By: ABP Desam | Updated at : 16 Jul 2023 10:16 AM (IST)
యాన్యుటీ ప్లాన్ అంటే ఏంటి?
SBI vs LIC Annuity Plan: ఉద్యోగ జీవితం లేదా స్థిరమైన ఆదాయం ప్రారంభమైన తొలి రోజుల నుంచే రిటైర్మెంట్ లైఫ్ కోసం ప్లాన్ చేయడం తెలివైన వ్యక్తులు చేసే పని. పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తే, రిటైర్ అయిన తర్వాత కూడా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు, అవసరాలకు సరిపడా డబ్బు ఎప్పుడూ చేతిలో ఉంటుంది. యాన్యుటీ స్కీమ్‌లో (annuity scheme) పెట్టుబడి పెట్టడం ద్వారా గోల్డెన్ ఓల్డేజ్ కోసం ఒక చక్కటి ఆర్థిక ప్రణాళికను ముందు నుంచే డిజైన్ చేయవచ్చు. ఒకవేళ మీరు యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, రెండు పెద్ద కంపెనీల్లో ఆ అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), రెండోది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).
యాన్యుటీ స్కీమ్ అంటే ఏంటి?
యాన్యుటీ స్కీమ్ అంటే, ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని అందుకునే పథకం. ఇది పెన్షన్ ప్లాన్ వంటిది. ఎల్‌ఐసీ, స్టేట్ బ్యాంక్ రెండూ ప్రభుత్వ రంగ సంస్థలు. కాబట్టి వీటిలో పెట్టే పెట్టుబడికి రిస్క్ ఉండదు. ఇవి రెండూ యాన్యుటీ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ రెండు స్కీమ్స్ పూర్తి వివరాలను అర్ధం చేసుకుంటే, దేనిని ఎంచుకోవాలో ఒక స్పష్టత వస్తుంది.
SBI యాన్యుటీ పథకం వివరాలు:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యుటీ స్కీమ్‌లో (SBI Annuity Plan) ఒకేసారి డబ్బును పెట్టుబడి పెట్టాలి. తద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెన్షన్ లాగా పొందవచ్చు. ఈ పథకంలో 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాల పరిమితి వరకు డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో కనీస పెట్టుబడి మొత్తం రూ. 25,000. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు, మీకు సాధ్యమైనంత ఎక్కువ డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే, అంత ఎక్కువ డబ్బు నెలనెలా తిరిగి వస్తుంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 75% వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ పథకాన్ని ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
LIC యాన్యుటీ పథకం వివరాలు:
ఎల్ఐసీ కూడా యాన్యుటీ బెనిఫిట్స్ అందిస్తోంది. వివిధ రకాల ప్లాన్స్ కింద బెనిఫిట్స్ అందిస్తోంది.
1. ఎల్‌ఐసీ జీవన్ శాంతి ప్లాన్ (LIC Jeevan Shanti Plan): ఈ ప్లాన్ కొనుగోలు చేసిన వెంటనే యాన్యుటీ ప్రయోజనాన్ని పొందడం ప్రారంభం అవుతుంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేవాళ్లకు మొత్తం 10 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీరు దేనినైనా ఎంచుకోవచ్చు. అదే విధంగా, మీ అవసరానికి అనుగుణంగా పేమెంట్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.
2. ఎల్‌ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ ((LIC New Jeevan Nidhi Plan): దీనిలో నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. నిర్ణీత కాల వ్యవధి తర్వాత, మీరు ప్రతి నెలా యాన్యుటీ ప్రయోజనం పొందుతారు.
3. ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ VII (LIC Jeevan Akshay VII): ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లు మొత్తం 10 ఆప్షన్లు పొందుతారు. ఇందులో పెట్టుబడి వల్ల మరణించే వరకు పెన్షన్ ప్రయోజనం పొందడం దీని ప్రత్యేకత. మీరు ఎంచుకున్న ఆప్షన్ ఆధారంగా యాన్యుటీ కోసం పెట్టుబడి పెట్టవచ్చు.
మరో ఆసక్తికర కథనం: హ్యుందాయ్ కార్లు కొనాలనుకుంటున్నారా - అయితే జులై బెస్ట్ - రూ.లక్ష వరకు తగ్గింపు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Gold-Silver Prices Today 04 Dec: స్థిరంగా బంగారం, వెండి మెరుపులు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు కొత్త ధరలు ఇవీ
Income Tax: పన్ను ఆదా చేయాలంటే ఈ నెలాఖరులోగా సీరియస్‌గా ఆలోచించాల్సిన ఆప్షన్స్ ఇవి
Tax On Salaries In India: ఐఏఎస్, ఐపీఎస్‌లు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదా, రూల్స్ అలా ఉన్నాయా?
Common Mistakes: ఈ పొరపాట్ల వల్ల స్టాక్ మార్కెట్‌లో 70 శాతం మంది డబ్బు గల్లంతు - ఆ తప్పులు మీరు చేయొద్దు!
Tax Rate Hike: సిగరెట్లు, కూల్‌డ్రింక్స్, బట్టల రేట్లు పెంపు! - కొత్త ఏడాదిలో పన్ను పోటు
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Hyderabad to Kashmir Low Budget Trip : కేవలం రూ.1700లతో హైదరాబాద్ టూ కాశ్మీర్.. లో బడ్జెట్‌తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే