By: Arun Kumar Veera | Updated at : 14 May 2024 02:42 PM (IST)
'యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్'లో కొత్త ఫెసిలిటీ
Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే సీజన్ కొనసాగుతోంది. పన్ను చెల్లింపులకు సంబంధించి, ఆదాయ పన్ను విభాగం ఎప్పటికప్పుడు ఏదోక అప్‌డేట్ ఇస్తూనే ఉంది. తాజాగా, "వార్షిక సమాచార ప్రకటన"లో (Annual Information Statement లేదా AIS) కొత్త ఫీచర్‌ను జోడించినట్లు తెలిపింది.
ఒక ఇండివిడ్యువల్ టాక్స్‌పేయర్‌కు జీతం/వ్యాపార ఆదాయం/రెమ్యునరేషన్ రూపంలోనే కాకుండా, వారికి తెలీకుండానే మరికొన్ని మార్గాల నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది. జీతం కాకుండా ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయాల (Income from other resources) గురించి AIS చెబుతుంది. దీనివల్ల, ఆయా లావాదేవీలపై పన్ను వర్తించే అవకాశం గురించి పన్ను చెల్లింపుదారుకు తెలుస్తుంది. ITR ఫైల్ చేసే ముందు దీనిని కచ్చితంగా చూడడం తెలివైన టాక్స్‌పేయర్ లక్షణం. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పారదర్శకత తీసుకురావడానికి, పన్ను చెల్లింపుదార్ల సెల్ఫ్-ఫైలింగ్ పక్రియను సులభంగా మార్చడానికి డిపార్ట్‌మెంట్ దీనిని ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనిని మరింత అప్‌డేట్ చేస్తోంది. ఫామ్-16తో పాటు AISను కూడా చూడడం వల్ల, ఫైలింగ్‌లో తప్పులు జరిగే అవకాశాలు దాదాపుగా తగ్గిపోతాయి.
AISలో వచ్చిన కొత్త వ్యవస్థ
ఇప్పుడు, AISలో కనిపించే ప్రతి లావాదేవీపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చే సౌలభ్యం పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులోకి వచ్చింది. సోర్స్ నుంచి అందుకున్న సమాచారానికి సంబంధించిన ఖచ్చితత్వంపై పన్ను చెల్లింపుదారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. తప్పుడు రిపోర్టింగ్ విషయంలో, అది ఆటోమేటిక్‌గా ధృవీకరణ కోసం సోర్స్‌కు వెళుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్ ద్వారా, ఆదాయ సమాచారం అందించిన మార్గం/సోర్స్ గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది. సమాచార ధృవీకరణ పని ఏ స్థాయిలో ఉందో "స్టేటస్" కూడా చెక్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారు ఇచ్చిన స్పందనను పాక్షికంగా లేదా పూర్తిగా సదరు వనరు అంగీకరించిందా లేదా అన్నది అందులో తెలుస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (CBDT) పేర్కొంది.
CBDT releases new functionality in AIS to increase transparency.
👉In AIS, taxpayer has been provided with a functionality to furnish feedback on every transaction displayed therein. This feedback helps the taxpayer to comment on the accuracy of the information provided by the… pic.twitter.com/mOuvECzOKS— Income Tax India (@IncomeTaxIndia) May 13, 2024
CBDT ప్రకటన ప్రకారం, పన్ను చెల్లింపుదారు అభిప్రాయాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఆ సోర్స్ అంగీకరించిందా లేదా తిరస్కరించిందా? అన్న విషయం ఇక్కడ తెలుస్తుంది. పాక్షిక లేదా పూర్తి అంగీకారం విషయంలో, మూలం నుంచి దిద్దుబాటు ప్రకటనను దాఖలు చేయడం ద్వారా సమాచారాన్ని సరిచేయాలి.
మరో ఆసక్తికర కథనం: షాక్ ట్రీట్‌మెంట్ డోస్ పెంచిన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Ind vs Sa 3rd T20 Records: భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు.. పాండ్యా, తిలక్ వర్మ అరుదైన ఘనత
BJP National Working President: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ