By: Arun Kumar Veera | Updated at : 13 Aug 2024 10:22 AM (IST)
మీరు చేసిన అప్పులకూ బీమా కవరేజ్ ( Image Source : Other )
LIC Launches New Term Life Insurance Plans: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 4 కొత్త టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ప్రారంభించింది. అవి – ఎల్‌ఐసీ యువ టర్మ్ ప్లాన్ (LIC Yuva Term Plan), ఎల్‌ఐసీ డిజి టర్మ్ ప్లాన్ (LIC Digi Term Plan), ఎల్‌ఐసీ యువ క్రెడిట్ లైఫ్ ప్లాన్ (LIC Yuva Credit Life Plan), ఎల్‌ఐసీ డిజి క్రెడిట్ లైఫ్ ప్లాన్ (LIC Digi Credit Life Plan). ఇవి టర్మ్ ఇన్సూరెన్స్‌ను అందించడంతో పాటు ఆయా వ్యక్తులు చేసిన రుణాలను కూడా కవర్ చేస్తాయి. ఈ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం, ప్రజలు వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు.. హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్ వంటివి. అప్పు తీసుకున్న వ్యక్తికి హఠాత్తుగా ఏదైనా జరిగితే, ఆ రుణ బాధ్యత కుటుంబ సభ్యులపై పడుతుంది, వారికి పెను భారంగా మారుతుంది. ఎల్‌ఐసీ తీసుకొచ్చిన కొత్త టర్మ్ ప్లాన్స్ ఆ రుణ బాధ్యతల భారం నుంచి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తాయి.
ఎల్‌ఐసీ యువ టర్మ్ ప్లాన్‌ను ఆఫ్‌లైన్‌లో, ఎల్‌ఐసీ డిజి టర్మ్ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎల్‌ఐసీ యువ క్రెడిట్ లైఫ్ ప్లాన్‌ను ఆఫ్‌లైన్‌లో, ఎల్‌ఐసీ డిజి క్రెడిట్ లైఫ్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలి.
LIC యువ టర్మ్ / LIC డిజి టర్మ్ ప్లాన్
ఇది నాన్-పార్, నాన్-లింక్డ్, లైఫ్, ఇండివిడ్యువల్, ప్యూర్ రిస్క్ ప్లాన్. పాలసీ వ్యవధిలో పాలసీహోల్డర్ మరణిస్తే, బీమా చేసిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. డెత్ బెనిఫిట్స్‌కు గ్యారెంటీ ఉంటుంది.
బేసిక్ సమ్ అష్యూర్డ్ మొత్తం ఎంత?
రూ. 50,00,000 నుంచి రూ. 75,00,000 = రూ. 1,00,000
రూ. 75,00,000 నుంచి రూ. 1,50,00,000 = రూ. 25,00,000
రూ. 1,50,00,000 నుంచి రూ. 4,00,00,000 = రూ. 50,00,000
రూ. 4,00,00,000 పైన = రూ. 1,00,00,000
ప్రీమియం చెల్లింపు
సింగిల్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్ ఎంచుకున్నప్పుడు.. పాలసీ వ్యవధిలో పాలసీహోల్డర్ మరణిస్తే, సింగిల్ ప్రీమియంలో 125% లేదా ముందుగా హామీ ఇచ్చిన మొత్తాన్ని డెత్ బెనిఫిట్‌గా LIC చెల్లిస్తుంది.
ఫీచర్లు
మహిళలకు తక్కువ ప్రీమియం రేట్లు
రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్లు
డెత్ బెనిఫిట్ - వార్షిక ప్రీమియానికి 7 రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105% లేదా ముందుగా హామీ ఇచ్చిన మొత్తం.
డెత్ బెనిఫిట్‌లో కనీస వయస్సు 18 సంవత్సరాలు - గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
మెచ్యూరిటీ బెనిఫిట్‌లో కనీస వయస్సు 33 సంవత్సరాలు - గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు
LIC యువ క్రెడిట్ లైఫ్/ LIC డిజి క్రెడిట్ లైఫ్
ఇది నాన్-పార్, నాన్-లింక్డ్, లైఫ్, ఇండివిడ్యువల్, ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇందులో, పాలసీ వ్యవధిలో డెత్ బెనిఫిట్ తగ్గుతూ వస్తుంది.
బేసిక్ సమ్ అష్యూర్డ్ మొత్తం ఎంత?
రూ. 50,00,000 నుంచి రూ. 75,00,000 = రూ. 1,00,000
రూ. 75,00,000 నుంచి రూ. 1,50,00,000 = రూ. 25,00,000
రూ. 1,50,00,000 నుంచి రూ. 4,00,00,000 = రూ. 50,00,000
రూ. 4,00,00,000 పైన = రూ. 1,00,00,000.
ఫీచర్లు
మహిళల కోసం ప్రత్యేకంగా తక్కువ ప్రీమియం ధరలు
రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు ఎంపికలు
డెత్ బెనిఫిట్ - వార్షిక ప్రీమియానికి 7 రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105% లేదా ముందుగా హామీ ఇచ్చిన మొత్తం.
డెత్ బెనిఫిట్‌లో కనీస వయస్సు 18 సంవత్సరాలు - గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
మెచ్యూరిటీ బెనిఫిట్‌లో కనీస వయస్సు 23 సంవత్సరాలు - గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు
ఆకర్షణీయమైన సమ్ అష్యూర్డ్ రిబేట్ బెనిఫిట్
మహిళలకు తక్కువ ప్రీమియం రేట్లు
పాలసీ ప్రారంభంలో రుణ వడ్డీ రేటును ఎంచుకునే ఆప్షన్
ప్రీమియం చెల్లింపు
పన్నులు, అదనపు ప్రీమియం మినహా చెల్లించాల్సిన మొత్తాన్ని సింగిల్ ప్రీమియంగా లెక్కిస్తారు.
మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను గానీ, ఎల్‌ఐసీ ఏజెంట్‌ను గానీ సంప్రదించొచ్చు.
మరో ఆసక్తికర కథనం: చల్లబడ్డ ఇంధనం రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి
Saving Ideas: రూల్ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్ ఛేంజర్' ఇది
Blue Aadhaar Card: బ్లూ కలర్ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్ చేసుకోండి
Gold Vs Diamond: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
Gold-Silver Prices Today 02 Nov: పండుగ తర్వాత పసిడి రేట్ల పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Holidays: ఈ నెలలో బ్యాంక్‌లు 12 రోజులు సెలవుల్లోనే ఉంటాయి, మీకేదైనా ముఖ్యమైన పని ఉందా?
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Nayani Pavani: బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!