By: ABP Desam | Updated at : 18 Dec 2023 03:17 PM (IST)
ఈ సంవత్సరం ఇళ్ల అమ్మకాలు అ'ధర'హో
Year Ender 2023 Housing Sales: 2023 క్యాలెండర్ ఇయర్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. డిసెంబర్‌లో ఇప్పటికే సగం నెలను దాటేశాం. ఈ సంవత్సరం ఆయుష్షు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది, ఆ తర్వాత కొత్త సంవత్సరం 2024 (Happy New year 2024) ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో గృహ నిర్మాణ రంగం (Housing sector) ఎలా గడిచింది, కొత్త సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంటుంది?.
గతేడాది కంటే ఇది చాలా ఎక్కువ అమ్మకాలు
ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ (Real estate), ముఖ్యంగా హౌసింగ్ సెక్టార్ బ్రహ్మాండంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం గృహ రుణ వడ్డీ రేట్లు (Home loan interest rates) అధిక స్థాయిలోనే ఉన్నప్పటికీ, కొత్త ఇళ్ల కొనుగోళ్ల డిమాండ్ కూడా బలంగానే ఉంది. 2023లో గృహ విక్రయాల తుది సంఖ్య గత సంవత్సరం (2022) కంటే దాదాపు 40 శాతం ఎక్కువగా ఉండొచ్చని అనరాక్ (Anarak) రిలీజ్ చేసిన తాజా రిపోర్ట్ సూచిస్తోంది.
అనరాక్ రిపోర్ట్ ప్రకారం, 2023 మొదటి 9 నెలల్లో (జనవరి-సెప్టెంబర్) దేశంలోని టాప్-7 నగరాల్లో రూ.3.49 లక్షల కోట్ల విలువైన ఇళ్లు చేతులు మారాయి. 2023 మొదటి 9 నెలల లెక్క, మొత్తం 2022 అమ్మకాలను (రూ.3.27 లక్షల కోట్లు) దాటేసింది. ఇదే స్పీడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఏడాది చివరి మూడు నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) కనీసం రూ.లక్ష కోట్ల విలువైన ఇళ్లు (housing sales) అమ్ముడుపోతాయి. ఈ విధంగా మొత్తం సంవత్సరానికి ఈ సంఖ్య రూ.4.5 లక్షల కోట్లకు చేరుతుంది. గతేడాదితో పోలిస్తే 2023లో గృహ విక్రయాల్లో 37.61 శాతం వృద్ధి ఉంటుందని అంచనా.
రిజర్వ్ బ్యాంక్ (RBI), గత ఏడాది మే నుంచి రెపో రేట్‌ను (Repo rate) పెంచడం ప్రారంభించింది, ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు ఈ పెంపు కొనసాగింది. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు, రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును మొత్తం 2.50 శాతం పెంచింది. దీంతో, రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. ఈ నెలలో మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం జరిగింది, ఈసారి కూడా రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగానే కొనసాగించింది. ప్రస్తుతం రెపో రేటు అధిక స్థాయిలో ఉంది, గృహ రుణాలు ఖరీదైనవిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ప్రభావం ఇళ్ల విక్రయాలపై పడలేదు.
ఈ ఏడాది ఖరీదైన ఇళ్ల అమ్మకాలు ఎక్కువ
ఈ ఏడాది ఇళ్ల రేట్లు పెరిగాయి కాబట్టి, విలువ పరంగా, గతేడాది కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. అయితే, సంఖ్య పరంగా చూస్తే మాత్రం ఇంటి అమ్మకాల్లో పెరుగుదల కొంత తక్కువగానే కనిపిస్తుంది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో, టాప్-7 సిటీస్‌లో 3.49 లక్షలకు పైగా హౌసింగ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది 3.65 లక్షల ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9 నెలల్లో విక్రయాల సంఖ్య తక్కువగా ఉన్నా విలువ ఎక్కువగా ఉండడానికి కారణం టాప్ ఎండ్ మోడల్స్. అంటే, 2023లో విలాసవంతమైన ఇళ్లు (Luxury homes) ఎక్కువగా అమ్ముడుపోయాయి.
కొత్త ఏడాదిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా
ఇళ్ల అమ్మకాల్లో వచ్చే ఏడాది (2024) కూడా ఇదే స్పీడ్ కొనసాగుతుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు తగ్గడం ప్రారంభమవుతుందని మార్కెట్ గట్టిగా నమ్ముతోంది. రెపో రేటు తగ్గితే గృహ రుణాలు చౌకగా మారతాయి. సొంత ఇళ్లకు డిమాండ్ ఇంకా పెరుగుతుంది.
CBRE నివేదిక ప్రకారం, హై-టికెట్ వాల్యూ ఇళ్ల అమ్మకాలు 2024లో బలంగా ఉంటాయి. రూ.45 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పలికే ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: మీ ఆదాయం రూ.7.27 లక్షలు దాటకుంటే ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు
Gold-Silver Prices Today 22 Dec: గోల్డ్ షోరూమ్‌కు వెళ్లే ముందు రేట్లు తెలుసుకోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Housing Loan: హోమ్ లోన్ మీరు తీసుకోండి, గ్యారెంటీ గవర్నమెంట్ ఇస్తుంది - ఆస్తి పేపర్ల తనఖా అక్కర్లేదు!
Fixed Deposit Rates: ఈ నెలలో ఎఫ్‌డీ రేట్లను సవరించిన 5 బ్యాంకులు - ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్ కూడా ఉండొచ్చు!
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
Gold-Silver Prices Today 21 Dec: ఒక్కరోజులో రూ.6,500 పెరిగిన గోల్డ్ - ఏపీ, తెలంగాణలో రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్!
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!