By: ABP Desam | Updated at : 18 Dec 2023 10:00 AM (IST)
సావరిన్ గోల్డ్ బాండ్ సబ్‌స్కిప్షన్ ప్రారంభం
Sovereign Gold Bonds Subscription: బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మహత్తర అవకాశం ఈ రోజు (సోమవారం, 18 డిసెంబర్ 2023) నుంచి ప్రారంభమైంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్‌లో థర్డ్ ఇష్యూ (Sovereign Gold Bonds 2023-24 Series III) కోసం ఈ రోజు నుంచి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. కేవలం ఐదు రోజులే (శుక్రవారం, 22 డిసెంబర్ 2023 వరకు) ఈ ఆఫర్ ఓపెన్‌లో ఉంటుంది.
ఒక్కో సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇష్యూ ధరను రూ.6199 (SGB Issue Price) గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. ఒక బాండ్ ఒక గ్రాము బంగారానికి సమానం. అంటే, మీరు ఎన్ని బాండ్లు కొంటే అన్ని గ్రాముల బంగారం కొన్నట్లు లెక్క.
సావరిన్ గోల్డ్ బాండ్‌పై డిస్కౌంట్ (Discount on Sovereign Gold Bond)
గోల్డ్ బాండ్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. డిజిటల్ పేమెంట్ చేసే వారికి, రూ.50 తగ్గింపుతో ఒక్కో బాండ్ రూ.6,149 కే లభిస్తుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ జారీ చేసిన మూడో ఇష్యూ ఇది. I, II సిరీస్‌లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఫస్ట్ సిరీస్‌లో 7.77 టన్నుల బంగారానికి సమానమైన బాండ్లు అమ్ముడుపోయాయి. సెకండ్ సిరీస్‌లో, 11.67 టన్నుల బంగారానికి సమానమైన బాండ్స్‌ను ఇన్వెస్టర్లు కొన్నారు.
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి? (What is Sovereign Gold Bond Scheme?)
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు. సావరిన్ గోల్డ్ బాండ్ అనేది డిజిటల్ బంగారం. భౌతికంగా కనిపించదు. కేంద్ర ప్రభుత్వం తరపున RBI వీటిని జారీ చేస్తుంది.
సావరిన్ గోల్డ్ బాండ్ల వల్ల ఏంటి లాభం? (What are the benefit of sovereign gold bonds?)
సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడికి భద్రతతో పాటు, రాబడికి కూడా గ్యారెంటీ ఉంటుంది. బంగారం ధర పెరుగుతున్న కొద్దీ పెట్టుబడి విలువ పెరుగుతుంది. దీంతోపాటు, SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్ రేటుతో (SGB Coupon Rate) వడ్డీ చెల్లిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. వీటిని తనఖా పెట్టి లోన్ కూడా పొందొచ్చు. భౌతిక బంగారం కొనుగోలులో వర్తించే మేకింగ్, జీఎస్టీ వంటి అదనపు భారం గోల్డ్ బాండ్లకు ఉండవు.
సావరిన్ గోల్డ్ బాండ్లను ఎలా కొనాలి? (How to buy Sovereign Gold Bonds?)
సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం చాలా ఈజీ. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL), క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCIL), గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలు పొందొచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? (Who can apply?)
భారతదేశ పౌరులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక గార్డియన్ లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనొచ్చు.
ఎంత బంగారం కొనవచ్చు? (How much gold can you buy?)
ఈ స్కీమ్ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని (1 బాండ్) కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals), HUFలు (Hindu Undivided Family) కొనొచ్చు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలు గరిష్టంగా 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు.
ఆదాయ పన్ను ప్రయోజనం (Income tax benefit)
బాండ్ మెచ్యూరిటీ టైమ్ ఎనిమిదేళ్లు ఉంటుంది. మెచ్యూరిటీ వరకు బాండ్‌ని కంటిన్యూ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో వచ్చే వడ్డీ ఆదాయంపై ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. బాండ్ హోల్డర్ కోరుకుంటే, 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు. ఆ రోజున ఉన్న రేటుకు బాండ్లను సరెండర్ చేయవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్ స్కీమ్ స్టార్టెడ్
New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!
Gold-Silver Prices Today 26 Dec: ఈ రోజు 24K, 22K గోల్డ్ రేట్లలో మార్పులు - తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?