By: ABP Desam | Updated at : 05 Dec 2023 12:35 PM (IST)
ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్ ఆఫర్, ఈ నెలాఖరు వరకే లక్కీ ఛాన్స్!
SBI Amrit Kalash Scheme Details in Telugu: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), తన కస్టమర్ల కోసం ప్రకటించిన ఒక స్పెషల్ ఆఫర్ అతి త్వరలో ముగుస్తుంది. స్టేట్ బ్యాంక్ ఇస్తున్న ఆఫర్ పేరు 'అమృత్ కలశ్' (SBI Amrit Kalash Scheme). ఇది ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. మీ దగ్గర కొంత డబ్బు ఉండి, షార్ట్ టర్మ్‌లో మంచి ఆదాయం సంపాదించాలని ప్లాన్ చేస్తుంటే ఇదొక గుడ్ ఆప్షన్.
అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం గడువును (SBI Amrit Kalash Scheme Dead Line / Last date) స్టేట్ బ్యాంక్ చాలా సార్లు పెంచింది. ఈ స్కీమ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆఖరు తేదీని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా, డెడ్‌లైన్‌ను డిసెంబర్ 31, 2023గా ఫిక్స్ చేసింది. ఎస్‌బీఐ, పథకం చివరి తేదీని మరోమారు పెంచుతుందో, లేదో ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం వివరాలు (SBI Amrit Kalash Scheme Details):
అమృత్ కలశ్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ (SBI Amrit Kalash Scheme Interest Rate 2023)
SBI అమృత్ కలశ్ పథకం టైమ్ పిరియడ్ 400 రోజులు. ఈ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు ఏటా 7.6% వడ్డీ రేటు అందుతుంది. సాధారణ పౌరులకు ఏడాదికి 7.1% వడ్డీ రేటును బ్యాంక్ ఇస్తుంది. ఎస్‌బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా ఒక శాతం (1%) వడ్డీ రేటు స్టేట్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
అమృత్ కలశ్ వడ్డీ రేటు గురించి ఇంకా సింపుల్‌గా తెలుసుకుందాం. ఈ పథకంలో ఒక సీనియర్ సిటిజన్ ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, 7.6% వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు అతనికి రూ.43,000 వడ్డీ వస్తుంది. ఇదే మొత్తానికి ఒక సాధారణ పౌరుడికి లభించే వడ్డీ మొత్తం 40,085 రూపాయలు.
అమృత్ కలశ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? (How to apply for SBI Amrit Kalash Scheme?)
మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లేంత సమయం మీకు లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.
అమృత్ కలశ్ స్కీమ్‌పై బ్యాంక్ లోన్ (Bank loan on SBI Amrit Kalash Scheme)
ఈ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే సదుపాయం ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.
అమృత్ కలశ్ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై ఆదాయ పన్ను (Income Tax) నిబంధనల ప్రకారం TDS కట్ అవుతుంది. ఇలా కట్ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా డిపాజిట్ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది
PPF vs FD : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?
పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
Ishan Kishan Viral Video: టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా