By: Arun Kumar Veera | Updated at : 28 May 2024 06:06 PM (IST)
నిర్మాణంలో ఉన్న ఇంటిపై అప్పును సెక్షన్ 80C, 24B కింద క్లెయిమ్ చేయొచ్చా?
Income Tax Return Filing 2024: గృహ రుణం తీసుకుని ఇల్లు కొంటే, ఆదాయ పన్ను చట్టం ప్రకారం, బ్యాంక్‌కు తిరిగి చెల్లించే అసలు (Principal Amount) మీద & వడ్డీ (Interest Amount) మీద వేర్వేరుగా మినహాయింపు (Income Tax Exemption) క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే అసలుపై రూ. 1.50 లక్షల వరకు & వడ్డీపై సెక్షన్ 24B కింద రూ. 2 లక్షల వరకు ITR సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
నిర్మాణం పూర్తి కాని ఇల్లు/ఫ్లాట్ కొంటే క్లెయిమ్ చేయవచ్చా?
బ్యాంక్ రుణం తీసుకుని, నిర్మాణంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేస్తే.. పన్ను మినహాయింపులు వెంటనే వర్తించవు. తీసుకున్న రుణంపై (Home Loan) నెలవారీ చెల్లింపు ప్రారంభమైనప్పటికీ, ‘పొసెషన్ సర్టిఫికేట్’ (Possession Certificate) వచ్చే వరకు రుణగ్రహీత వడ్డీ మాత్రమే చెల్లిస్తాడు. ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఆ చెల్లింపుల్లో ఉండదు. కాబట్టి, ఆదాయ పన్ను పత్రాలు ఫైల్ చేసే సమయంలో సెక్షన్ 80C కింద గృహ రుణం మినహాయింపు రాదు. వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ, దానిని కూడా వెంటనే క్లెయిం చేసుకోలేరు. సెక్షన్ 24B కింద వడ్డీని క్లెయిమ్ చేయాలంటే గృహ నిర్మాణం పూర్తి కావాలి.
చెల్లించిన వడ్డీ పరిస్థితేంటి?
ఇల్లు లేదా ఫ్లాట్ నిర్మాణ సమయంలో రుణదాతకు చెల్లించిన వడ్డీని, నిర్మాణం పూర్తయిన 5 సమాన భాగాలుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిని ‘పొసెషన్ సర్టిఫికేట్’ పొందిన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. పొసెషన్ సర్టిఫికేట్’ రాకముందు చెల్లించిన వడ్డీని, వచ్చిన తర్వాత చెల్లిస్తున్న వడ్డీని కలిపి మినహాయింపు తీసుకోవచ్చు. అయితే, సెక్షన్ 24B కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో క్లెయిమ్ చేసుకునే వడ్డీ మొత్తం (పాతది, కొత్తది కలిపి) రూ.2 లక్షలకు మించకూడదు.
ఉదాహరణకు... A అనే టాక్స్‌పేయర్ నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కొని, ఐదేళ్ల తర్వాత దానిని స్వాధీనం చేసుకున్నాడని అనుకుందాం. ఈ ఐదేళ్లలో మొత్తం రూ. 6 లక్షల వడ్డీ చెల్లించాడని భావిద్దాం. A, తన ఇంటికి స్వాధీన పత్రం (Possession Certificate) తీసుకున్న తర్వాత అసలు EMI స్టార్ట్ అవుతుంది. అప్పుడు, గతంలో చెల్లించిన రూ. 6 లక్షల వడ్డీని ఐదు సమభాగాలుగా చేసి, ఐదు ఆర్థిక సంవత్సరాల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే, ఏడాదికి ఒక లక్ష 20 వేల రూపాయలు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ అతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 90,000 వడ్డీని చెల్లించాల్సి వస్తే... ఆ సంవత్సరంలో కట్టిన వడ్డీ మొత్తం రూ. 2.10 లక్షలు (90,000 + 1,20,000) అవుతుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24B కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షలు మాత్రమే గరిష్ట పరిమితి కాబట్టి, అంత మొత్తాన్నే అతను క్లెయిమ్ చేసుకోగడు. మిగిలిన రూ. 10,000కు మినహాయింపు వర్తించదు.
ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) ప్రకారం, పాత పన్ను విధానంలో ITR ఫైల్ చేస్తేనే సెక్షన్ 80C, 24B వర్తిస్తాయి. కొత్త పన్ను విధానానికి ఎలాంటి సెక్షన్లు వర్తించవు.
మరో ఆసక్తికర కథనం: తీసివేతలు ఉండవు, అన్నీ కూడికలే - చల్లటి కబురు చెప్పిన ఇన్ఫోసిస్
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్ - ఎలా అప్లై చేయాలి?
Silver ETFs: సిల్వర్ ఈటీఎఫ్‌లు, బంగారానికి పోటీగా లాభాలు - ఇలా పెట్టుబడి పెట్టండి
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
Gold-Silver Prices Today 11 Dec: రూ.80,000 దగ్గరలో పసిడి, రూ.1,000 తగ్గిన వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gold-Silver Prices Today 10 Dec: అమాంతం పెరిగిన బంగారం, వెండి నగల రేట్లు - ఈ రోజు గోల్డ్, సిల్వర్ కొత్త ధరలు ఇవీ
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?