By: Arun Kumar Veera | Updated at : 05 Nov 2024 03:32 PM (IST)
మంచి రాబడి ఇచ్చే స్కీమ్స్ ఇవి ( Image Source : Other )
Post Office Savings Schemes: ఏదైనా పెట్టుబడిని ప్రారంభించాలంటే ఎక్కువ డబ్బు అవసరం లేదు. మీ దగ్గర చాలా తక్కువ డబ్బు ఉన్నా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. చిన్న మొత్తాలను పొదుపు చేసేలా ప్రజలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం పొదుపు పథకాలను రన్ చేస్తోంది. ప్రభుత్వ మద్దతుతో నడిచే స్కీమ్స్ కాబట్టి వాటిలో ఈ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. అంతేకాదు, రిస్క్ లేని రాబడిని కూడా అందిస్తాయి.
అదనంగా, చిన్న మొత్తాల పొదుపు పథకాలతో ఆదాయ పన్ను ప్రయోజనాలూ అందుతాయి. వీటిలో పెట్టుబడులపై, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5౦ లక్షల వరకు పన్ను మినహాయింపులకు అర్హత పొందొచ్చు. అంటే, వడ్డీ రూపంలో రాబడి రావడమే కాదు, పన్ను ఆదా రూపేణా కూడా డబ్బు మిగులుతుంది. దీనికి మించి మరొక బెనిఫిట్ ఉంది. మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాలు వైవిధ్యాన్ని తీసుకువస్తాయి. తద్వారా, వివిధ ఆస్తుల మధ్య రిస్క్ తగ్గి, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది.
బెస్ట్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ - వడ్డీ ఆదాయం వివరాలు:
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (Post Office Savings Account): ఈ ఖాతాను వ్యక్తిగతంగా లేదా మరొకరితో కలిసి జాయింట్‌గానూ తెరవొచ్చు. కనీసం రూ. 500 డిపాజిట్ అవసరం, గరిష్ట పరిమితి లేదు. వడ్డీ రేటు (Rate of Interest) సంవత్సరానికి 4 శాతం.
నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (National Savings Recurring Deposit Account): నెలవారీ డిపాజిట్ రూ. 100తో ప్రారంభమవుతుంది. గరిష్ట పరిమితి లేదు. వడ్డీ రేటు 6.70 శాతం. ఒకే వ్యక్తి లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతా తెరవవచ్చు. మైనర్ లేదా ప్రత్యేక అవసరాలున్న వ్యక్తి తరపున సంరక్షకుడు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 10 సంవత్సరాల వయస్సు పైబడిన మైనర్ కూడా ఖాతా తెరవవచ్చు.
జాతీయ పొదుపు నెలవారీ ఆదాయ ఖాతా (National Savings Monthly Income Account): కనీసం రూ. 1,000 డిపాజిట్ చేయాలి. వ్యక్తిగత ఖాతాలకు గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 9 లక్షలు, జాయింట్ ఖాతాలకు రూ. 15 లక్షలు. జాయింట్ ఖాతాలో పెట్టుబడిని ఖాతాదార్లు సమానంగా పంచుకోవాలి. వడ్డీ రేటు సంవత్సరానికి 7.40 శాతం.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Savings Scheme): కనీస డిపాజిట్ రూ. 1,000. ఒక వ్యక్తి అన్ని SCSS ఖాతాల్లో కలిపి గరిష్టంగా రూ. 30 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. ఈ ఖాతా 8.20 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund): ప్రతి ఆర్థిక సంవత్సరంలో, PPF అకౌంట్‌లో కనీసం రూ. 500 - గరిష్టంగా రూ. 1.50 లక్షల డిపాజిట్ చేయాలి. వడ్డీ రేటు సంవత్సరానికి 7.10 శాతం. ఖాతాలను నగదు లేదా బ్యాంక్ చెక్కుతో తెరవొచ్చు.
కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra): ఈ అకౌంట్‌లో గరిష్ట పరిమితి లేదు. కనీస డిపాజిట్ రూ. 1,000. దీనిపై ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీ రేటు 7.50 శాతం.
సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana): ఒక ఆర్థిక సంవత్సరంలో, SSYలో కనిష్టంగా రూ. 250 డిపాజిట్ చేయాలి, గరిష్ట పరిమితి రూ. 1.50 లక్షలు. వడ్డీ రేటు సంవత్సరానికి 8.20 శాతం.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (Mahila Samman Savings Certificate): కనీసం 1,000 రూపాయలతో ఖాతా స్టార్ట్ చేయాలి. గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు. సంవత్సరానికి 7.50 శాతం వడ్డీ ఆదాయాన్ని అందుకోవచ్చు.
జాతీయ పొదుపు పత్రం (National Savings Certificate): NSC అకౌంట్‌లో డిపాజిట్‌పై గరిష్ట పరిమితి లేదు. కనిష్ట పెట్టుబడి రూ. 1,000. వడ్డీ రేటు సంవత్సరానికి 7.70 శాతం. ఈ డిపాజిట్లను ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Best Mutual Fund SIP: పదేళ్లలో లక్షాధికారి అయ్యే మార్గం SIPతో సులభం- 44 లక్షలు మీవే!
Lower Interest Rates: వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్‌లు - SBI FD కష్టమర్లకు షాక్!
Loan Against FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంటే ఈజీగా లోన్, ఎఫ్‌డీని రద్దు చేసే పని లేదు
Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
Interest Rates Reduced: లోన్ తీసుకునేవాళ్లకు గుడ్ న్యూస్, ఈ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
CLP Meeting: ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Andhra liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
Ravi Teja - Chakri: చక్రి కుటుంబానికి రాయల్టీ ఇచ్చిన రవితేజ నిర్మాతలు - ఎందుకో తెలుసా?