search
×

Lower EMI Strategy: మీ బ్యాంక్‌ లోన్ EMI కచ్చితంగా తగ్గుతుంది - మీరు ఈ పనిని చేస్తే చాలు!

Professional Loan: మీరు కొన్ని ప్రత్యేక వ్యూహాలను అనుసరించడం ద్వారా మీ EMI భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో, మీ క్రెడిట్ స్కోర్ చాలా సాయం చేస్తుంది.

FOLLOW US: 
Share:

Tips To Reduce Bank Loan EMI: బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలు చాలా రకాల లోన్లను ప్రజలకు ఆఫర్‌ చేస్తాయి. వాటిలో, ప్రొఫెషనల్‌ లోన్‌ ఒకటి. మీరు డాక్టర్, ఇంజినీర్, లాయర్, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా మరేదైనా ప్రొఫెషనల్ కావచ్చు. మీ ఫెసిలిటీ సెంటర్‌ను లేదా ప్రాక్టీస్‌ను పెంచుకోవడానికి మీకు కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం. దీనికోసం డబ్బు కావాలి. మీ సర్వీస్‌లను విస్తరించడానికి మీ దగ్గర డబ్బు లేకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ బ్యాంక్‌కు వెళ్లినా మీకు వృత్తిపరమైన రుణం (Professional Loan) సులభంగా లభిస్తుంది. బ్యాంక్‌లు కాకుండా ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఈ లోన్‌ ఫెసిలిటీని అందిస్తున్నాయి.

వ్యక్తిగత రుణం (Personal loan) తరహాలో ప్రొఫెషనల్‌ లోన్ ఖర్చు చేయడంలో మీకు పూర్తి స్వేచ్ఛ & సౌలభ్యం ఉంటుంది. అంటే, మీరు మీ డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి అనే దానిపై రుణదాత ‍‌(Lender) ఎటువంటి పరిమితులు విధించదు, మీరు నెలవారీ కిస్తీ (EMI) సక్రమంగా చెల్లిస్తే చాలని భావిస్తుంది. అయితే, లోన్‌ EMI ఎక్కువగా ఉంటే, అది మీ ఆందోళనను పెంచుతుంది, మిమ్మల్ని నిద్రపోనివ్వదు. కొన్ని ప్రత్యేక వ్యూహాలను అనుసరించడం ద్వారా మీరు మీ EMI భారాన్ని తగ్గించుకోవచ్చు.

బ్యాంక్‌ లోన్‌ EMIని తగ్గించుకునే ఉపాయాలు:

అధిక క్రెడిట్‌ స్కోర్‌
రుణదాతమీ రుణంపై వడ్డీ రేటును నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోర్ ‍‌(Credit score) కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా, బ్యాంక్‌ లేదా ఏదైనా ఆర్థిక సంస్థ రుణగ్రహీత సిబిల్‌ స్కోర్‌ ‍‌(CIBIL score)ను పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల, మీ క్రెడిట్ స్కోర్‌ ఎప్పుడూ తగ్గకుండా, అదే సమయంలో ఎక్కువగా ఉండేలా ఉంచుకోండి. దీనికోసం.. మీరు ఇప్పటికే తీసుకున్న అన్ని రుణాల EMIలను సకాలంలో చెల్లించండి. మీ క్రెడిట్ కార్డ్‌లను అతిగా ఉపయోగించడం మానుకోండి. మీ క్రెడిట్‌ కార్డ్‌ పరిమితిలో 30 శాతానికి మించి ఉపయోగించవద్దు. ఆ క్రెడిట్‌ మీ అవసరాలకు సరిపోకపోతే, రెండు లేదా మూడు క్రెడిట్‌ కార్డ్‌లు తీసుకుని, ప్రతి దానిలో వ్యయం 30 శాతానికి మించకుండా చూసుకోండి. మీ క్రెడిట్ స్కోర్‌ను ఎల్లప్పుడూ 750 కంటే పైన ఉంచుకోండి. ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీకి లోన్ దొరుకుతుంది, దానిని తక్కువ EMIలతో తిరిగి తీర్చేయవచ్చు.

రీపేమెంట్‌ కాలం
చెల్లించే EMI మొత్తం తక్కువగా ఉంచడానికి, రుణాన్ని తిరిగి చెల్లించే కాలాన్ని ‍‌(Loan repayment period) పెంచండి. మీ లోన్ కాల పరిమితి ఎంత ఎక్కువ ఉంటే మీ EMI తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. 12 శాతం వడ్డీ రేటుతో రూ. 5 లక్షల రుణాన్ని మూడేళ్లలో చెల్లించిన కేస్‌తో పోలిస్తే, ఐదేళ్లలో చెల్లించిన కేస్‌లో ఈఎంఐ కచ్చితంగా తగ్గుతుంది. అయితే, కాల పరిమితి పెరిగితే EMI తగ్గినప్పటికీ, చెల్లించాల్సిన వడ్డీ మొత్తం పెరుగుతుందని గుర్తుంచుకోండి.

తక్కువ వడ్డీ రేట్ల కోసం బ్యాంక్‌తో చర్చలు
తక్కువ వడ్డీ రేటు కోసం బ్యాంక్‌తో చర్చలు జరపడం కూడా మీ EMIని తగ్గించడంలో సాయపడుతుంది. దీని కోసం మీరు నమ్మకమైన కస్టమర్‌గా బ్యాంక్‌ను నమ్మించాలి, అదే సమయంలో అధిక క్రెడిట్‌ స్కోర్‌ & మచ్చలేని క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండాలి. అప్పటికీ, బ్యాంక్ వడ్డీ రేటును తగ్గించకపోతే, రుణం మంజూరు చేసిన తర్వాత, అనుకూలమైన వడ్డీ రేట్లను అందించే మరొక బ్యాంక్ కోసం సెర్చ్‌ చేయండి. మీ రుణాన్ని ఆ బ్యాంక్‌ దగ్గర రీఫైనాన్స్ చేయండి. 

లోన్‌లో ఎక్కువ భాగాన్ని వీలైనంత ముందే తిరిగి చెల్లించడం వల్ల కూడా మీ భవిష్యత్ EMIలను తగ్గించవచ్చు. ఇది కాకుండా, వివిధ రకాల EMI కాలిక్యులేటర్‌లను ప్రయత్నించడం వల్ల కూడా మీకు ప్రయోజనం ఉంటుంది.

మరో ఆసక్తికర కథనం: క్రెడిట్‌ కార్డ్‌ ముద్దు, డెబిట్‌ కార్డ్‌ వద్దు - డిసెంబర్‌లో 8 లక్షలు, ఐదేళ్లలో డబుల్‌ 

Published at : 28 Jan 2025 03:53 PM (IST) Tags: Personal Loan Bank Loan EMI Professional Loan Lower EMI Strategy Reduce EMI

ఇవి కూడా చూడండి

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

టాప్ స్టోరీస్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?