By: ABP Desam | Updated at : 24 Dec 2023 08:47 AM (IST)
రిలయన్స్-ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో బోలెడు బెనిఫిట్స్
Reliance SBI Credit Card: దేశంలోని అతి పెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ కంపెనీ ఎస్‌బీఐ కార్డ్, దేశంలోని అతి విలువైన సంస్థ రిలయన్స్ కలిసి ఇటీవల ఒక క్రెడిట్ కార్డ్‌ను జారీ చేశాయి. అంటే, ఇది రిలయన్స్-ఎస్‌బీఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. లైఫ్ స్టైల్-ఫోకస్డ్ క్రెడిట్ కార్డ్‌గా దీనిని లాంచ్ చేశారు. కస్టమర్ చేసే విభిన్న రకాల షాపింగుల్లో ఇది ఉపయోగపడుతుంది.
రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్‌తో జరిపే లావాదేవీల్లో యూజర్ చాలా రకాల రివార్స్, బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ నుంచి రిటైల్ వరకు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఫార్మా వరకు, ఫర్నీచర్ నుంచి ఆభరణాల వరకు చాలా లావాదేవీల్లో ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ వినియోగదార్లు SBI కార్డ్ అందించే ఆఫర్లను కూడా ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయవచ్చు. అన్ని రిలయన్స్ రిటైల్ ఔట్‌లెట్లలో చేసే కొనుగోళ్లపై రివార్డులు పొందొచ్చు.
రిలయన్స్-ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రెండు రకాలు
రిలయన్స్ SBI కార్డ్, రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్ పేరితో రెండు రకాల కో-బ్రాండెడ్ కార్డులను ఈ కంపెనీలు లాంచ్ చేశాయి. వీటిని రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు రూపే నెట్‌వర్క్‌పై పని చేస్తాయి. కాబట్టి, వాటిని UPIకి లింక్ చేసుకోవచ్చు.
జాయినింగ్ ఫీజ్, యాన్యువల్ ఛార్జీలు (Joining Fee, Annual Charges)
రిలయన్స్ SBI కార్డ్ జాయినింగ్ ఫీజుగా రూ. 499 + GST చెల్లించాలి. అయితే, వెల్‌కమ్ బెనిఫిట్ రూపంలో ఈ డబ్బును వెనక్కు ఇస్తున్నారు. వెల్‌కమ్ బెన్‌ఫిట్ కింద 500 రూపాయల విలువైన రిలయన్స్ రిటైల్ ఓచర్ అందుతుంది. ఈ కార్డుతో చేసే కొనుగోళ్ల విలువ ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు దాటితే, మరుసటి ఏడాది ఫీజ్ కట్టాల్సిన అవసరం ఉండదు. రిలయన్స్ స్టోర్లతో ఈ కార్డుతో చేసే ప్రతి 100 రూపాయల కొనుగోలుకు 5 రివార్డు పాయింట్లు యాడ్ అవుతాయి. ఒక రివార్డు పాయింటు 25 పైసలకు సమానం. ట్రెండ్స్, అజియో, సెంట్రో, జివామె, అర్బన్ లేడర్, జియో మార్ట్‌లో కొంటే 5 శాతం డిస్కౌంట్ వస్తుంది.
రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ కోసం జాయినింగ్ ఫీజుగా రూ. 2999 + GST కట్టాలి. వెల్‌కమ్ బెన్‌ఫిట్ కింద 3000 వేల రూపాయల విలువైన రిలయన్స్ రిటైల్ ఓచర్ ఇస్తారు. ఈ కార్డుతో చేసే కొనుగోళ్ల విలువ ఒక సంవత్సరంలో 3 లక్షల రూపాయలు దాటితే తర్వాతి ఏడాదికి యాన్యువల్ ఫీజ్ ఉండదు. ఈ కార్డ్‌తో రిలయన్స్ స్టోర్లలో చేసే ప్రతి 100 రూపాయల కొనుగోలుపై 10 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
ఇతర ప్రయోజనాలు
రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్‌తో బుక్‌మైషోలో (BookMyShow) ప్రతి నెలా రూ.250 విలువ చేసే మూవీ టికెట్‌ను ఉచితంగా పొందొచ్చు. దేశీయ విమానాశ్రయాల్లో ఏడాదిలో 8 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్‌లు (త్రైమాసికానికి రెండు చొప్పున) ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్‌లు (త్రైమాసికంలో గరిష్టంగా రెండు) లభిస్తాయి.
ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు
రిలయన్స్ SBI కార్డ్‌తో అన్ని పెట్రోల్ బంకుల్లో 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది. అయితే, పెట్రోల్ బంక్‌లో చేసే ఖర్చు రూ. 500 నుంచి రూ. 4000 మధ్య ఉండాలి.
మరో ఆసక్తికర కథనం: మీ పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేయడం చాలా సులభం - 2 నిమిషాల్లో అప్లై చేయండిలా!
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...