search
×

NPS: రిటైర్మెంట్‌ టెన్షన్‌కు చెక్‌ - రోజుకు ₹100 పక్కన పెట్టి ప్రతి నెలా ₹57,000 తీసుకోండి

ఇంటి బడ్జెట్‌ మీద భారం పడకుండా చిన్న మొత్తంతో పెట్టుబడి స్టార్ట్‌ చేయవచ్చు.

FOLLOW US: 
Share:

National Pension System: రిటైర్మెంట్‌ జీవితం, ఆర్థిక భద్రత గురించి ముందు నుంచే ప్లాన్‌ చేసుకోకపోతే, ఉద్యోగ విరమణ తర్వాతీ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ఒక మంచి ప్లాన్‌. దీనివల్ల, ఉద్యోగం జీవితం ముగిసిన తర్వాత కూడా పెన్షన్‌ రూపంలో డబ్బులు వస్తూనే ఉంటాయి, మీ అవసరాలన్నీ తీరతాయి. రిటైర్డ్‌ పర్సన్స్‌కు డబ్బు కొరత రానివ్వని చాలా అనేక పింఛను పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వాటిలో ఒకటి... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ఈ స్కీమ్‌లో చేరే ఏ వ్యక్తయినా, ఇంటి బడ్జెట్‌ మీద భారం పడకుండా చిన్న మొత్తంతో పెట్టుబడి స్టార్ట్‌ చేయవచ్చు.

పదవీ విరమణ తర్వాత, మీ పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి మొత్తం పొందే ఆప్షన్‌తో పాటు, ప్రతి నెలా పెన్షన్ బెనిఫిట్‌ కూడా లభిస్తుంది. NPS వెబ్‌సైట్ ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించవచ్చు. రాబడి, ఇతర ప్రయోజనాల గురించి ఆ సైట్‌ ద్వారా మరింత సులభంగా అర్థం చేసుకోవచ్చు. NPS కాలిక్యులేటర్ కూడా సైట్‌లో ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్‌ చేస్తే, ఎంత చేతికి వస్తుందన్న విషయాలను ఆ కాలిక్యులేటర్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద, చాలా తక్కువ డబ్బును ఇన్వెస్ట్‌ చేసి ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. రోజుకు కేవలం రూ. 100 ఆదా చేసి, నెలకు రూ. 57,000 పెన్షన్ తీసుకోవచ్చు. 

25 సంవత్సరాల వయస్సులో నెలకు ₹1500 చొప్పున పెట్టుబడి     
మీ 25 సంవత్సరాల వయస్సులో, NPSలో, నెలకు రూ. 1500 (రోజుకు రూ. 50) పెట్టుబడి పెట్టడం స్టార్ట్‌ చేస్తే, 60 ఏళ్ల వయస్సులో మొత్తం కార్పస్ రూ. 57,42,416 అవుతుంది. వార్షిక వడ్డీ 10 శాతం చొప్పున ఈ లెక్క వస్తుంది. మీరు 75 సంవత్సరాల వయస్సు వరకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం నుంచి నిష్క్రమించే సమయంలో, పెట్టుబడిదారు 100 శాతం వరకు కార్పస్‌తో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

మీ అకౌంట్‌లో పోగయిన మొత్తం డబ్బుతో 100% యాన్యుటీ ప్లాన్‌ కొంటే, నెలకు రూ. 28,712 పెన్షన్ తీసుకోవచ్చు. 40% యాన్యుటీ కొనుగోలు చేస్తే, నెలవారీ పెన్షన్ రూ. 11,485 అవుతుంది. ఇంకా మీ అకౌంట్‌లో రూ. 34 లక్షలు ఉంటాయి, వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు.

రోజుకు ₹100తో ఎంత పెన్షన్‌ వస్తుంది?       
మీరు 25 సంవత్సరాల వయస్సు నుంచి ప్రతి నెలా 3000 రూపాయలు ‍(రోజుకు 100 రూపాయలు) పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, NPS కాలిక్యులేటర్ ప్రకారం, 60 తర్వాత రూ. 1,14,84,831 జమ అవుతుంది. ఈ మొత్తంతో 100% యాన్యుటీ కొనుగోలు చేస్తే, మొత్తం నెలవారీ పెన్షన్ రూ. 57,412 వస్తుంది. 40% యాన్యుటీని కొనుగోలు చేస్తే నెలకు రూ. 22,970 పెన్షన్‌ రూపంలో వస్తుంది. అయితే, పదవీ విరమణ తర్వాత ఏకమొత్తంగా రూ. 68 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

మరో ఆసక్తికర కథనం: షార్ట్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్‌ ఆప్షన్‌ ఈ స్కీమ్‌, మీ పెట్టుబడికి గవర్నమెంట్‌ గ్యారెంటీ 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

Published at : 24 Jul 2023 11:41 AM (IST) Tags: National Pension System NPS Investment Post office monthly pesion

ఇవి కూడా చూడండి

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

టాప్ స్టోరీస్

Husband Seek Divorce : LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

Husband Seek Divorce : LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు

Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన

MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!

MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు  బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!