By: ABP Desam | Updated at : 20 Dec 2022 06:17 PM (IST)
Edited By: Ramakrishna Paladi
పీపీఎఫ్ వడ్డీరేటు (Pixabay)
PPF Interest Rate 2023:
పది రోజుల్లో 2022 ముగుస్తుంది. ఎన్నో ఆశలతో సరికొత్త ఏడాదిలోకి అడుగుపెడతాం. ఆరోగ్యం నుంచి ఆనందం వరకు అన్నీ ఎక్కువే ఉండాలని ఆశిస్తాం. అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా దక్కాలని కోరుకుంటాం. అలాంటి వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. ఆర్బీఐ విధాన రేట్లు పెంచుతున్న తరుణంలో పీపీఎఫ్‌పై ఎక్కువ వడ్డీ పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో 2023లో పీపీఎఫ్ వడ్డీరేటు ఎలా ఉండబోతోంది? వాటి ప్రయోజనాలేంటో చూద్దాం!
2022లో వడ్డీ ఎంత?
ప్రస్తుతం పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయకపోతే 2023 తొలి త్రైమాసికంలోనూ ఇదే రేటు వర్తిస్తుంది. ద్రవ్యోల్బణం, రెపో రేట్ల పెంపుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు పెరిగాయి. చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పీపీఎఫ్ కన్నా ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆ మేరకు పీపీఎఫ్ వడ్డీరేటునూ సవరించాలని ప్రజలు ఆశిస్తున్నారు.
ఎప్పుడు సవరిస్తారు?
కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు పీపీఎఫ్ వడ్డీరేట్లను సవరిస్తుంది. 2022-23 ఏడాదిలో వచ్చే త్రైమాసికం వడ్డీరేటును డిసెంబర్లో నిర్ణయిస్తారు. 2018 నుంచి 2019 వరకు 8 శాతం వడ్డీ ఇచ్చేవాళ్లు. 2020లో దానిని 7.9 శాతానికి తగ్గించేశారు. 2020 నుంచి ఇప్పటి వరకు 7.1 శాతంగానే ఉంది. ఈ పది రోజుల్లోపు ప్రభుత్వం ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకోకపోతుందా అని చందాదారులు ఎదురు చూస్తున్నారు.
పీపీఎఫ్ ప్రయోజనాలు
కచ్చితమైన రాబడి: పీపీఎఫ్ డిపాజిట్లు అత్యంత సురక్షితమైనవి. కచ్చితమైన రాబడి అందిస్తాయి. బ్యాంకు లేదా పోస్టాఫీసు విఫలమైనా మీ డిపాజిట్లకు డోకా ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కచ్చితమైన వడ్డీ అందుతుంది. పైగా కాంపౌండింగ్ ఎఫెక్ట్‌తో ఆఖర్లో భారీ మొత్తం చేతికందుతుంది.
పన్ను ప్రయోజనాలు: పీపీఎఫ్‌లో డిపాజిట్ చేసిన డబ్బు, వడ్డీ, వెనక్కి తీసుకున్న మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏటా రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఎక్కువ వడ్డీ: సాధారణంగా పీపీఎఫ్ డిపాజిట్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీరేటు లభిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వస్తోంది. ఇప్పుడంటే విధాన రేట్ల పెంపుతో ఎఫ్‌డీలు ఆసక్తికరంగా మారాయి కానీ పీపీఎఫ్ ఎప్పటికీ ఎవర్‌గ్రీనే!
రుణ సదుపాయం: పీపీఎఫ్ రుణాలపై వడ్డీ స్వల్పంగానే ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన వడ్డీరేటు కన్నా ఒక శాతం మాత్రమే అధికంగా వసూలు చేస్తారు. ఉదాహరణకు పీపీఎఫ్‌పై ప్రభుత్వం 7.1 శాతం వడ్డీరేటు అమలు చేస్తోంది. దానిపై ఒక శాతం అధికంగా అంటే 8.1 శాతం వరకు తీసుకున్న రుణంపై వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి వడ్డీరేటు నిర్ణయించారంటే చెల్లింపు పూర్తయ్యేంత వరకు అదే ఉంటుంది.
Also Read: పదేళ్లలో పీపీఎఫ్ వడ్డీరేటు కనిపించకుండా కట్ చేసిన కేంద్రం! ఎంతో తెలిస్తే షాకే!
Gold Investment: స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు
Aadhaar Card: మీ ఆధార్ కార్డు పోయిందా?, ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా డూప్లికేట్ ఆధార్ కార్డ్ పొందొచ్చు
LIC Kanyadan Policy: మీ కుమార్తె భవిష్యత్ కోసం ఒక తెలివైన నిర్ణయం - దాదాపు రూ.23 లక్షలు లబ్ధి!
Gold-Silver Prices Today 16 Feb: ఓ మెట్టు దిగి వచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Inactive Credit Card: క్రెడిట్ కార్డ్‌ను పక్కన పడేశారా? - మీ క్రెడిట్ స్కోర్ మీ చేతులారా పాడు చేసుకుంటున్నట్లే!
Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్