ఉద్యోగ భద్రత పెరగడం, కరోనా మహమ్మారి నియంత్రణలోకి రావడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. పండగ సీజన్‌ కూడా వీటికి తోడైంది.  చేతిలో డబ్బు ఉండటంతో సురక్షితమైన పెట్టుబడి సాధనాలపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో తెలుసుకుంటున్నారు. తాజాగా రెండు ప్రైవేటు బ్యాంకులు వడ్డీరేట్లలో మార్పులు చేశాయి.


Also Read: టాటా చేతికి ఎయిర్ ఇండియా.. స్పైస్ జెట్‌తో పోటీ పడి దక్కించుకున్న టాటా సన్స్


కరూర్‌ వైశ్యా బ్యాంక్
ఈ మధ్యే కొన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. కరూర్‌ వైశ్యా బ్యాంకు తాజాగా ఈ జాబితాలో చేరింది. 2021, అక్టోబర్‌ 8 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై కనీసం 3.25 శాతం నుంచి గరిష్ఠంగా 5.60 శాతం వడ్డీని ఇస్తోంది. కాల వ్యవధిని బట్టి సీనియర్‌ సిటిజన్లకు 5.65 శాతం నుంచి 5.75 శాతం వరకు ఇస్తోంది.


7 రోజుల నుంచి 14 రోజులు, 15 నుంచి 30,  31 నుంచి 45, 46 నుంచి 90 రోజులకు 3.25% వడ్డీ ఇస్తున్నారు. 91 రోజుల నుంచి 120 రోజులకు 3.50%, 121 రోజుల నుంచి 180 రోజులకు 3.75%, 181 రోజుల నుంచి 270 రోజులకు 4.00%, 271 రోజుల నుంచి ఏడాది లోపు 4.25%, ఏడాది నుంచి రెండేళ్ల లోపు 5.15%, రెండేళ్ల నుంచి మూడేళ్లు, మూడేళ్ల నుంచి ఐదేళ్లకు 5.25%, ఐదేళ్లకు పైగా 5.60%, కేవీబీ టాక్స్‌షీల్డ్‌లో 5.75% వరకు వడ్డీ ఇస్తున్నారు.


Also Read: ఇంటర్‌నెట్ లేకున్నా పేమెంట్ చేయవచ్చు.. త్వరలో ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానం..


యాక్సిస్‌ బ్యాంక్‌
ఏడు నుంచి 29 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు 2.50 శాతం వడ్డీరేటును ఇస్తోంది. ఇక రెండు కోట్ల వరకు ఐదు నుంచి పదేళ్ల కాల వ్యవధికి గరిష్ఠంగా 5.75 శాతం వడ్డీని ఇవ్వనుంది. 30 నుంచి 45 రోజులకు, 46 నుంచి 60 రోజులకు, 61 నుంచి మూడు నెలలలోపు 3% వడ్డీ రేటు ప్రకటించింది.  మూడు నుంచి నాలుగు, ఐదు, ఆరు నెలలకు 3.5% ఇవ్వనుంది. ఆరు నుంచి ఏడాది కాలానికి 4.4%, ఏడాది నుంచి రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్లకు 5.15 నుంచి 5.75 శాతం వడ్డీ ఇవ్వనుంది. సీనియర్‌ సిటిజన్లు గరిష్ఠంగా 5.75 శాతం వడ్డీరేటు ప్రకటించింది.


Also Read: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆ లావాదేవీల పరిమితి పెంపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి