search
×

ITR: రిటర్న్‌ ఫైలింగ్‌లో పాత పన్ను పద్ధతి బెటరా, కొత్త పన్ను పద్ధతి బెటరా?

'ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి'ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు భారత ప్రభుత్వం పెంచింది.

FOLLOW US: 
Share:

Income Tax Return Filing: ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్ కోసం కొత్త ఆదాయ పన్ను పద్ధతి (New Tax Regime), పాత ఆదాయ పన్ను ( Old Tax Regime) పద్ధతి పేరిట రెండు మార్గాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది ఎంచుకోవాలో చాలా మంది పన్ను చెల్లింపుదార్లకు ఇప్పటికీ అర్ధంగాక బుర్ర గోక్కుంటున్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మారిన రూల్స్‌
గత ఆర్థిక సంవత్సరంలో కూడా పాత- కొత్త టాక్స్‌ రెజిమ్స్‌ అమల్లో ఉన్నాయి. అయితే, అప్పుడు ఈ రెండింటికీ పెద్ద తేడా కనిపించలేదు. లెక్కలు వేస్తే, టాక్స్‌ పేయర్‌ కట్టాల్సిన పన్ను రెండింటిలో ఇంచుమించు ఒకేలా వచ్చింది. దీంతో, అప్పుడు తమకు తోచిన విధానాన్ని ఎంచుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని రూల్స్‌ మారాయి. 

కొత్త పన్ను విధానంలో, 'ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి'ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు భారత ప్రభుత్వం పెంచింది. మరో రూ. 50 వేలు ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) రూపంలో యాడ్‌ అవుతుంది. అంటే, రూ.7.5 లక్షల వరకు ఆదాయం సంపాదించేవాళ్లు ఒక్క రూపాయి కూడా టాక్స్‌ కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే, పన్ను మినహాయింపు సెక్షన్లు ఒక్కటి కూడా కొత్త పన్ను పద్దతికి వర్తించవు. 

పాత పన్ను విధానంలో, 'ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి' రూ.5 లక్షలుగా యథాతథంగా కొనసాగుతోంది. ఈ పద్ధతిలో, వివిధ సెక్షన్ల కింద టాక్స్‌ డిడక్షన్స్‌, ఎగ్జంప్షన్స్‌ అందుబాటులో ఉంటాయి.

ఇలా ఉంటే కొత్త పద్ధతి బెటర్‌
2022-23 ఆర్థిక సంవత్సరానికి మీ మొత్తం ఆదాయం ఎంత, క్లెయిమ్‌ చేసుకోదగిన వ్యయమెంతో సరిగ్గా గుర్తిస్తే, ఏ పన్ను విధానం ఎంచుకోవాలో సులభంగా నిర్ణయించుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేలతో కలిపి మొత్తం రూ.7.5 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఆదాయం మీకు ఉన్నా, 31,200 రూపాయలు టాక్స్‌ కట్టాల్సి వస్తుంది. పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితి రూ.5 లక్షలే కాబట్టి, మీరు పన్ను పరిధిలోకి రాకూడదనుకుంటే రూ.2.5 లక్షల వరకు (7,50,000-5,00,000) మినహాయింపులను చూపించాల్సి ఉంటుంది. ఈ విధానంలో, సెక్షన్‌ 80C కింద గరిష్టంగా 1.5 లక్షల వరకు చూపించుకోవచ్చు. మరో లక్ష రూపాయల మినహాయింపుల కోసం ఇతర సెక్షన్లను వెతుక్కోవాలి. లేదా, ఆయా సెక్షన్ల కిందకు వచ్చే పెట్టుబడులను ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందు నుంచే పెట్టి ఉండాలి. ఇది కాస్త కష్టమైన పనే కాబట్టి, మీ ఆదాయం రూ.7.5 లక్షల లోపు ఉంటే కొత్త పన్ను విధానం ఎంచుకోవడం ఉత్తమ మార్గంగా ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు. దీంతోపాటు... మీ ఆదాయం ఎక్కువగా ఉండి, ఇంటి రుణం లేకపోతే.. కొత్త పన్ను విధానం ఎంచుకోవడం బెటర్‌ ఆప్షన్‌గా చెబుతున్నారు.

ఇలా ఉంటే పాత పద్ధతి బెటర్‌
ఒకవేళ.. పన్ను తగ్గించే వ్యయాలు, పెట్టుబడులపై మీకు ముందు నుంచే అవగాహన ఉండి, అలాంటి వ్యయాలు, పెట్టుబడులు మీ ఆదాయంలో 30 శాతం వరకు ఉంటే.. మీరు పాత పన్ను పద్ధతిని ఫాలో కావచ్చు. ముఖ్యంగా, మీకు గృహ రుణం ఉంటే.. అదే పెద్ద ఎగ్జంప్షన్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు రూ.14 లక్షలకు మించని ఆదాయం ఉండి, పన్ను తగ్గించుకునే వ్యయాలు, పెట్టుబడులు దానిలో 30 శాతం తగ్గకుండా ఉంటే.. మీరు పాత పన్ను విధానాన్ని ఫాలో కావచ్చు, తద్వారా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ITR ఫైల్‌ చేయవచ్చు. లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం రూ.14 లక్షలకు మించకుండా, పన్ను తగ్గించుకునే వ్యయాలు, పెట్టుబడుల మొత్తం కూడా రూ.4.25 లక్షలకు మించకుండా ఉంటే... ఇలాంటి సందర్భంలో కూడా మీరు పాత పన్ను విధానాన్ని ఫాలో కావచ్చు. 

మరో ఆసక్తికర కథనం: గ్యాస్‌ కనెక్షన్‌ కోసం కాళ్లరిగేలా తిరగొద్దు, వాట్సాప్‌లో 'హాయ్‌' చెబితే చాలు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 28 Jun 2023 11:52 AM (IST) Tags: ITR Income Tax Return New Tax Regime Old Tax Regime filing

ఇవి కూడా చూడండి

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Provident Fund: ఈపీఎఫ్‌ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!

Provident Fund: ఈపీఎఫ్‌ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!

Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి

Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి

Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం

Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?

Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?