By: ABP Desam | Updated at : 26 Jun 2023 11:20 AM (IST)
ఐటీ రిఫండ్ ఇంకా అందలేదా?
Income Tax Refund: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఫామ్-16ల జారీ ప్రారంభం కావడంతో ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్న వాళ్ల సంఖ్య ఈ నెల 15 నుంచి వేగంగా పెరిగింది. మీరు కూడా మీ రిటర్న్ ఫైల్ చేసి, మీకు రావల్సిన ట్యాక్స్ రిఫండ్‌ను ఇంకా అందుకోకపోతే, రిఫండ్ స్టేటస్‌ను సులభంగా చెక్ (Check Income Tax Refund Status) చేసుకోవచ్చు. తద్వారా, రిఫండ్ ప్రాసెస్ ఎంత దూరం వచ్చిందో ఈజీగా అర్ధం అవుతుంది.
ఆదాయ పన్ను వాపసు స్థితిని ఎలా తనిఖీ చేయాలి?
ఆదాయ పన్ను విభాగం పోర్టల్ ద్వారా ITR రిఫండ్ స్టేటస్‌ను పన్ను చెల్లింపుదార్లు చూడవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేసిన తర్వాత, ఆ ప్రాసెస్ ఎంత వరకు పూర్తయిందో తెలుసుకునే ఆప్షన్‌ను ఆదాయ పన్ను విభాగం గతంలోనే తీసుకువచ్చింది. అదే విధంగా, రిఫండ్ స్థితిని కూడా తనిఖీ చేయవచ్చు.
లాగిన్ అవసరం లేకుండానే IT రిఫండ్ స్టేటస్ చెక్ చేయవచ్చు
ముందుగా, ఆదాయ పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ను సందర్శించండి.
హోమ్ పేజీలో కనిపించే ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ స్టేటస్ (Income Tax Return (ITR) Status) మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ ITR అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ (Acknowledgement Number), రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆదాయ పన్ను విభాగం నుంచి OTP వస్తుంది. ఆ OTPని సంబంధిత బాక్స్‌లో నమోదు చేసి, సబ్మిట్ బటన్ నొక్కాలి.
ఇప్పుడు, మీ పూర్తి ట్యాక్స్ రిఫండ్ స్టేటస్ మీకు కనిపిస్తుంది.
మీ యూజర్ ID & పాస్‌వర్డ్‌తో ఉపయోగించి కూడా ఆదాయపు పన్ను పత్రాల పరిస్థితిని తనిఖీ చేయవచ్చు. ఇందుకోసం, https://www.incometax.gov.in/iec/foportal/ లింక్ ద్వారా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో.. యూజర్ ఐడీ & పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత, మీరు ITR స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఐటీఆర్ స్టేటస్, రిఫండ్‌కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.
అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ (Acknowledgement Number) ఎలా తెలుస్తుంది?
ఆదాయ పన్ను విభాగం పోర్టల్‌లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేయడానికి అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ అవసరం. ITR ఫైల్ చేసిన తర్వాత మీకు అందే రిసిప్ట్‌లో Acknowledgement Number ఉంటుంది. ITR ఫైలింగ్ తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు కూడా అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది. ఈ రెండు మార్గాల ద్వారా అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ మీకు తెలియకపోతే మరో మార్గం కూడా ఉంది. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ లోకి మీరు లాగిన్ అయి, ITR రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానిలో మీ ITR అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: దాస్ నోట ₹2 వేల మాట, సెప్టెంబర్ 30 తర్వాత పింక్ నోట్లు చెల్లవా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Women Investment: ఆడవాళ్లు ఆర్థికంలో అదరగొడుతున్నారు: AMFI-Crisil నివేదిక
PF Withdrawal: ఇదీ శుభవార్తంటే - PF ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు!
Gold-Silver Prices Today 01 April: రూ.95,000 చేరిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
New Rules From April: UPI నుంచి IT వరకు, గ్యాస్ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
Gold-Silver Prices Today 31 Mar: రూ.93,000 దాటిన స్పాట్ గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Renu Desai Video: హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్
Waqf Amendment Bill: నేడు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Divyabharathi: తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీతో డేటింగ్... మరోసారి బాంబు పేల్చిన దివ్యభారతి