By: ABP Desam | Updated at : 03 Apr 2023 03:11 PM (IST)
Edited By: Arunmali
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటే టాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయా?
Tax benefits: పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు అనేది ఒక జీవిత కాల లక్ష్యం. ఈ లక్ష్యాన్ని కొందరు చేరుకుంటారు, కొందరు చేరుకోలేరు. నిర్మాణం పూర్తయిన ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను కొనడానికి కొందరు మొగ్గు చూపితే, నిర్మాణంలో ఉన్నప్పుడే కొనడానికి మరికొందరు ఇష్టపడతారు. బిల్డర్లు లేదా కూలీలతో తలనొప్పి వద్దు అనుకున్నవాళ్లు, వెంటనే కొత్త ఇంట్లోకి మారదాం అనుకున్న వాళ్లు నిర్మాణం పూర్తయిన ఇంటిని కొంటారు. తమ అభిరుచికి తగ్గట్లుగా ఇల్లు ఉండాలి అనుకునేవాళ్లు నిర్మాణంలో ఉన్న గృహాన్ని కొని తగిన మార్పులు చేయించుకుంటారు.
ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఒక వ్యక్తి... బ్యాంక్ నుంచి రుణం తీసుకుని నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేశాడని అనుకుందాం. అలాంటి సందర్భంలో.. బ్యాంక్‌కు తిరిగి కట్టే అసలు మీద, వడ్డీ మీద విడివిడిగా ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. బ్యాంక్ రుణంపై తిరిగి చెల్లించే అసలుపై సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు.. చెల్లించే వడ్డీపై సెక్షన్ 24B కింద రూ. 2 లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మినహాయింపు పొందవచ్చు.
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటే ఏంటి పరిస్థితి?
ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఒక వ్యక్తి... బ్యాంక్ రుణం తీసుకుని నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ లేదా ఇంటిని కొనుగోలు చేస్తే అప్పుడు కూడా ఇవే సెక్షన్లు వర్తిస్తాయా?. ఈ ప్రశ్నకు సమాధానం.. పన్ను మినహాయింపు తక్షణం వర్తించదు. తీసుకున్న హౌస్ లోన్ మీద EMI చెల్లింపు వెంటనే ప్రారంభమైనప్పటికీ, గృహ రుణం మీద తిరిగి చెల్లించే వడ్డీ మాత్రమే ఆ EMIలోకి వస్తుంది, అసలు మొత్తంలో ఒక్క రూపాయి కూడా EMIలో ఉండదు. అంటే, మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ సమయంలో సెక్షన్ 80C కింద గృహ రుణం మినహయింపును పొందలేరు.
బ్యాంక్ లోన్ నుంచి అసలు మొత్తం కట్ కాకపోయినా EMI ద్వారా వడ్డీ కడుతూ వెళ్తారు కదా, దానిని కూడా మీరు వెంటనే క్లెయిం చేసుకోలేరు. సెక్షన్ 24B కింద ఈ వడ్డీ మినహాయింపును మీరు పొందాలంటే, ఇంటి నిర్మాణం పూర్తవ్వాల్సిందే.
ఇల్లు లేదా ఫ్లాట్ నిర్మాణం పూర్తయి, సదరు ఆస్తిని మీరు స్వాధీనం చేసుకున్నట్లు ‘పొజెషన్ సర్టిఫికేట్’ పొందిన తర్వాత మాత్రమే రుణంలో అసలు మొత్తం EMI ద్వారా కట్ కావడం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మీరు సెక్షన్ 24B కింద వడ్డీని క్లెయిం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
చెల్లించిన వడ్డీ సంగతేంటి?
ఇల్లు లేదా ఫ్లాట్ నిర్మాణం ఎంతకాలం సాగితే అంతకాలం EMI రూపంలో వడ్డీని మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. ఇలా కట్టిన వడ్డీని, ఆ ఇంటి నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత 5 సమ భాగాలుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మీ ఇంటికి ‘పొజెషన్ సర్టిఫికేట్’ పొందిన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్నప్పుడు చెల్లించిన వడ్డీని, నిర్మాణం పూర్తయిన తర్వాత చెల్లిస్తున్న వడ్డీని కలిపి మినహాయింపు పొందవచ్చు. అయితే, ఇక్కడో చిన్న మెలిక ఉంది. సెక్షన్ 24B కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు క్లెయిమ్ చేసుకోదగిన వడ్డీ మొత్తం రూ. 2 లక్షలకు మించకూడదు.
ఒక ఉదాహరణ రూపంలో ఇంకా వివరంగా దీనిని పరిశీలిద్దాం. ఒక వ్యక్తి నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కొని, ఐదేళ్ల తర్వాత దానిని స్వాధీనం చేసుకున్నాడని భావిద్దాం. ఈ ఐదేళ్ల పాటు EMI రూపంలో రూ.6 లక్షల వడ్డీ చెల్లించాడని అనుకుందాం. ఇల్లు నిర్మాణంలో ఉంది కాబట్టి, ఐటీ రిటర్న్స్‌లో ఈ ఐదేళ్లలో ఆ వడ్డీని మినహాయింపుగా పొందలేడు. ఈ వడ్డీని ఐదు సమభాగాలుగా చేసి, ఇంటిని స్వాధీనం చేసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు ఆర్థిక సంవత్సరాల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే, ఏడాదికి రూ.1.20 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ అతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల వడ్డీని చెల్లించాల్సి వస్తే... ఆ సంవత్సరంలో కట్టిన వడ్డీ మొత్తం రూ. 2.05 లక్షలు (రూ. 85 వేలు + రూ. 1.20 లక్షలు) అవుతుంది. సెక్షన్ 24B కింద రూ. 2 లక్షలు మాత్రమే గరిష్ట పరిమితిగా ఉంది కాబట్టి, ఇంత మొత్తాన్నే అతను క్లెయిమ్ చేసుకోవచ్చు, మిగిలిన 5 వేలకు మినహాయింపు వర్తించదు.
ఒకవేళ మీరు కొత్త పన్ను విధానం ప్రకారం రిటర్న్ ఫైల్ చేయాలని అనుకుంటే ఎలాంటి సెక్షన్లూ వర్తించవు. పాత పన్ను విధానానికి మాత్రమే పన్ను మినహాయింపు సెక్షన్లు వర్తిస్తాయి.
CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్ లోన్ తీసుకోలేదు' - నా సిబిల్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్
Gold-Silver Prices Today 27 Dec: రూ.600 పెరిగిన ప్యూర్ గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24K, 22K పసిడి ధరలు ఇవీ
SBI Special FD: ఎఫ్డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్బీఐ వైపు చూడండి - స్పెషల్ స్కీమ్ స్టార్టెడ్
New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!
Shock for YCP: వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?