By: ABP Desam | Updated at : 26 Apr 2022 08:17 PM (IST)
ఎల్‌ఐసీ,
LIC IPO Announcement Official Dates Upper Price Band Bid Lot Share Prices Details: దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న భారతీయ జీవిత బీమా (LIC IPO) ఐపీవో వివరాలు వచ్చేశాయి. ఎల్‌ఐసీ ఒక్కో షేరు ధర రూ.902-949 మధ్య ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు ఏబీపీ లైవ్‌కు వెల్లడించాయి. పాలసీ హోల్డర్లకు రూ.60 వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారని తెలిసింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు రాయితీ ఇవ్వనున్నారని సమాచారం.
బ్యాంకింగ్ వర్గాల ప్రకారం ఎల్‌ఐసీ ఐపీవో మే 2న మొదలవుతుందని తెలిసింది. యాంకర్ ఇన్వెస్టర్లు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లకు మే 4 నుంచి మే 9 వరకు అవకాశం ఇస్తున్నారు. ఈ విషయంపై ఎల్‌ఐసీ అధికార ప్రతినిధిని ఏబీపీ లైవ్ సంప్రదించగా మాట్లాడేందుకు నిరాకరించారు.
ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సేకరిస్తుందని సమాచారం. ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఇందులో 3.5 శాతం వరకు వాటాను అమ్మేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
వాస్తవంగా ఫిబ్రవరిలోనే ఎల్‌ఐసీ డ్రాఫ్ట్ పేపర్లను సెబీ వద్ద దాఖలు చేసింది. కంపెనీలో 5 శాతం వాటా లేదా 31.6 కోట్ల షేర్లను విక్రయిస్తామని తెలిపింది. హఠాత్తుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం కావడంతో ఐపీవోను వాయిదా వేసుకుంది. పరిస్థితులు కుదురుకున్నా, ఎకానమీ స్థిరత్వం పొందాక రావాలనుకున్నారు. ఇప్పటికీ సిచ్యువేషన్ సద్దుమణగక పోవడంతో ఇష్యూ సైజ్‌ను 3.5 శాతానికి కుదించారు.
ఈ ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు ఎల్‌ఐసీ ఐపీవో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ రిసిప్టులు రూ.65,000 కోట్లుకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే రూ.13,531 కోట్లు ఎక్కువ.
లాట్‌సైజ్ - 15
ప్రైజ్ బ్యాండ్ - రూ.902 - 949
రిటైల్, ఎంప్లాయీస్‌కు డిస్కౌంట్ - రూ.45
పబ్లిక్ హోల్డర్లకు డిస్కౌంట్ - రూ.60
ఇష్యూ పరిమాణం : 22.13 కోట్లు
#LICIPO 's Price Band Set At Rs 902-949, Discount Of Rs 60 For Policyholders | Check Details Herehttps://t.co/chSJA8GW4b pic.twitter.com/ZMfpwHk1aP
— ABP LIVE (@abplive) April 26, 2022
Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!
Building Wealth: ఈ 5 అలవాట్లు మీకు ఉంటే ధనలక్ష్మి మీ ఇంటి నుంచి వెళ్లదు గాక వెళ్లదు!
Gold-Silver Prices Today 19 Dec: గ్లోబల్‌గా గోల్డ్ రేటు డీలా - తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
New Year Financial Planning: ఇలాంటి ఫైనాన్షియల్ ప్లాన్‌తో కొత్త సంవత్సరం ప్రారంభించండి - ఏడాదంతా మీకు తిరుగుండదు!
Bank Timings Changed: బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - అన్ని బ్యాంకుల పని వేళల్లో మార్పులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు