By: ABP Desam | Updated at : 17 Nov 2022 05:24 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రెడిట్ కార్డు పేమెంట్ ( Image Source : Finshots )
UPI-RuPay credit card: సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లారా? పేమెంట్ చేయాలనుకున్న క్రెడిట్ కార్డును ఇంటి వద్దే మర్చిపోయారా? అయినా నో ప్రాబ్లమ్! ఫిజికల్‌గా క్రెడిట్ కార్డు మీ వద్ద లేనప్పటికీ మొబైల్ ద్వారానే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందుకు మీ రూపే క్రెడిట్ కార్డును బీమ్ యూపీఐ యాప్‌తో అనుసంధానం చేసుకుంటే చాలు.
రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ
దేశంలో ఎక్కువ డిజిటల్ చెల్లింపులు యూపీఐ విధానంలోనే జరుగుతున్నాయి. సింపుల్‌గా ఏదో ఒక యూపీఐ ఆధారిత యాప్‌ను మొబైల్లో ఇన్‌స్టాల్ చేసుకొంటే చాలు. దానికి మీ బ్యాంకు ఖాతా లేదా డెబిట్ కార్డును అనుసంధానం చేసుకొంటే ఆన్‌లైన్‌లో సులువుగా డబ్బులు చెల్లించొచ్చు. ఈ సూపర్ హిట్టైన ప్రక్రియనే క్రెడిట్ కార్డులకూ వర్తింపచేసింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI). రూపే క్రెడిట్ కార్డులను బీమ్ (BHIM UPI) యాప్‌కు లింక్ చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మీ వద్ద ఫిజికల్ కార్డు లేకపోయినా వ్యాపార సముదాయాల వద్ద స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు.
క్రెడిట్ కార్డుల పెనెట్రేషన్ పెంపే లక్ష్యం
'క్రెడిట్ కార్డుల ఇండస్ట్రీ ఏటా 30 శాతం వృద్ధిరేటుతో పయనిస్తోంది. అయినప్పటికీ జనాభాతో పోలిస్తే వీటి వాడకం 6 శాతమే. పాయింట్ ఆఫ్ సేల్ డివైజులు మర్చంట్ ఎకోసిస్టమ్ వృద్ధికి అడ్డంకిగా మారడమే ఇందుకు కారణం. యూపీఐలో రూపే క్రెడిట్ కార్డు అనుసంధానం ద్వారా వినియోగాన్ని పెంచడమే మా లక్ష్యం' అని ఫిన్‌టెక్ సొల్యూషన్స్ మైండ్ గేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లలిత్ చౌదరి అన్నారు. యూపీఐ వినియోగం ద్వారా క్రెడిట్ కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదని, బయటికి తెస్తే పోతుందన్న భయం ఉండదని అంటున్నారు.
రూపే క్రెడిట్ కార్డు యూపీఐని ఎవరు వాడొచ్చు?
ప్రస్తుతం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొన్ని బ్యాంకులకు మాత్రమే ఇందుకు అనుమతి ఇచ్చింది. ఆ బ్యాంకులు జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డులతో బీమ్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేపట్టొచ్చు. 2022, సెప్టెంబర్ 20న ఎన్‌సీపీఐ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు కస్టమర్లు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి ఎలా లింక్ చేయాలి?
యూపీఐ సేవలకు సేవింగ్స్ బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డులను చేసినట్టే క్రెడిట్ కార్డులనూ అనుసంధానం చేయొచ్చు. కస్టమర్ మొదట తన మొబైల్లో బీమ్ ఆధారిత యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. 'యాడ్ క్రెడిట్ కార్డ్' ఆప్షన్‌ను క్లిక్ చేసి సంబంధిత బ్యాంకు క్రెడిట్ కార్డును ఎంపిక చేయాలి. అప్పుడు యూపీఐ యాప్‌లో రూపే క్రెడిట్ కార్డు కనిపిస్తుంది. దానిని యూజర్ సెలెక్ట్ చేయాలి. అలాగే క్రెడిట్ కార్డు చివరి ఆరు అంకెలు, వ్యాలిడిటీ వివరాలను ఎంటర్ చేయాలి. ఆపై ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తైతే యూపీఐకి క్రెడిట్ కార్డు అనుసంధానం అవుతుంది.
యూపీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఎలా చెల్లించాలి?
ఈ సౌకర్యం ద్వారా డబ్బులు చెల్లించడం అత్యంత సులువు. ఇప్పుడున్నట్టుగానే మర్చంట్ వద్ద ఉన్న స్కాన్ కోడ్‌ను మీ మైబైల్ ద్వారా స్కాన్ చేయాలి. డెబిట్ ఆప్షన్‌గా యూపీఐ ఆన్ క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి. స్కాన్ పూర్తయ్యాక పిన్ ఎంటర్ చేయాలి. దాంతో పేమెంట్ పూర్తవుతుంది. ఈ వ్యవస్థలో కొన్ని పరిమితులు ఉన్నాయి. మర్చంట్ యూపీఐ ఆన్ రూపే క్రెడిట్ కార్డ్‌కు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అప్పుడే లావాదేవీ పూర్తవుతుంది.
Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కి.మీ. మైలేజ్! - లోన్‌పై హోండా బైక్ కొంటే ఎంత EMI చెల్లించాలి?
PPF, SSY, NSC: పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రకటించిన ప్రభుత్వం
Gold-Silver Prices Today 29 Mar: పసిడి మెరుపు పెరిగింది, వెండి వెనక్కు తగ్గింది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
ATM Withdrawal Fee: ATM నుంచి డబ్బు తీస్తే రూ.23 బాదుడు, తస్మాత్ జాగ్రత్త!
IPL 2025 CSK vs RR: నితీష్ రాణా మెరుపు ఇన్నింగ్స్, సీఎస్కేకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాయల్స్
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: సన్ రైజర్స్ కు రెండో ఓటమి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక రాణించిన డుప్లెసిస్, స్టార్క్