Cheapest Home Loans: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) రెపోరేటును మరో 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ నిర్ణయం ప్రకటించారు. కేవలం తొమ్మిది నెలల కాలంలో కేంద్ర బ్యాంకు రెపోరేటును సవరించడం ఇది మూడోసారి.


5.40 శాతానికి రెపో రేటు


రెపోరేటును ఎప్పుడు సవరించినా దాని ప్రభావం రుణాలు, ఈఎంఐలపై నేరుగా ఉంటుంది. కొత్త, పాత రుణ గ్రహీతలపై అదనపు భారం పడుతుంది. 2022, మే నెల నుంచి కేంద్ర బ్యాంకు రెపోరేటు పెంపు సైకిల్‌ ఆరంభించింది. కొన్ని నెలల క్రితం 4 శాతంగా ఉన్న విధాన రేటు ఇప్పుడు 5.40 శాతానికి చేరుకుంది. దాంతో బ్యాంకులు అప్పులపై వడ్డీరేట్లను వెంటనే పెంచేస్తున్నాయి. ఫలితంగా ఈఎంఐల భారం పెరిగి రుణ గ్రహీతలు అల్లాడుతున్నారు.


Also Read: తెలంగాణలో ఇళ్లు కొనలేమా! వడ్డీరేట్ల పెంపు, దేశవ్యాప్త ట్రెండ్‌ ఏంటి?


Also Read: పని చేయండి లేదా ప్యాక్‌ చేసుకోండి - 62వేల ఉద్యోగులకు మోదీ సర్కార్‌ అల్టిమేటమ్‌!


లోన్‌ ట్రాన్స్‌ఫర్‌ ఓ ఛాన్స్‌


పెరుగుతున్న ఇంటి రుణాల ఈఎంఐల భారం తగ్గించుకొనేందుకు ఓ పరిష్కారం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తక్కువ వడ్డీరేటు అమలు చేస్తున్న బ్యాంకులకు ఇంటి రుణాల బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. చాలా మంది విషయంలో ఇది బాగానే పనిచేస్తున్నా వ్యక్తిగత జీతభత్యాలు, అవసరాలను బట్టి లాభనష్టాలు బేరీజు వేసుకోవాలని చెబుతున్నారు. లోన్‌ ట్రాన్స్‌ఫర్‌ వల్ల ఎంతవరకు ఆదా చేయగలరో ముందుగానే లెక్కించుకోవడం అవసరం.
 





ఎక్కువగా ఆఎల్‌ఎల్‌ఆరే 


బ్యాంకులు వడ్డీరేట్లను అమలు చేసేందుకు ఏదో ఒక ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ను అనుసరించాలని ఆర్బీఐ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవి నాలుగు రకాలుగా ఉన్నాయి. ఆర్బీఐ నిర్ణయించే రెపోరేటు, ఫైనాన్షియల్‌ బెంచ్‌ మార్క్‌ ఇండియా ప్రచురించే ప్రభుత్వ 3 నెలల ట్రెజరీ బిల్లుల రాబడి, 6 నెలల ట్రెజరీ బిల్లుల రాబడి, ఫైనాన్షియల్‌ బెంచ్‌ మార్క్‌ ఇండియా లిమిటెడ్‌ (FBIL) ప్రచురించే ఇంకైదేనా బెంచ్‌ మార్క్‌ మార్కెట్‌ వడ్డీరేటును అనుసరించొచ్చు.


ఇప్పటికైతే చాలా బ్యాంకులు ఆర్బీఐ రెపోరేటునే అనుసరిస్తున్నాయి. వీరు అమలు చేసే దానిని రెపోరేటు అనుసంధాన వడ్డీరేటు (RLLR)గా పిలుస్తారు. ఆర్బీఐ రెపోరేటు, స్ప్రెడ్‌ లేదా మార్జిన్‌ కలిపి ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ నిర్ణయిస్తారు.


తక్కువ వడ్డీరేటు ఆఫర్‌ చేస్తున్న బ్యాంకులు