By: ABP Desam | Updated at : 06 Jul 2022 07:43 PM (IST)
Edited By: Ramakrishna Paladi
కిసాన్ వికాస్ పత్ర పోస్టాఫీస్ స్కీమ్ ( Image Source : pixabay )
Kisan Vikas Patra Scheme Benefits: తక్కువ వడ్డీ కారణంగా బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పెట్టుబడి సాధనాలు ఏమైనా ఉన్నాయేమోనని చాలామంది వెతుకుతుంటారు. చక్రవడ్డీ ప్రయోజనం ఇచ్చే స్కీముల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra - KVP) ఒక మంచి ఆప్షన్! ఈ ఖాతాను వయోజనులు తెరవొచ్చు. పిల్లల పేరుతో పెద్దవాళ్లూ నిర్వహించొచ్చు. ముగ్గురు వరకు జాయింట్ అకౌంట్ తీసుకోవచ్చు.
KVP వడ్డీరేటు ఎంత?
2022, సెప్టెంబర్ 30 నాటికి కిసాన్ వికాస్ పత్ర (KVP interest rates) వడ్డీరేటు 6.9 శాతంగా ఉంది. ఏటా చక్రవడ్డీ చెల్లిస్తారు. వెయ్యి రూపాయల కనీస పెట్టుబడితో ఈ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితేమీ లేదు. రూ.100 పెంచుకుంటూ ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.
KVP పన్ను మినహాయింపులేంటి?
కిసాన్ వికాస్ పత్రాల రాబడిపై పన్ను మినహాయింపేమీ ఉండదు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద మినహాయింపులు ఇవ్వరు. మెచ్యూరిటీ తర్వాత సొమ్ము విత్‌డ్రా చేస్తే మూలం వద్ద పన్ను (TDS) కోసేయరు!
KVP మెచ్యూరిటీ ఏంటి?
కిసాన్ వికాస్ పత్రాల మెచ్యూరిటీ వ్యవధి 9 ఏళ్ల 5 నెలలు. పోస్టాఫీసులో ఫామ్-2 నింపి ఇవ్వడం ద్వారా మెచ్యూరిటీ అమౌంట్‌ను ఖాతాదారుకు తిరిగి ఇస్తారు. ఖాతా తెరిచినప్పుడు ఉండే వడ్డీరేటే మొత్తం ఉంటుంది. మధ్యలో మార్పులు చేయరు.
ముందే KVP సొమ్ము విత్‌డ్రా చేయొచ్చా?
కిసాన్ వికాస్ పత్రాల్లో పెట్టుబడి పెట్టిన సొమ్మును మెచ్యూరిటీ కన్నా ముందు తీసుకొనేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఖాతాదారు మరణిస్తే, తనఖా పూర్తయితే, కోర్టు ఆర్డరిస్తే మెచ్యూరిటీ పూర్తవ్వకముందే డబ్బు ఇస్తారు. ఇక అత్యవసర సందర్భాల్లో రెండేళ్ల ఆరు నెలల తర్వాత, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఖాతా బదిలీ చేసినప్పుడు సొమ్ము తీసుకోవచ్చు.
అవసరమైతే KVP తనఖా!
అవసరమైన సందర్భాల్లో కిసాన్ వికాస్ పత్రాలను తనఖా పెట్టొచ్చు. ఇందుకు సంబంధిత పోస్టాఫీసులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి, గవర్నర్, ఆర్బీఐ, షెడ్యూలు బ్యాంకు, కో ఆపరేటివ్ సొసైటీ, కో ఆపరేటివ్ బ్యాంకు, కార్పొరేషన్, ప్రభుత్వ కంపెనీ, లోకల్ అథారిటీ, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ వద్ద తనఖా పెట్టొచ్చు. అవసరాన్ని బట్టి కేవీపీని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసుకోవచ్చు.
Also Read: కొవిడ్ సంజీవని డోలో -650; కంపెనీపై ఐటీ దాడులు, కోట్ల కొద్దీ కూడబెట్టారట!!
Modi Govt Scheme: పెళ్లైన వారికి బొనాంజా! రూ.200తో ఏటా రూ.72వేలు పొందే స్కీమ్ ఇది!
Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
Gold-Silver Price: నేడు దిగివచ్చిన గోల్డ్ రేట్, వెండి ఏకంగా 800 దిగువకు - లేటెస్ట్ ధరలు ఇవీ!
Cheapest Home Loans: రెపోరేటుతో EMI భారం పెరిగిందా! ఇలా చేస్తే తక్కువ వడ్డీతో బయటపడొచ్చు!
Gold-Silver Price: మళ్లీ దూసుకెళ్లిన బంగారం ధర! వెండి కూడా అదే దారిలో, ప్లాటినం ధర నేడు రికార్డు!
CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?
SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!
TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!