By: ABP Desam | Updated at : 28 Jun 2023 12:10 PM (IST)
ITR ఫైలింగ్ ముందే పాన్-ఆధార్ లింక్ చేయండి
Aadhar-PAN Linking: మీరు మీ ఇన్‌కం టాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేయాలంటే, ముందుగా మీ ఆధార్ కార్డ్‌ను - పాన్ కార్డ్‌ను కచ్చితంగా లింక్ చేయాలి. ఈ రెండింటికీ జత కుదర్చకపోతే ITR ఫైల్ చేయలేరు. ఒకవేళ ITR ఫైల్ చేసేందుకు టాక్స్ డిపార్ట్‌మెంట్ అనుమతించినా, కొన్ని టాక్స్ బెనిఫిట్స్‌ను మాత్రం మిస్ అవ్వాల్సి వస్తుంది.
మీ ఆధార్ కార్డ్‌ను - పాన్ కార్డ్‌ను లింక్ చేయడానికి ఈ నెలాఖరు (30 జూన్ 2023) వరకే గడువు ఉంది. వాస్తవానికి, పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి పాన్-ఆధార్ నంబర్ అనుసంధానం డెడ్‌లైన్‌ను (PAN-Aadhaar Link Deadline) CBDT గతంలోనే పెంచింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పుడు ఆ లాస్ట్‌డేట్ కూడా ముగింపునకు వచ్చింది.
జూన్ 30 లోగా పాన్-ఆధార్ లింక్ పూర్తి చేయడానికి రూ. 1,000 జరిమానా కడితే సరిపోతుంది. ఆ తర్వాత, ఇదే పని కోసం రూ. 10 వేలు ఫైన్ కట్టాల్సిరావచ్చని సమాచారం.
పాన్ కార్డ్‌తో ఆధార్ లింక్ చేయకపోతే ఏంటి నష్టం?
30 జూన్ 2023లోపు పాన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే, సదరు వ్యక్తి పాన్ కార్డ్ నాన్-ఆపరేటివ్‌గా మారుతుంది. ఆ తర్వాత అధిక జరిమానా ఎదుర్కోవలసి వస్తుంది. పాన్-ఆధార్ లింక్ కాకపోతే, టాక్స్ పేయర్‌కు రిఫండ్ రాదు. పాన్ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అలాగే, అలాంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ TDS & TCS వసూలు చేస్తారు. అంతేకాదు, పాన్ కార్డ్-ఆధార్ అనుసంధానం కాకపోతే ఆర్థికపరమైన లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంక్ అకౌంట్, డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. పాన్ కార్డ్ అవసరమైన ప్రతి చోట పని ఆగిపోతుంది. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసి, ఫైన్ కట్టిన తర్వాత 30 రోజుల్లో పాన్ మళ్లీ క్రియాశీలంగా మారుతుంది.
పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులు, వాటిని అనుసంధానించాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు, చట్టం ప్రకారం నాన్ రెసిడెంట్‌లు, భారతీయ పౌరులు కాని వాళ్లు, గత సంవత్సరం నాటికి 80 ఏళ్లు పైబడిన వాళ్లు మినహాయింపు వర్గంలోకి వస్తారు.
ఆధార్-పాన్‌ను ఎలా లింక్ చేయాలి?
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ను ఓపెన్ చేయండి.
ఈ వెబ్‌సైట్‌లో (ఇప్పటికీ చేయకపోతే) రిజిస్టర్ చేయసుకోండి.
మీ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) మీ యూజర్ ID అవుతుంది.
యూజర్ ID, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
పాప్ అప్ విండో తెరుచుకోకపోతే, మెనూ బార్‌లోని 'ప్రొఫైల్ సెట్టింగ్స్'లోకి వెళ్లి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.
పాన్ కార్డ్‌లో ఉన్న ప్రకారం మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు అక్కడ కనిపిస్తాయి.
మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సరిచూసుకోండి.
వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, "లింక్ నౌ" బటన్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ మీ పాన్‌తో విజయవంతంగా లింక్ అయిందన్న పాప్-అప్ మెసేజ్ మీకు తెలియజేస్తుంది.
మరో ఆసక్తికర కథనం: రిటర్న్ ఫైలింగ్‌లో పాత పన్ను పద్ధతి బెటరా, కొత్త పన్ను పద్ధతి బెటరా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్ - ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్
High Interest: ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ
EMI Fact: ఈఎంఐ చెల్లింపుల్లో అందరిలాగే మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? - తప్పదు భారీ నష్టం!
Gold-Silver Prices Today 18 Nov: మళ్లీ పరుగు మొదలు పెట్టిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు