By: Arun Kumar Veera | Updated at : 19 Mar 2024 07:42 AM (IST)
పోస్టాఫీస్ పథకాల్లో ఇవి బెస్ట్
Post Office Small Savings Schemes: మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందినా, పోస్టాఫీసు పథకాలకు ఉన్న ఫాలోయింగే వేరు. పెట్టుబడికి భద్రత, వడ్డీ ఆదాయం విషయంలో పోస్టాఫీస్ పథకాలపై ప్రజల నమ్మకం పీక్స్‌లో ఉంటుంది. చిన్న మొత్తాలతో మదుపు చేయగలగడం పోస్టాఫీసు పథకాలకు ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్.
ఏ పోస్టాఫీస్ పథకాన్ని ఎంచుకోవాలన్న విషయం ప్రతి వ్యక్తి అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, వివిధ పథకాలపై అందే వడ్డీ వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒక పథకంలో పెట్టుబడి పెట్టే ముందు.. ఆ పథకానికి ఆదాయ పన్ను ప్రయోజనం అర్హత ఉందా, లేదా అని చూసుకోవడం కూడా ముఖ్యమే.
1. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (Post Office Monthly Income Scheme):
కనీసం రూ. 1,500 పెట్టుబడితో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరొచ్చు. దీనిలో రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు, ఉమ్మడి ఖాతా విషయంలో గరిష్ట పరిమితి (limit for joint account) రూ. 15 లక్షలు. ఈ పథకంలో చెల్లిస్తున్న వార్షిక వడ్డీ రేటు 7.40%. ఈ వడ్డీ ఆదాయం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు తీసుకోవడానికి అర్హత మాత్రం ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో సాధారణ ప్రజలు రూ. 40,000 లేదా సీనియర్ సిటిజన్లు రూ. 50,000 కంటే ఎక్కువ వడ్డీ సంపాదిస్తే TDS కట్ అవుతుంది.
2. కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra):
కిసాన్ వికాస్ పత్ర ఒక ఆకర్షణీయమైన పథకమే అయినప్పటికీ 80C తగ్గింపును ఆఫర్ చేయడం లేదు. ఈ పథకం నుంచి వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR 2024) ఫైల్ చేసే సమయంలో "ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం" (income from other sources) హెడ్ కిందకు ఇది వస్తుంది. మెచ్యూరిటీ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే TDS వర్తించదు. KVPలో పెట్టిన పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది.
3. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (Mahila Samman Savings Certificate):
మహిళలకు మాత్రమే వర్తించే స్వల్ప కాలికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకం ఇది. ఈ పథకం ఎలాంటి పన్ను ప్రయోజనాలను అందించదు. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. మహిళా సాధికారత కోసం దీనిని తీసుకొచ్చినప్పటికీ, ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ముందు పన్ను గురించి అవగాహన పెంచుకోవడం ముఖ్యం. ఈ పథకంపై ఏడాదికి 7.50% వడ్డీ చెల్లిస్తున్నారు.
4. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా (Post Office Time Deposit Account):
టెన్యూర్ పరంగా (1, 2, 3, 5 సంవత్సరాల కాల పరిమితి) ఈ స్కీమ్ సానుకూలంగా ఉన్నప్పటికీ, ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉన్న డిపాజిట్లకు మాత్రమే ఆదాయ పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. దీని కంటే తక్కువ కాల వ్యవధి డిపాజిట్లకు సెక్షన్ 80C అర్హత ఉండదు. ప్రస్తుతం, టైమ్ డిపాజిట్ల మీద 6.90% నుంచి 7.10% వరకు వడ్డీ చెల్లిస్తున్నారు.
5. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (Post Office Recurring Deposit Account):
దీని లాక్-ఇన్ పిరియడ్ ఐదేళ్లు. ఏడాదికి 5.80% నుంచి 6.80% వరకు ఆకర్షణనీయమైన వడ్డీ ఆదాయం అందుతుంది. అయితే, ఈ పథకం సెక్షన్ 80C కిందకు రాదు. పెద్దగా ఆర్థిక భారం లేకుండా నెలనెలా ఈ ఖాతాలో డిపాజిట్ చేసుకోగలిగినా, సంపాదించిన వడ్డీపై ఆదాయ పన్ను చెల్లించాలి.
మరో ఆసక్తికర కథనం: టీసీఎస్ షేర్లను అమ్మకానికి పెడుతున్న టాటా సన్స్, డీల్ విలువ రూ.9300 కోట్లు
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్టరయ్యారు!సినిమాలో నటిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్! సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు వైరల్
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy