By: Arun Kumar Veera | Updated at : 05 May 2024 10:56 AM (IST)
ఏడాది తిరక్కుండానే ఎక్కువ వడ్డీ ఆదాయం
Highest Interest Rates On Short-term FDs: మన దేశంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే పెట్టుబడి ఎంపికల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. ఇవి, పెట్టుబడిదార్లకు అనుకూలంగా ఉంటాయి, ముందుగా నిర్ణయించిన వడ్డీ ఆదాయాన్ని (స్థిరమైన రాబడి) అందిస్తాయి. అన్ని బ్యాంక్‌లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు, వివిధ మెచ్యూరిటీ టైమ్ పిరియడ్స్‌లో ఎఫ్‌డీ స్కీమ్స్ అందిస్తున్నాయి. దీనివల్ల, అవసరానికి తగ్గట్లుగా స్వల్పకాలం కోసం లేదా దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టే వెసులుబాటు అందుబాటులో ఉంది.
సాధారణంగా, 7 రోజుల నుంచి 12 నెలల మెచ్యూరిటీతో ఉంటే డిపాజిట్లను స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా (Short-term fixed deposits) పిలుస్తారు. 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల కాలానికి చేసే డిపాజిట్లను దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా (Long-term fixed deposits) లెక్కిస్తారు. పెట్టుబడిదార్లు స్వల్పకాలిక ఎఫ్‌డీ కంటే దీర్ఘకాలిక ఎఫ్‌డీ నుంచి ఎక్కువ వడ్డీ ఆదాయం సంపాదించొచ్చు. కాల వ్యవధిని బట్టి, బ్యాంక్‌ను బట్టి FD పథకాలపై వడ్డీ రేట్లు మారుతుంటాయి.
స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంక్‌ల్లో వడ్డీ రేట్లు
వివిధ బ్యాంక్‌ల వెబ్‌సైట్లలో ఉన్న సమాచారం ప్రకారం, ఒక సంవత్సరం కంటే మెచ్యూరిటీ పిరియడ్‌తో చేసే ఎఫ్‌డీ (స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్) మీద 8.50% వరకు వడ్డీ ఆదాయం సంపాదించొచ్చు.
- యెస్ బ్యాంక్ (Yes Bank): సాధారణ కస్టమర్లకు (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఖాతాదార్లు) 7 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద 3.25% నుంచి 7.25% వరకు వడ్డీ రేటును ప్రకటించింది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం కాల పరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం 3% మరియు 7% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది.
- కెనరా బ్యాంక్ (Canara Bank): సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు టెన్యూర్ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 4% నుంచి 6.85% వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేసింది.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank): సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు మెచ్యూరిటీ ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3% నుంచి 6% వరకు వడ్డీని జమ చేస్తుంది.
- ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank): సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం కాల పరిమితి FDపై 3% నుంచి 6% మధ్య వడ్డీ ఆదాయాన్ని చెల్లిస్తుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు నిబంధనలతో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (FDలు) 3% మరియు 5.75% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది.
బ్యాంక్‌ల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు వేరు. రెగ్యులర్ బ్యాంక్‌ల కంటే ఇవి ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. అయితే, ఇవి పూర్తి స్థాయి బ్యాంక్‌లు కావు.
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సాధారణ కస్టమర్లు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు టైమ్ పిరియడ్ ఎఫ్‌డీలపై 3% నుంచి 8.50% వరకు వడ్డీ ఆదాయం అందుకోవచ్చు.
- యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు టెన్యూర్‌తో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.50% నుంచి 7.85% మధ్య వడ్డీ రేట్లను బ్యాంక్ అందిస్తోంది.
- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు కాల పరిమితి FDలపై 4% నుంచి 6.85% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఎఫ్‌డీ మీద ఎక్కువ వడ్డీ కావాలా?, టాప్ లిస్ట్‌లో 8 బ్యాంకులు
UIDAI New Guidelines: పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్పై UIDAI సరికొత్త మార్గదర్శకాలు-పాఠశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు!
Financial Planning: ఈ స్టెప్స్ ఫాలో అయితే కోటీశ్వరులు కాకపోయినా అప్పులు లేకుండా రాజులా బతికేస్తారు!
Zero GST On insurance:హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ లేనట్టే- కేంద్రం కొత్త ప్రతిపాదన
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: మొఘల్ పాలనకు ఎదురు నిలిచిన వీరుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి!
Post Office Aditya Birla Insurance: ఉచిత బస్సు ప్రయాణం డబ్బుతో ₹15 లక్షల బీమా! పోస్టల్ శాఖ అదిరిపోయే ఆఫర్, వెంటనే చూడండి!
కవిత కొత్త పార్టీ: కేసీఆర్ బాటలో నడుస్తూ సామాజిక తెలంగాణ సాధిస్తారా? సంచలన రాజీనామా వెనుక అసలు కథేంటి?
Nagarkurnool Kids Murder: చావాలంటే చనిపోవచ్చు..పిల్లల్ని కూడా చంపాలా? - ఈ తండ్రి చేసిన పని తెలిస్తే గుండె పగిలిపోతుంది!
Lokesh To Delhi: శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?
Man shoots wife: బిజీ మార్కెట్లో భార్యను కాల్చి చంపేశాడు - కానీ పారిపోలేదు అక్కడే ఉన్నాడు - ఏం చేశాడంటే ?
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy