By: Arun Kumar Veera | Updated at : 07 Feb 2024 01:44 PM (IST)
రెండేళ్లలో గట్టిగా డబ్బులు సంపాదించే మార్గం ఇది
SBI Sarvottam FD Scheme Details In Telugu: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వివిధ టెన్యూర్స్ కోసం చాలా రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను (SBI Fixed Deposit Schemes) ఆఫర్ చేస్తోంది. వాటిలో కొన్ని స్కీమ్స్‌ను (SBI Special FD Schemes) ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఆ డిపాజిట్ల కాల గడువు (మెచ్యూరిటీ టైమ్/ టెన్యూర్), వాటిపై బ్యాంక్ చెల్లించే వడ్డీ రేటు సంప్రదాయ పథకాల కంటే భిన్నంగా ఉంటుంది. అలాంటి ప్రత్యేక పథకాల్లో ఒకటి సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్.
ఎస్‌బీఐ సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం వివరాలు:
నాన్-కాలబుల్ డిపాజిట్ స్కీమ్ (Non-Callable Fixed Deposit Scheme)
సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఒక నాన్-కాలబుల్ డిపాజిట్ స్కీమ్. అంటే కాల పరిమితి లేదా మెచ్యూరిటీ గడువు ముగియడానికి ముందే ఈ అకౌంట్‌ను బ్రేక్ చేయడం, లేదా డబ్బును వెనక్కు తీసుకోవడానికి అనుమతి ఉండదు.
ఎంత డిపాజిట్ చేయవచ్చు? (How much can be deposited in SBI Sarvotham Scheme?)
ఎస్‌బీఐ సర్వోత్తమ్ స్కీమ్‌లో కనిష్టంగా రూ. 1 కోటి రూపాయలు (sbi sarvottam fd minimum deposit limit) పెట్టుబడి పెట్టాలి. గతంలో ఈ కనిష్ట పరిమితి రూ. 15 లక్షలుగా ఉంది. ఈ స్కీమ్‌లో గరిష్ట డిపాజిట్ పరిమితి (sbi sarvottam fd maximum deposit limit) లేదు.
ఎంత వడ్డీ వస్తుంది? (SBI Sarvotham Scheme Interest Rate)
7.10 శాతం నుంచి 7.90 శాతం వరకు వడ్డీ రేటును స్టేట్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
స్టేట్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. ఎస్‌బీఐ సర్వోత్తమ్ టర్మ్ ప్లాన్‌లో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాల గడువుతో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. ఇందులోనూ రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల డిపాజిట్ మొత్తానికి ఒక ప్లాన్; రూ.2 కోట్లు దాటిన మొత్తానికి మరొక ప్లాన్ ఉంటుంది.
రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల లోపున్న డిపాజిట్లపై వడ్డీ రేటు:
ఏడాది కాల పరిమితితో డిపాజిట్ చేసే సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వాళ్లకు) బ్యాంక్ 7.10 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. రెండేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇదే కాలానికి సీనియర్ సిటిజన్స్‌కు (60 ఏళ్లు లేదా ఆ వయస్సు దాటిన వాళ్లు) మరో 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే.. ఏడాది కాల వ్యవధి సర్వోత్తమ్ స్కీమ్ డిపాజిట్‌లో సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ వస్తుంది. రెండేళ్ల డిపాజిట్లపై 7.90% వడ్డీ రేటును పొందుతారు. ఇది 8.14% వార్షిక రాబడికి మారుతుంది.
రూ.2 కోట్లు దాటిన డిపాజిట్లపై వడ్డీ రేటు:
రూ.2 కోట్లు దాటిన డిపాజిట్లపై, ఒక సంవత్సరం కాల వ్యవధికి, సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు 7.05 శాతం. ఇదే డిపాజిట్‌పై రెండేళ్లకు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటు 6.90 శాతం. సీనియర్ సిటిజన్లు ఒక సంవత్సరం కోసం డిపాజిట్ చేస్తే 7.55 శాతం వడ్డీ ఆదాయం వస్తుంది. రెండేళ్ల కోసం డిపాజిట్ చేస్తే 7.40 శాతం వడ్డీ పొందొచ్చు, ఇది 7.61% వార్షిక రాబడికి మారుతుంది.
గతేడాది (2023) ఫిబ్రవరి 17 నుంచి ఈ వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.
SBI సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు అర్హులు? (Who is eligible to invest in SBI Sarvotham Fixed Deposit Scheme?)
SBI సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇండివిడ్యువల్స్, నాన్-ఇండివిడ్యువల్స్ పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్లు, NRIలు అనర్హులు.
ఎస్‌బీఐ సర్వోత్తమ్ స్కీమ్‌లో కాల గడువు ముగిసిన తర్వాత ఆ డిపాజిట్లను రెన్యువల్ చేయించుకోవడానికి వీలుండదు. ఆ డిపాజిట్ మెచ్యూరిటీ పిరియడ్ పూర్తి కాగానే వడ్డీతో కలిపి ఆ మొత్తం పెట్టుబడిదారు ఖాతాలో జమవుతుంది. మీకు ఆ స్కీమ్ మళ్లీ కావాలంటే, ఫ్రెష్‌గా మళ్లీ డిపాజిట్ చేయాలి.
మరో ఆసక్తికర కథనం: నిర్మలా సీతారామన్‌ని కలిసిన పేటీఎమ్ సీఈవో,ఆంక్షలు ఎత్తివేస్తారా?
Saving Ideas: రూల్ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్ ఛేంజర్' ఇది
Blue Aadhaar Card: బ్లూ కలర్ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్ చేసుకోండి
Gold Vs Diamond: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
Gold-Silver Prices Today 02 Nov: పండుగ తర్వాత పసిడి రేట్ల పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Holidays: ఈ నెలలో బ్యాంక్‌లు 12 రోజులు సెలవుల్లోనే ఉంటాయి, మీకేదైనా ముఖ్యమైన పని ఉందా?
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Nayani Pavani: బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!