By: Arun Kumar Veera | Updated at : 30 Jan 2024 02:42 PM (IST)
ఫిబ్రవరి 01 నుంచి మారే కొత్త రూల్స్ ఇవే
New Rules from February 2024: క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభం కాగానే, దేశవ్యాప్తంగా కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి కూడా కొన్ని విషయాలు మారతాయి. వాటిలో.. కేంద్ర బడ్జెట్, NPS విత్‌డ్రా రూల్, సావరిన్ గోల్డ్ బాండ్ పథకం, స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్ ఆఫర్ సహా చాలా విషయాలు ఉన్నాయి. ఈ మార్పులు మీ పొదుపు, పెట్టుబడులు, ప్రయోజనాల మీద ప్రభావం చూపొచ్చు. మీ ఇంటి బడ్జెట్‌ను పెంచొచ్చు. వాటి గురించి ముందే తెలుసుకుంటే, మీ పర్స్‌కు చిల్లు పడకుండా అడ్డుకోవచ్చు.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్: మోదీ 2.0 హయాంలోని చివరి బడ్జెట్ ఇది. ఇది మధ్యంతర బడ్జెట్ అయినా, రాబోయే ఎన్నికల దృష్ట్యా కొన్ని ప్రోత్సాహక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. లేదా.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే, జులైలో ప్రవేశపెట్టే సమగ్ర బడ్జెట్‌లో కురిపించే వరాల గురించి హింట్స్ అయినా ఇచ్చే ఛాన్స్ ఉంది. గత కొన్నేళ్లుగా మూలధన వ్యయం కోసం భారీగా కేటాయింపులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈసారి కూడా అదే పంథా కొనసాగించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశ జనాభాలో మెజారిటీ వర్గమైన మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని కొత్త రాయితీలను ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.
సావరిన్ గోల్డ్ బాండ్ (SGB): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), 2023-24 సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్‌లో చివరి విడతను ఫిబ్రవరిలో ప్రకటిస్తుంది. దీని సబ్‌స్క్రిప్షన్ 2024 ఫిబ్రవరి 12న ఓపెన్ అవుతుంది, అదే నెల 16న ముగుస్తుంది. దీనికి ముందు విడత 2023 డిసెంబర్‌లో జరిగింది. అప్పుడు, బంగారం ధరను గ్రాముకు రూ.6,199గా కేంద్ర బ్యాంక్ నిర్ణయించింది. ఫిబ్రవరి సిరీస్‌లో గ్రాము ధరను అతి త్వరలో ప్రకటిస్తారు.
NPS డబ్బు విత్‌డ్రా నిబంధన (NPS Withdrawal Rule): పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), ఈ మధ్యే ఒక సర్క్యులర్ విడుదల చేసింది. NPS అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి (partial withdrawal of pension) కొత్త రూల్ జారీ చేసింది. ఫిబ్రవరి 01 నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం... NSP అకౌంట్‌లో ఉన్న డబ్బులో యజమాన్యం వాటాను మినహాయించి, చందాదార్లు కట్టే వాటా నుంచి మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా 25 శాతం ఉపసంహరణకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఫాస్టాగ్ కేవైసీ (FASTag KYC): కేవైసీ లేని అన్ని ఫాస్టాగ్‌లు ఫిబ్రవరి 01 నుంచి డీయాక్టివేట్ అవుతాయి. అంటే, జనవరి 31 లోగా యూజర్లు తమ ఫాస్టాగ్ కేవైసీని పూర్తి చేయాలి. ఫాస్టాగ్‌కు అనుసంధానమైన మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బున్నా, కేవైసీకి ఈ-కేవైసీ చేయకపోతే అవి పని పని చేయవు.
స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్ ఆఫర్ (SBI Home Loan Offer): దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI, క్రెడిట్ స్కోర్ ఆధారంగా గృహ రుణాలపై రాయితీ ఇస్తోంది. 650 bps కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేట్లకు హౌసింగ్ లోన్ మంజూరు చేస్తోంది. హోమ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజు, రాయితీలకు చివరి తేదీ 31 జనవరి 2024.
ధన్ లక్ష్మి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం (Dhan Lakshmi FD Scheme): పంజాబ్ & సింధ్ బ్యాంక్ (PSB) అమలు చేస్తున్న 'ధన్ లక్ష్మి 444 డేస్' ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం చివరి తేదీ జనవరి 31, 2024. పేరుకు తగ్గట్లే ఈ టర్మ్ డిపాజిట్ కాల వ్యవధి 444 రోజులు. వడ్డీ రేటు 7.4%. సూపర్ సీనియర్లు 8.05% తీసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని లైవ్‌లో ఎప్పుడు, ఎలా చూడాలి?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?