search
×

Tax on EPF: ఈపీఎఫ్‌ మీద టాక్స్‌ ఎలా లెక్కిస్తారు? విత్‌డ్రా రూల్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి

EPF Withdrawal Rules: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఉద్యోగుల కోసం స్టార్ట్‌ చేసిన పదవీ విరమణ పొదుపు పథకం. కాంట్రిబ్యూషన్‌ స్టేట్‌లో ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.

FOLLOW US: 
Share:

Interest And Withdrawal Rules Of EPF: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలనుకుంటే, పన్నుకు సంబంధించిన లెక్కలు, చిక్కులను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఊహించని పన్ను భారం మీద పడకుండా అడ్డుకోవడానికి, జేబును చిల్లు పడకుండా కాపాడుకోవడానికి ఇది చాలా కీలకం. EPF విత్‌డ్రా మీద టాక్స్‌ ఎలా లెక్కిస్తారు, దానిని ప్రభావితం చేసే అంశాలేంటి అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అంటే?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఒక ఉద్యోగి పదవీ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ‍‌(retirement savings scheme). ఈ అకౌంట్‌కు డబ్బు జమ చేస్తున్నంతకాలం ఇది పన్ను ప్రయోజనాలు (income tax benifits) అందిస్తుంది. అయినప్పటికీ, మీరు జమ చేసిన డబ్బును ఉపసంహరించుకునేటప్పుడు (Withdrawal of EPF) టాక్స్‌కు సంబంధించిన అడ్డంకులు వస్తాయి. విత్‌డ్రాకు కారణం, ఉద్యోగంలో ఉన్న కాల వ్యవధి వంటి అంశాలపై పన్నులు ఆధారపడి ఉంటాయి.

ఈపీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌తో పన్ను ప్రయోజనాలు ‍‌(Tax Benefits of EPF Contributions)

ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఈపీఎఫ్‌ కోసం పెట్టే పెట్టుబడిలో, రూ. 1.5 లక్షల వరకు మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు.

కంపెనీ కాంట్రిబ్యూషన్‌: ఉద్యోగి జీతంలో 12 శాతం వరకు యజమాన్యం వాటాగా ఉంటుంది, దీనిపై పన్ను మినహాయింపు ఉంటుంది.

ఈపీఎఫ్‌ మీద టాక్స్‌ ఎలా విధిస్తారు? (How Your EPF Is Taxed?)

కాంట్రిబ్యూషన్స్‌ మీద వడ్డీ ‍‌(Interest on Contributions): ఆర్థిక చట్టం 2021లో చేసిన సవరణ ప్రకారం, ఉద్యోగుల విరాళాలపై రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ వడ్డీ ఉంటే దానిపై పన్ను విధిస్తారు. అంతేకాదు, వడ్డీ రేటు సంవత్సరానికి 9.5 శాతానికి మించి ఉంటే అదనపు వడ్డీపైనా ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లించాలి.

యాజమాన్యం కంట్రిబ్యూషన్‌ (Employer Contribution): ఆదాయ పన్ను నిబంధనలలోని సెక్షన్ 17(2)(IA) ప్రకారం, యజమాని సహకారం (కాంట్రిబ్యూషన్‌) రూ. 7.5 లక్షలు దాటితే పన్ను విధిస్తారు.

ఏకమొత్తంలో ఉపసంహరణలు ‍‌(Lump-Sum Withdrawals): ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10(12) ప్రకారం, ఒక ఉద్యోగి 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల కంటిన్యూగా సర్వీస్‌ పూర్తి చేసినట్లయితే, EPF నుంచి ఏకమొత్తంలో తీసుకునే ఉపసంహరణలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే, మినహాయింపు ఇస్తారు.

పన్ను వినహాయింపు లభించే మరికొన్ని పరిస్థితులు:

ఉద్యోగి అనారోగ్యం కారణంగా ఖాతాను రద్దు చేసుకున్నప్పుడు వచ్చే మొత్తంపై ఆదాయ పన్ను చెల్లించాల్సిన పని లేదు.

ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ మూతబడితే, ఆ సందర్భంలోనూ పన్ను టాక్స్‌ మినహాయింపు (tax exemption) తీసుకోవచ్చు.

ఉద్యోగం మారి కొత్త కంపెనీలోకి EPF బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకున్నప్పుడు

ఈపీఎఫ్‌ విత్‌డ్రా మీద టీడీఎస్‌ (TDS on EPF Withdrawals):

ఒక ఉద్యోగి ఐదేళ్ల లోపు సర్వీస్‌లో ఉండి, రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ EPF మొత్తాన్ని విత్‌డ్రా చేసినప్పుడు PAN సమర్పించి, ఫామ్-15G/15H ఇవ్వకపోతే 10 శాతం TDS కట్‌ అవుతుంది.

ఒక ఉద్యోగి ఐదేళ్ల లోపు సర్వీస్‌లో ఉండి, EPF మొత్తాన్ని విత్‌డ్రా చేసినప్పుడు PAN ఇవ్వకపోతే మోత మోగిపోద్ది, TDS కటింగ్‌ గరిష్టంగా 39 శాతం వరకు ఉంటుంది.

ఈ టాక్స్‌ రూల్స్‌ను ఉద్యోగులు గుర్తు పెట్టుకుంటే, EPF ఖాతా నుంచి డబ్బు వెనక్కు తీసుకునే విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకునే స్కోప్‌ పెరుగుతుంది, టాక్స్‌ బర్డెన్‌ నుంచి తప్పించుకోవచ్చు.

మరో ఆసక్తికర కథనం: యూపీఐకి గుడ్‌బై చెప్పేస్తాం - స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన జనం

Published at : 23 Sep 2024 01:30 PM (IST) Tags: EPF Employees Provident Fund Tax On PF Interest How Your EPF Is Taxed Tax On PF Withdrawal

ఇవి కూడా చూడండి

Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా

Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్‌" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!

Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్‌ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?

Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్‌ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?

Gold Creates New Records: 7 రోజుల్లో 5 రికార్డ్‌లు బద్ధలు - అక్షయ తృతీయ నాడు రేటు ఎలా ఉండొచ్చు?

Gold Creates New Records: 7 రోజుల్లో 5 రికార్డ్‌లు బద్ధలు - అక్షయ తృతీయ నాడు రేటు ఎలా ఉండొచ్చు?

Cheaper Life Insurance: చవకైన జీవిత బీమా కావాలా?, ఈ 7 సింపుల్‌ ట్రిక్స్‌ ప్రయత్నించండి

Cheaper Life Insurance: చవకైన జీవిత బీమా కావాలా?, ఈ 7 సింపుల్‌ ట్రిక్స్‌ ప్రయత్నించండి

టాప్ స్టోరీస్

Andhra Pradesh BJP State President : "నేనంటే నేను" ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ! క్యూలో కీలక నేతలు !

Andhra Pradesh BJP State President :

Warangal Crime News: వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?

Warangal Crime News: వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?

AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు

AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు

Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?

Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?