search
×

NPS Charges: బ్రేకింగ్ న్యూస్‌ - NPS, NPS లైట్, NPS వాత్సల్య ఛార్జీల్లో మార్పులు

NPS New Charges: నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) కింద ఖాతాను ప్రారంభించేందుకు ఛార్జీలు మారాయి. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ రెండింటిలోనూ ఈ రుసుములు మారాయి.

FOLLOW US: 
Share:

PFRDA Announced New Charges For NPS: 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) ఖాతాను ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ రెండింటిలోనూ తెరవడానికి ఛార్జీలను సవరించింది. కొత్త ఛార్జీలు ఎన్‌పీఎస్‌ (అందరు పౌరులు & కార్పొరేట్లు) & ఎన్‌పీఎస్‌ లైట్‌ మోడళ్లకు వర్తిస్తాయి. ఎన్‌పీఎస్‌ వాత్సల్య (NPS Vatsalya) ఖాతాను తెరవడానికి, NPS-ఆల్ సిటిజన్ మోడల్‌కు ఉన్న ఛార్జీలే వర్తిస్తాయి. ఈ కొత్త ఛార్జీలన్నీ జనవరి 31, 2025 నుంచి అమలులోకి వస్తాయి. 

కేంద్ర బడ్జెట్‌లో బహుమతి
2025 ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్‌ (Budget 2025) సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), ఎన్‌పీఎస్ వాత్సల్య యోజనలో పెట్టుబడిదారులకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 CCD(1B) కింద రూ. 50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు లభిస్తుందని ప్రతిపాదించారు. NPSలో క్రమం తప్పకుండా మదుపు చేసే చందాదార్లు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. 

మంగళవారం (ఫిబ్రవరి 4, 2025) నాడు PFRDA జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, NPS-వాత్సల్య ఖాతా సేవలపై విధించే ఛార్జీ NPS-ఆల్ సిటిజన్ మోడల్ కింద విధించే ఛార్జీకి సమానంగా ఉంటుంది. 

NPS ఖాతా తెరవడానికి ఛార్జీలు
రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే రూ. 400 వరకు రుసుము వసూలు చేస్తారు. గతంలో చేసిన సహకారం (NPS Contribution)పై 0.50 శాతం ఛార్జీ విధిస్తారు, దీని గరిష్ట పరిమితి రూ. 25,000. తర్వాత, అన్ని సహకారాలపై కూడా ఛార్జీలు విధిస్తారు.

ఆర్థికేతర లావాదేవీలు
ఆర్థికేతర లావాదేవీలకు రూ. 30 వరకు రుసుము ఉంటుంది. NPS ఆల్ సిటిజన్ మోడల్‌పై వర్తించే 'పెర్సిస్టెన్సీ ఛార్జ్' వార్షిక సహకారాన్ని బట్టి మారుతుంది. వార్షిక సహకారం రూ. 1,000 & రూ. 2,999 మధ్య ఉంటే, ప్రతి సంవత్సరం దానిపై రూ. 50 వరకు ఛార్జీ ఉంటుంది. రూ.3,000 నుంచి రూ. 6,000 మధ్య వార్షిక సహకారానికి రూ. 75 వసూలు చేస్తారు. రూ. 6,000 కంటే ఎక్కువ సహకారానికి గరిష్టంగా రూ. 100 ఛార్జీ తీసుకుంటారు. ఈ ఛార్జీలను యూనిట్ల రద్దు ద్వారా కట్‌ అవుతాయి.

ఈ-ఎన్‌పీఎస్ లావాదేవీలు
ఈ-ఎన్‌పీఎస్ లావాదేవీలపై, కాంట్రిబ్యూషన్‌లో 0.20 శాతం వరకు ఛార్జీ వర్తిస్తుంది. దీని గరిష్ట పరిమితి రూ. 10,000. ఈ ఛార్జీ ముందస్తుగా విధిస్తారు. NPS ఆల్ సిటిజన్, టైర్-II ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. 

డి-రెమిట్ కాంట్రిబ్యూషన్‌ 
డి-రెమిట్ కాంట్రిబ్యూషన్‌లకు 0.20 శాతం వరకు 'ట్రైల్ కమిషన్' కూడా విధిస్తారు, ఇది గరిష్టంగా రూ. 10,000 వరకు ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు యూనిట్ల ద్వారా కట్‌ చేస్తారు.

ప్రాసెసింగ్ ఎగ్జిట్‌ విధానం
ఉపసంహరణను ప్రాసెస్ చేయడానికి, మొత్తం డబ్బులో 0.125 శాతం వరకు రుసుము వర్తిస్తుంది, దీని గరిష్ట పరిమితి రూ. 400. దీనిని కూడా ముందుగానే తీసుకుంటారు.

స్టెబిలిటీ ఫీజ్‌
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలకు పైగా కస్టమర్ POP (పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్) తో అనుసంధానమై ఉంటేనే పెర్సిస్టెన్స్ ఫీజు ఉంటుంది. ప్రతి లావాదేవీకి కనీస కాంట్రిబ్యూషన్‌ రూ. 500, & కనీస వార్షిక సహకారం రూ. 1,000. 

మరో ఆసక్తికర కథనం: సహారా బాధితులకు రూ.5 లక్షల వరకు రిఫండ్‌ - క్లెయిమ్‌ చేసిన దాదాపు 12 లక్షల మంది 

Published at : 05 Feb 2025 02:29 PM (IST) Tags: PFRDA NPS New Charges NPS Vatsalya NPS Lite

ఇవి కూడా చూడండి

Small Business Ideas : గ్రామాల్లోనే ఉంటూ అధిక ఆదాయం.. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన 7 బిజినెస్ ఐడియాలు

Small Business Ideas : గ్రామాల్లోనే ఉంటూ అధిక ఆదాయం.. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన 7 బిజినెస్ ఐడియాలు

Silver Prices : మొదటిసారిగా 3 లక్షలు దాటిన వెండి! ఇప్పుడు 1 కిలో ధర ఎంత ఉందో తెలుసుకోండి?

Silver Prices : మొదటిసారిగా 3 లక్షలు దాటిన వెండి! ఇప్పుడు 1 కిలో ధర ఎంత ఉందో తెలుసుకోండి?

SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!

SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?

Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?

Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?

టాప్ స్టోరీస్

Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!

Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!

Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి

Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి

Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా

Mana Shankara Vara Prasad Garu  BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా

Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం

Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం