search
×

Personal Loan: మీ పర్సనల్ లోన్‌ వడ్డీ రేటును ప్రభావితం చేసే కీలక అంశాలివి

ఎక్కువ షరతులు పూర్తి చేస్తే తక్కువ వడ్డీని - తక్కువ షరతులు పూర్తి చేస్తే ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది.

FOLLOW US: 
Share:

Personal Loan: ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితోపాటే మనందరి అవసరాలు, కోరికలు పెరుగుతున్నాయి. వాటిని తీర్చడానికి వ్యక్తిగత రుణాల ట్రెండ్ పెరిగింది, ఇన్‌స్టంట్ ఫైనాన్స్ అందుతోంది. అయితే, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను అర్థం చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల మీకు చౌకగా రుణం దొరుకుతుంది. 

మీ అర్హతలను బట్టి పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు మారవచ్చు. మీరు ఎక్కువ షరతులు పూర్తి చేస్తే తక్కువ వడ్డీని - తక్కువ షరతులు పూర్తి చేస్తే ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. 

వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక అంశాలు:

ఆదాయం
పర్సనల్ లోన్ వడ్డీ రేటును నిర్ణయించడంలో మీ ఆదాయానిది చాలా ముఖ్యమైన పాత్ర. రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం దీనిపై ఆధారపడి ఉంటుంది. రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ఖచ్చితమైన రుజువును మీరు చూపగలిగితే, మిమ్మల్ని 'తక్కువ రిస్క్ ఉన్న రుణగ్రహీత'గా రుణదాత బ్యాంక్‌/ఫైనాన్స్‌ కంపెనీ పరిగణిస్తుంది. సాధారణంగా, మెట్రో నగరాల్లో వ్యక్తిగత రుణం పొందాలంటే కనీస ఆదాయ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీనిని బట్టి, మీ అర్హతకు అనుగుణమైన పాకెట్-ఫ్రెండ్లీ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేస్తే, దానిని పొందే అవకాశాలు పెరుగుతాయి.

అప్పు-ఆదాయ నిష్పత్తిని తగ్గించండి
సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించడమే కాకుండా, మీరు రుణ-ఆదాయ నిష్పత్తి కూడా తక్కువగా ఉండాలి. అప్పుడు క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. రుణ-ఆదాయ నిష్పత్తిని బట్టి మీకు ఎంత రుణం ఇవ్వవచ్చు అన్నది బ్యాంక్‌/ఫైనాన్స్‌ కంపెనీ నిర్ణయిస్తుంది. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే మీకు రుణం ఇవ్వడం అంత రిస్క్‌ అని భావిస్తుంది. డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిగణిస్తుంది. అందువల్ల, మీ దరఖాస్తును ఆమోదించదు, లేదా మీకు ఎక్కువ వడ్డీ రేటుకు రుణం ఇస్తుంది. కాబట్టి మీ అప్పు-ఆదాయ నిష్పత్తిని 40% కంటే తక్కువగా ఉంచడం చాలా ముఖ్యం. అంటే మీ మొత్తం ఆదాయంలో 40%కు మించి రుణం ఉండకూడదు.

క్రెడిట్ స్కోర్
మీకు ఎంత క్రెడిట్ ఇవ్వవచ్చో మీ క్రెడిట్ స్కోర్ తెలియజేస్తుంది. సాధారణంగా, CIBIL స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే సరసమైన ధరలకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చు. మీకు రుణం ఇవ్వడానికి ముందు, బ్యాంక్‌/ఫైనాన్స్‌ కంపెనీ మీ CIBIL స్కోర్‌ను తనిఖీ చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే మిమ్మల్ని విశ్వసిస్తుంది, తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణం ఇస్తుంది. అందువల్ల, CIBIL స్కోర్‌ను మెరుగుపరచుకోవడం, ఎక్కువగా ఉంచుకోవడంపై ముఖ్యం.

ఆర్థిక స్థితి - ఇతర మార్కెట్ కారకాలు
ద్రవ్యోల్బణం, రెపో రేటు, ఇంకా మరెన్నో వంటి అనేక అంశాలపై మీకు ఇచ్చే రుణ రేటు ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలు మీ నియంత్రణలో లేనివి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యక్తిగత రుణ వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మాంద్యంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బ్యాంక్‌/ఫైనాన్స్‌ కంపెనీ వ్యక్తిగత రుణ వడ్డీ రేటు RBI రెపో రేటుతో ముడిపడి ఉంటుంది. అందువల్ల, రెపో రేటు తక్కువగా ఉంటే వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉండవచ్చు. అధిక రెపో రేటు ఫలితంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చు.

స్థిరమైన ఆదాయం
మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. పర్సనల్ లోన్ వడ్డీ రేటు దీనిపై ఆధారపడి ఉంటుంది. మీరు కనీసం రెండు సంవత్సరాలుగా ప్రసిద్ధ కంపెనీలో పని చేస్తుంటే, మీకు స్థిరమైన ఆదాయం ఉన్నట్లు లెక్క. మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని బ్యాంక్‌/ఫైనాన్స్‌ కంపెనీ భావిస్తుంది. దీని ఆధారంగా మీకు తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణం ఇవ్వవచ్చు.

కంపెనీతో అనుబంధం
సాధారణంగా, ఒక బ్యాంక్‌/ఫైనాన్స్‌ కంపెనీ తన పాత కస్టమర్ల నుంచి తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. వారి మధ్య పాత బంధం కారణంగా విశ్వాసం ఏర్పడి ఉంటుంది. కస్టమర్ విశ్వసనీయంగా ఉన్నారని బ్యాంక్‌/ఫైనాన్స్‌ కంపెనీ భావిస్తే, అతనికి కొత్త కస్టమర్ కంటే మెరుగైన డీల్ ఇవ్వవచ్చు.

వివిధ బ్యాంక్‌/ఫైనాన్స్‌ కంపెనీల వడ్డీ రేట్లను పోల్చిన తర్వాత మాత్రమే వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోండి. పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీ పర్సనల్ లోన్ అర్హతను చెక్ చేసుకోవచ్చు.

Published at : 25 Apr 2023 12:27 PM (IST) Tags: Personal Loan Eligibility Interest Rates key factors

ఇవి కూడా చూడండి

CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్‌ లోన్‌ తీసుకోలేదు' - నా సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్‌ లోన్‌ తీసుకోలేదు' - నా సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌

Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌

Gold-Silver Prices Today 27 Dec: రూ.600 పెరిగిన ప్యూర్‌ గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24K, 22K పసిడి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 27 Dec: రూ.600 పెరిగిన ప్యూర్‌ గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24K, 22K పసిడి ధరలు ఇవీ

SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌

SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌

New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్‌ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!

New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్‌ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!

టాప్ స్టోరీస్

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి

Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !

Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !