By: Arun Kumar Veera | Updated at : 08 Feb 2025 12:54 PM (IST)
మీ క్రెడిట్ రిపోర్ట్‌లో మోసం ఉండొచ్చు ( Image Source : Other )
Fraud In Credit Report Ruins Your Financial Health: ఏదైనా వ్యక్తిగత అవసరం లేదా వ్యాపారం కోసం లోన్ కోసం బ్యాంక్ లేదా ఫైనాన్సింగ్ కంపెనీ దగ్గరకు వెళితే, వాళ్లు మొదట చూసేది మీ క్రెడిట్ రిపోర్ట్‌ను. ఈ క్రెడిట్ రిపోర్ట్ మీ ఆర్థిక ఆరోగ్యాన్ని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఆర్థిక ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, క్రెడిట్ హిస్టరీని మీ ఆర్థిక ఆరోగ్యం పట్ల నిశ్శబ్ద హంతకుడి (Silent Killer)గా పరిగణించవచ్చు.
క్రెడిట్ నివేదిక గురించి మీరు అప్రమత్తంగా ఉంటేనే బ్యాంక్ రుణాలు సులభంగా లభిస్తాయి, మీ కలలు నెరవేరతాయి. మీ వల్ల జరిగిన పొరపాట్లు లేదా ఇతరులు చేసిన తప్పు కారణంగా మీ క్రెడిట్ హిస్టరీలో బ్లాక్ రిమార్క్‌లు కనిపించవచ్చు.
- మీరు తెలిసో & తెలీకో ఏదైనా బ్యాంక్‌కు చెల్లించాల్సిన ఒక్క పైసా చెల్లించకపోయినా అది మీ క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంది, క్రెడిట్ రిపోర్ట్‌లో బ్యాండ్ సెక్టార్ కనిపిస్తుంది.
- ఒక్కోసారి, మీ తప్పు లేకపోయినా, ఇతరులు చేసే పొరపాటు ప్రభావం మీ క్రెడిట్ హిస్టరీ మీద పెద్ద ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు, క్రెడిట్ నివేదికను తయారు చేసే ఏజెన్సీ పొరపాటు లేదా నిర్లక్ష్యం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ దారుణంగా మారవచ్చు.
- ఎవరైనా మీ వ్యక్తిగత పత్రాలను దుర్వినియోగం చేసి రుణం తీసుకుని & ఆ రుణం చెల్లించకుండా ఎగ్గొడితే (డిఫాల్ట్ అయితే) ఆ ప్రభావం మీ క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపిస్తుంది.
- బ్యాంక్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా మాఫీ చేసిన రుణ వడ్డీలో కొంత భాగం మీ పేరు మీద బకాయిగా కనిపించి, మీ క్రెడిట్ నివేదికలో బ్లాక్ స్పాట్ మిగిల్చే అవకాశం ఉంది.
- మీరు ఏదైనా బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయకుండా వదిలేస్తే, కొన్నాళ్ల తర్వాత ఆ ఖాతాకు సంబంధించిన వివిధ ఛార్జీలు మీ పేరిట బకాయిలుగా పేరుకుపోతాయి. అవన్నీ బ్యాడ్ క్రెడిట్ రిపోర్ట్‌ను సృష్టిస్తాయి.
- మీరు రుణం కోసం పదేపదే దరఖాస్తులు చేసినా, పదేపదే క్రెడిట్ స్కోర్ కోసం ఎంక్వైరీ చేసినా అది మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఒక మచ్చగా మారుతుంది.
- మీరు ఏదైనా రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, క్రెడిట్ రిపోర్ట్ సరిగా లేదని బ్యాంకు మీ దరఖాస్తును తిరస్కరించినప్పుడు ఇలాంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. మీరు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించాల్సిన అవసరం అప్పుడు వస్తుంది. బ్యాంక్ లేదా క్రెడిట్ రిపోర్ట్‌ను తయారు చేసే కంపెనీ చేసిన పొరపాటు, నిర్లక్ష్యం లేదా మోసం కారణంగా దాని క్రెడిట్ స్కోర్ తగ్గితే, అది మీకు బాధను మిగిలిస్తుంది. దీనిని సరిదిద్దడానికి మీరు ఫిర్యాదు చేసినప్పటికీ, అప్పటికే సమయం మించిపోతుంది, ఉపయోగం ఉండదు.
మీ క్రెడిట్ రిపోర్ట్ తప్పుగా ఉంటే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
మీ క్రెడిట్ రిపోర్ట్‌లో తప్పులు ఉన్నాయని గుర్తిస్తే, ముందుగా క్రెడిట్ రిపోర్ట్ తయారు చేసిన ఏజెన్సీకి ఆధారాలతో పాటు అభ్యంతర లేఖను పంపండి. బ్యాంకు లేదా ఏదైనా ఫైనాన్స్ కంపెనీ స్థాయిలో పొరపాటు జరిగితే, అక్కడ కూడా మీ ఫిర్యాదును నమోదు చేయండి. ఎక్కడా విచారణ జరగకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ వద్ద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి. ఈ అన్ని చోట్ల మీ ఫిర్యాదుకు న్యాయం జరగకపోతే లేదా ఎవరూ పట్టించుకోకపోతే.. న్యాయస్థానం సాయంతో మీ క్రెడిట్ నివేదికను సరిదిద్దుకోవాలి.
మరో ఆసక్తికర కథనం: స్మార్ట్‌ఫోన్‌లు, ఏసీలకు హై డిమాండ్ - వీటికి, ఆర్‌బీఐ నిర్ణయాలకు సంబంధమేంటి?
Gold-Silver Prices Today 26 Feb: ఊపిరి పీల్చుకోండి, తగ్గిన గోల్డ్-సిల్వర్ రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
ELI Scheme Update: EPFO మెంబర్లకు భారీ శుభవార్త - ఉద్యోగులకు మరో నెల టైమ్ ఇచ్చిన సర్కారు
Stock Market Holiday: మహా శివరాత్రి సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవా, ట్రేడింగ్ జరుగుతుందా?
Gold-Silver Prices Today 25 Feb: హార్ట్ బీట్ పెంచుతున్న గోల్డ్ రేట్ - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
LIC Pension Plan: ఒక్కసారి పెట్టుబడి పెట్టండి, జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని తినండి
Crime News: మహాశివరాత్రి విషాదాలు.. స్నానానికి గోదావరిలో దిగి ఐదుగురు యువకులు గల్లంతు
Pawan Kalyan: కూటమి అంటే ఓ కుటుంబం, ఆయన మాటలు మా అందరికీ ఆదర్శం: వైసీపికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
Mazaka Twitter Review: మజాకా ట్విట్టర్ రివ్యూ: సందీప్ కిషన్, రావు రమేష్ కామెడీతో అదరగొట్టేశారుగా.. మరి హిట్టేనా.. నెటిజన్లు ఏమంటున్నారంటే.?
Maha Shivaratri Wishes : మహా శివరాత్రి శుభాకాంక్షలు.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఈ ఫోటోలు షేర్ చేసి, ఈ మెసేజ్‌లతో విషెష్ చెప్పేయండి