By: Arun Kumar Veera | Updated at : 27 Jan 2024 04:09 PM (IST)
జీవితాంతం డబ్బు ఇచ్చే ఎల్‌ఐసీ కొత్త పాలసీ
LIC Jeevan Utsav Policy Details in Telugu: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC), ఇటీవల కొత్త పాలసీని ప్రజలకు పరిచయం చేసింది. ఆ పాలసీ పేరు 'జీవన్ ఉత్సవ్'. పొదుపు + జీవితకాలపు బీమాతో పాటు జీవితాంతం గ్యారెంటీడ్ రిటర్న్స్ (Guaranteed returns) ఇవ్వడం ఈ ప్లాన్ ప్రత్యేకత. ఇది ప్లాన్ నంబర్ 871 (LIC Plan No 871).
2023 నవంబర్ 29న జీవన్ ఉత్సవ్ పాలసీని LIC లాంచ్ చేసింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్‌టైమ్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను అందించే కొత్త ప్లాన్. ఈ పాలసీ కొంటే, ప్రీమియం చెల్లింపు వ్యవధి పూర్తియిన తర్వాత కొంత వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. ఆ తర్వాత, హామీ మొత్తంలో 10 శాతాన్ని పాలసీదారుకు ఏటా చెల్లిస్తారు. అలా.. పాలసీహోల్డర్ జీవితాంతం ఆదాయం వస్తూనే ఉంటుంది. ఆ డబ్బుతో, ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా దర్జాగా బతకొచ్చు.
పాలసీని ఎక్కడ కొనుగోలు ఎక్కడ?
ఎల్‌ఐసీ జీవన్ ఉత్సవ్ పాలసీని ఎల్‌ఐసీ ఏజెంట్ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.
పాలసీ తీసుకోవడానికి అర్హతలు?
పసిపిల్లలు, యువత, వృద్ధులు, ఆడవాళ్లు, మగవాళ్లు ఎవరైనా LIC జీవన్ ఉత్సవ్ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునే సమయానికి కస్టమర్ వయస్సు 90 రోజులకు తగ్గకుండా - 65 సంవత్సరాలకు మించకుండా ఉంటే చాలు. ఈ పథకం కింద.. 5-16 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత కొంత వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది.
5 సంవత్సరాల ప్రీమియం టెన్యూర్‌ను ఎంచుకుంటే, తర్వాత మరో 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 6 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే 4 సంవత్సరాల వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. 7 సంవత్సరాల పేమెంట్ ఆప్షన్ తీసుకుంటే వెయిటింగ్ పిరియడ్ మరో 3 సంవత్సరాలు అవుతుంది. 8-16 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే ఇంకో 2 ఏళ్లు వెయిట్ చేయాలి.
వెయింటింగ్ పిరియడ్ ముగిసిన నాటి నుంచి పాలసీ మొత్తంలో ఏటా 10% చొప్పున LIC మీకు తిరిగి చెల్లిస్తుంది. అలా.. పాలసీదారు బతికి ఉన్నంత కాలం డబ్బు చెల్లిస్తుంది. ఈ పథకం కింద, పెట్టుబడిదార్లు కనీసం రూ.5 లక్షల హామీ మొత్తాన్ని (Minimum sum assured) తీసుకోవాలి. గరిష్టంగా ఎంత మొత్తాన్నైనా ఎంచుకోవచ్చు.
పాలసీ తీసుకున్న తర్వాత... నెలకు ఒకసారి, మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి చొప్పున ప్రీమియం చెల్లించొచ్చు. పాలసీ చెల్లింపు కాలంలో పాలసీదారు కట్టే ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున గ్యారెంటీడ్ అడిషన్స్‌ను (Guaranteed additions) కూడా LIC జమ చేస్తుంది.
చక్ర వడ్డీ ప్రయోజనం
జీవన్ ఉత్సవ్ పథకం కింద జీవితాంతం ఆదాయం పొందడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. అవి.. రెగ్యులర్ ఇన్‌కమ్, ఫ్లెక్సీ ఇన్‌కమ్. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షన్‌లో ఏటా 10% డబ్బు జీవితాంతం తిరిగి వస్తుంది. ఫ్లెక్సీ ఇన్‌కమ్ ఆప్షన్ ఎంచుకుంటే, ఏటా చెల్లించే డబ్బు ఎల్‌ఐసీ వద్దే ఉంటుంది, దానిపై 5.5 శాతం చక్రవడ్డీ వస్తుంది. కావాలంటే, జమ అయిన మొత్తంలో 75% డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తానికి చక్ర వడ్డీ లభిస్తుంది.
డెత్ బెనిఫిట్స్ (LIC Jeevan Utsav Death Benefit)
పాలసీదారు మరణిస్తే.. డెత్ బెనిఫిట్స్‌తో పాటు గ్యారెంటీడ్ అడిషన్స్‌ను కలిపి ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. డెత్ ఇన్సూరెన్స్ డబ్బు లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్ల మొత్తం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి ఇస్తుంది.
జీవన్ ఉత్సవ్ పాలసీపై లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. ప్రీమియం చెల్లింపు ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవచ్చు. అప్పుపై పాలసీహోల్డర్ చెల్లించే వడ్డీ, రెగ్యులర్ ఆదాయంలో 50% మించకూడదు.
మరో ఆసక్తికర కథనం: పర్సనల్ లోన్ Vs గోల్డ్ లోన్ - ఏది తెలివైన నిర్ణయం?
CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్ లోన్ తీసుకోలేదు' - నా సిబిల్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్
Gold-Silver Prices Today 27 Dec: రూ.600 పెరిగిన ప్యూర్ గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24K, 22K పసిడి ధరలు ఇవీ
SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్ స్కీమ్ స్టార్టెడ్
New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?