By: ABP Desam | Updated at : 11 Jun 2022 01:10 PM (IST)
Edited By: Ramakrishna Paladi
మల్టీబ్యాగర్ షేర్ ( Image Source : Pixabay )
Multibagger stock 2022 EKI Energy share gives 70 lakh retruns for 1 lakh in a year : చాలామంది ఈక్విటీ మార్కెట్లను జూదం అనుకుంటారు! సెంటిమెంటుతో నడుస్తాయని తప్పుడు భావనతో ఉంటారు. ఒకరో ఇద్దరో లాభపడతారు తప్ప మిగతా వాళ్లంతా నష్టపోతారని ఫీలవుతారు. అదే సమయంలో తమ డబ్బుకు తగిన రాబడినిచ్చేది స్టాక్ మార్కెటేనని మరికొందరు భావిస్తారు. మంచి కంపెనీలు, ఫండమెంటల్‌గా బలంగా ఉన్న షేర్లలో పెట్టుబడి పెట్టి కోట్లు ఆర్జిస్తుంటారు. ఆ మల్టీబ్యాగర్ షేర్లను చూసి మురిసిపోతారు. ఈకేఐ ఎనర్జీ షేరు (EKI Energy) అలాంటిదే.
6900% పెరిగిన EKI Energy
ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ 2021, మార్చిలో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.102 ధరకు షేర్లను ఆఫర్ చేసింది. 2021, ఏప్రిల్ 7న బీఎస్‌ఈలో రూ.140 ప్రీమియంతో నమోదయ్యాయి. ఇన్వెస్టర్లకు అదే రోజు 37 శాతం లాభాన్ని అందించాయి. అప్పట్నుంచి ఈ షేరు తగ్గేదే లే! అన్నట్టుగా పైపైకి ఎగిసింది. ప్రస్తుతం రూ.7,200కు చేరుకుంది. ఇష్యూ ధరతో పోలిస్తే 6,900 శాతం ర్యాలీ అయింది. ఇన్వెస్టర్లకు బంఫర్ ప్రాఫిట్‌ను ఇచ్చింది.
EKI Energy హిస్టరీ
తొలిరోజే 37 శాతం లాభం అందించిన ఈకేఐ ఎనర్జీ షేరు అదే ఊపులో పెరిగింది. 2022, జనవరిలో జీవితకాల గరిష్ఠమైన రూ.12,599కి చేరుకుంది. ఆ తర్వాత కన్సాలిడేషన్‌కు గురైంది. చివరి నెలలో 6 శాతం తగ్గింది. జనవరి నుంచి ఇప్పటి వరకు 30 శాతం నష్టపోయింది. ఇక చివరి 6 నెలల్లో రూ.5450 నుంచి రూ.7,200కు పెరిగింది. అంటే 32 శాతం ర్యాలీ అయింది. మొత్తంగా ఇష్యూ నుంచి ఏడాది కాలంలో రూ.102 నుంచి రూ.7200కు వచ్చింది.
EKI Energy రూ.70 లక్షల లాభం
ఈకేఐ ఎనర్జీ షేర్లలో నెల రోజుల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడవి రూ.94,000 అయ్యేవి. జనవరి నుంచి అయితే రూ.70,000కు తగ్గేది. అదే 6 నెలల క్రితం లక్ష పెట్టుంటే రూ.1.32 లక్షలు అందించేది. ఇష్యూ ధర నుంచి హోల్డ్ చేసుంటే జస్ట్ ఏడాది కాలంలోనే రూ.లక్షకు రూ.70 లక్షలు చేతికి వచ్చేవి. జీవితకాల గరిష్ఠ ధర వద్ద అమ్మేసుకుంటే ఏకంగా రూ.86 లక్షలకు పైగా రాబడి వచ్చేది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్