువల్ ఫండ్ మొదటిసారి మార్కెట్‌లోకి వచ్చినప్పుడు చేసే ఆఫర్, స్టాక్ IPO లాంటిది.
  • NFO రకాలు: AMC NFOలు (కేవలం పెట్టుబడి), ఇన్సూరెన్స్ కంపెనీ NFOలు (ULIP – పెట్టుబడి + ఇన్సూరెన్స్).
  • ULIP ప్రయోజనాలు: పెట్టుబడి వృద్ధి, ఇన్సూరెన్స్ రక్షణ రెండూ ఉంటాయి; పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోరుకునే వారికి అనుకూలం.
  • ప్రారంభ NAV: NFO సమయంలో NAV సాధారణంగా ₹10 ఉంటుంది.
  • సమయ పరిమితి: NFOలు నిర్దిష్ట కాలానికి మాత్రమే తెరిచి ఉంటాయి.
  • ముఖ్యమైన సలహా: పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశీలించి, అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి; పెట్టుబడి, ఇన్సూరెన్స్ కలపడానికి ఇష్టం లేనివారు దూరంగా ఉండాలి.

సందేహం 8: లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మధ్య తేడా ఏమిటి? 

రవికి లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలియదు.

రాజు ఇలా వివరించాడు: "రవి, లైఫ్ ఇన్సూరెన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఒక భాగం మాత్రమే. టర్మ్ ఇన్సూరెన్స్‌లో నువ్వు ప్రీమియం కడతావు, ఆ టర్మ్ (కాలపరిమితి) తర్వాత నువ్వు బతికి ఉంటే నీకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. కానీ ఆ టర్మ్ లోపు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే (అంటే, చనిపోతే), నువ్వు ఎంపిక చేసుకున్న కవరేజ్ మొత్తం నీ కుటుంబానికి అందుతుంది. దీని ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది, కానీ లైఫ్ కవరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్, ULIP ప్లాన్స్ వంటివాటిలో పెట్టుబడి, ఇన్సూరెన్స్ రెండూ ఉంటాయి, అవి మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బును తిరిగి ఇస్తాయి, కానీ వాటి ప్రీమియంలు టర్మ్ ఇన్సూరెన్స్ కంటే ఎక్కువ ఉంటాయి, కవరేజ్ తక్కువగా ఉంటుంది."

ముఖ్యమైన పాయింట్స్: 

  • టర్మ్ ఇన్సూరెన్స్: లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఒక భాగం.
  • ప్రయోజనం: తక్కువ ప్రీమియం, అధిక లైఫ్ కవరేజ్.
  • రాబడి: పాలసీ టర్మ్ పూర్తయ్యాక బతికి ఉంటే డబ్బు తిరిగి రాదు.
  • ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు: ఎండోమెంట్, మనీ బ్యాక్, ULIP వంటివి పెట్టుబడి, ఇన్సూరెన్స్ రెండింటినీ అందిస్తాయి, మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉంటాయి,
  • కానీ ప్రీమియం ఎక్కువ, కవరేజ్ తక్కువ.

సందేహం 9: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? 

"అత్యవసర నిధిని ఎంత ఏర్పాటు చేసుకోవాలి?" అని రవి అడిగాడు.

 రాజు ఇలా చెప్పాడు: "ప్రతి ఒక్కరూ అత్యవసర నిధిని కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. నీ ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బు ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉండాలి. ఉదాహరణకు, నీ నెలవారీ ఖర్చులు 30,000 రూపాయలు అనుకుంటే, 30,000 X6 = 1,80,000 రూపాయలు నీ ఎమర్జెన్సీ ఫండ్‌లో ఉండాలి. ఈ డబ్బును రెండు భాగాలుగా పెట్టుకో: ఒక 90,000 సేవింగ్స్ అకౌంట్‌లో, మిగిలిన 90,000 ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుకో. గతంలో కోవిడ్ వచ్చినప్పుడు చాలా మందికి ఉద్యోగాలు పోయాయి, ఆదాయం లేదు, సేవింగ్స్ లేవు, ఎమర్జెన్సీ ఫండ్ లేదు. అప్పుడు రెండు రూపాయల, మూడు రూపాయల వడ్డీకి అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే, భవిష్యత్తులో ఉద్యోగం పోయినా, ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినా, ఎవరినీ చేయి చాచి అడగాల్సిన అవసరం ఉండదు."

 ముఖ్యమైన పాయింట్స్: 

  •  ఎమర్జెన్సీ ఫండ్ మొత్తం: కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు ఉండాలి.
  •  నిల్వ చేసే విధానం: సగం సేవింగ్స్ అకౌంట్‌లో, సగం ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో.
  • ప్రయోజనం: ఆర్థిక అత్యవసర పరిస్థితులలో (ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం) రక్షణ కవచంగా పనిచేస్తుంది, అప్పులు చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.

 సందేహం 10: అప్పు తీర్చాలా, లేదా పెట్టుబడి పెట్టాలా? 

"నాకు ఇటీవల కంపెనీ నుంచి బోనస్ వచ్చింది. ఆ డబ్బుతో పర్సనల్ లోన్ తీర్చాలా, లేదా పెట్టుబడి పెట్టాలా?" అని రవి తన చివరి ప్రశ్న అడిగాడు.

రాజు ఇలా వివరించాడు: "నువ్వు ఇటీవల ఒక పర్సనల్ లోన్ తీసుకున్నావు అనుకుందాం, దాని వడ్డీ రేటు 19% ఉంది. ఇప్పుడు నీకు బోనస్ వచ్చింది. నన్ను అడిగితే, ఆ డబ్బుతో ముందు అప్పు తీర్చడమే మంచిది. ఎందుకంటే, నువ్వు లోన్ తీసుకున్న మొదటి కొన్ని నెలలు లేదా సంవత్సరాలలో, నువ్వు కట్టే EMIలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది, అసలుకు చాలా తక్కువ వెళ్తుంది. నువ్వు 19% వడ్డీ ఉన్న లోన్‌ను తీర్చడానికి బదులు, ఆ డబ్బును పెట్టుబడిగా పెడితే మహా అయితే 12% రాబడి వస్తుంది. ఎప్పుడైనా సరే, నీ అప్పు వడ్డీ రేటు కంటే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటేనే ఆ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించు. ఈ సందర్భంలో, అప్పు తీర్చడమే నీకు ఎక్కువ లాభదాయకం."

ముఖ్యమైన పాయింట్స్: 

  • అధిక వడ్డీ అప్పుల చెల్లింపు: పెట్టుబడి రాబడి కంటే అప్పు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, ముందు అప్పు తీర్చడం మంచిది.
  • లోన్ ప్రారంభ దశలు: EMIలో అధిక భాగం వడ్డీకి వెళ్తుంది, కాబట్టి ముందుగా అప్పు తీర్చడం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
  • నియమం: పెట్టుబడి రాబడి అప్పు వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వాలి.

రాజు చెప్పిన ఈ పది ఆర్థిక సూత్రాలు రవికి కనువిప్పు కలిగించాయి. తన ఆర్థిక భవిష్యత్తుకు ఒక స్పష్టమైన మార్గం దొరికినందుకు రవి చాలా సంతోషించాడు. రాజుకు కృతజ్ఞతలు చెప్పి, తన ఆర్థిక ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా, తెలివిగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

Published at : 27 Aug 2025 02:01 AM (IST) Tags: Loans Mutual Funds Financial planning Investments INSURANCE Emergency Fund Personal Finance Debt Management Telugu Story Income Sources

ఇవి కూడా చూడండి

Rent Agreement Rules 2025 : అద్దెదారుల టెన్షన్‌కు పుల్‌స్టాప్‌, గృహ యజమానులు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు! కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?

Rent Agreement Rules 2025 : అద్దెదారుల టెన్షన్‌కు పుల్‌స్టాప్‌, గృహ యజమానులు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు! కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Silver Price: బంగారానికి పోటీగా వెండి రికార్డు పరుగు! 1.77 లక్షలకు చేరిన ధర

Silver Price: బంగారానికి పోటీగా వెండి రికార్డు పరుగు! 1.77 లక్షలకు చేరిన ధర

Income Tax Alert: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు

Income Tax Alert: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు

ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !

ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !

టాప్ స్టోరీస్

Akhanda 2 Twitter Review: 'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?

Akhanda 2 Twitter Review: 'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?

Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!

Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!

South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం

South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం

Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ

Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ