Multibagger penny stock: పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం అంత ఈజీ కాదు! తక్కువ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం పెట్టుబడులను కొనసాగించడం నష్టభయంతో కూడుకున్నది. అందుకే ఇలాంటి చిన్న కంపెనీల్లో డబ్బులు పెట్టేముందు ఎంతో ఆలోచించాలి.
భవిష్యత్తులో పెద్ద స్థాయికి ఎదుగుతుందని విశ్లేషించుకున్న కంపెనీల్లో పెట్టుబడి పెడితే బెటర్. అలాంటి కోవకే చెందుతుంది జీఆర్‌ఎం ఓవర్‌సీస్. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ. పదేళ్ల క్రితం రూ.1.93గా ఉన్న ఈ కంపెనీ షేరు ధర ఇప్పుడు రూ.782.40కు చేరుకుంది. పదేళ్ల వ్యవధిలో 40,450 శాతం ర్యాలీ చేసింది.
గత నెలలో ఈ కంపెనీ షేరు ధర రూ.505 నుంచి రూ.782కు పెరిగింది. 55 శాతం ర్యాలీ చేసింది. ఇక చివరి ఆరు నెలల్లో ఈ మల్టీబ్యాగర్ రూ.156 నుంచి రూ.782కు చేరుకుంది. 400 శాతం లాభపడింది.
చివరి ఏడాదిలో జీఆర్‌ఎం ఓవర్‌సీస్ షేర్ల ధర రూ.34.44 నుంచి రూ.782కు పెరిగింది. అంటే 2200 శాతం ర్యాలీ అన్నమాట. అదే విధంగా ఐదేళ్లలో ఈ షేరు 17,325 శాతం ర్యాలీ అయి రూ.4.49 నుంచి రూ.782కు పెరిగింది. పదేళ్లలో రూ.1.93 నుంచి రూ.782కు చేరుకుంది.
జీఆర్‌ఎం ఓవర్‌సీస్‌లో
- నెల రోజుల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.1.55 లక్షలు చేతికి అందేవి.
- ఆరు నెలల క్రితం లక్ష రూపాయలు పెట్టుంటే ఇప్పుడు రూ.5 లక్షలు అయ్యేవి.
- ఏడాదికి క్రితం లక్ష రూపాయలు పెట్టుబడికి ఇప్పుడు రూ.23 లక్షలు అందేవి.
- ఐదేళ్ల క్రితం లక్ష పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రూ.1.74 కోట్లు చేతికి అందేవి.
- పదేళ్ల క్రితం గనక లక్ష రూపాయలు పెట్టుంటే రూ.4.05 కోట్లు చేతికొచ్చేవి.
Also Read: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!
Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ కంపెనీకి నష్టాల సెగ!!
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!